Home
Mobile

హానర్ 400 మొబైల్ సిరీస్ స్పెసిఫికేషన్స్ లీక్డ్.. 6.55-అంగుళాల 1.5K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్, ఇంకా

Honor 400 Series: హానర్ కంపెనీ చైనా మార్కెట్ కోసం హానర్ 400 (Honor 400) స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. లేటెస్ట్ లీకుల ప్రకారం, హానర్ 400, హానర్ 400 Pro మోడల్స్‌లో మెరుగైన అప్‌గ్రేడ్స్ ఉండబోతున్నాయి. ముఖ్యంగా డిస్‌ప్లే, పర్ఫార్మెన్స్ విషయంలో ఈ ఫోన్లు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయని టెక్ నిపుణులు అంటున్నారు. ఇంకా వీటి ధరలు, ఇతర ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

* హానర్ 400 మిడ్-రేంజ్‌లో బెస్ట్ ఫోన్

హానర్ 400 ఫోన్‌ 6.55- అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో రానుందని సమాచారం. దీనివల్ల విజువల్స్ స్పష్టంగా కనిపిస్తాయి. స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. హానర్ 400 ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్ 4 (SM7750) ప్రాసెసర్‌ను వాడబోతున్నారు. దీని ముందు మోడల్‌లో స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్ 3 ప్రాసెసర్ వాడారు.

Honor 400 series Honor 400 and 400 Pro Early Specs Hint at Exciting Features

అంటే పర్ఫార్మెన్స్ పరంగా ఇది భారీ అప్‌గ్రేడ్ అని చెప్పొచ్చు. స్పీడ్, ఎఫిషియెన్సీ, ఓవరాల్ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా మెరుగ్గా ఉంటాయి. స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్ 4 చిప్‌సెట్‌తో రాబోయే మొట్టమొదటి ఫోన్లలో హానర్ 400 ఒకటి కావచ్చు. దీనితో పాటు ఐకూ Z10 కూడా ఈ చిప్‌సెట్‌తో వస్తుందని అంటున్నారు.

* హానర్ 400 ప్రోలో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు

హానర్ 400 ప్రో మోడల్‌లో కొంచెం పెద్దదైన 6.69-అంగుళాల 1.5K OLED కర్వ్డ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది కూడా 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. హానర్ 200 ప్రోలో స్నాప్‌డ్రాగన్‌ 8s జెన్ 3 ప్రాసెసర్, హానర్ 300 ప్రోలో స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్ 3 ప్రాసెసర్ అందించారు.

హానర్ 400 ప్రోలో మాత్రం శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్ 3 చిప్‌సెట్‌నే కొనసాగిస్తున్నారు. దీనివల్ల టాప్-టైర్ పర్ఫార్మెన్స్, స్మూత్ మల్టీటాస్కింగ్, ఎక్స్‌లెంట్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ గ్యారెంటీ. అయితే హానర్ 300 ప్రోలో 6.78- అంగుళాల FHD+ స్క్రీన్ ఉండగా, హానర్ 400 ప్రోలో మాత్రం కొంచెం చిన్నదైనా, చాలా షార్ప్ డిస్‌ప్లే ఉండబోతోంది.

* హానర్ 400 అల్ట్రా, హానర్ 400 లైట్ సంగతేంటి?

హానర్ 400 అల్ట్రా గురించి ఇంకా ఎలాంటి లీకులు రాలేదు. కానీ హానర్ 400 లైట్ మాత్రం గూగుల్ ప్లే కన్సోల్‌లో కనిపించింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్‌తో, 8GB RAM, ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుందని అంటున్నారు.

ఈ ఫోన్‌లో 1080 × 2412 రిజల్యూషన్ డిస్‌ప్లే, 480 dpi పిక్సెల్ డెన్సిటీ ఉండొచ్చు. అలాగే, పిల్‌-షేప్డ్ కెమెరా కటౌట్, కుడివైపు ఫిజికల్ బటన్స్ కూడా ఉండొచ్చని లీకులు చెబుతున్నాయి. మొత్తానికి హానర్ 400 సిరీస్ డిస్‌ప్లే, పర్ఫార్మెన్స్, ఫీచర్ల పరంగా మంచి అప్‌గ్రేడ్స్‌తో వస్తోంది.

స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్ 4, స్నాప్‌డ్రాగన్‌ 8 Gen 3 ప్రాసెసర్స్‌తో ఈ ఫోన్లు రానుండటంతో, యూజర్లు మంచి స్పీడ్, స్మూత్ గేమింగ్, సూపర్ విజువల్స్‌ను ఆశించవచ్చు. మరిన్ని వివరాలు త్వరలోనే బయటికి వస్తాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Honor 400 series leaks reveal powerful displays and performance upgrades. The 400 gets Snapdragon Gen 4, Pro retains Gen 3, and Lite uses Dimensity. Expect enhanced visuals and speed.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X