రూ.251కే 3G స్మార్ట్‌ఫోన్: ఎలా బుక్ చేయాలంటే..

Written By:

మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత్‌లో కేవలం రూ. 251కే స్మార్ట్‌ఫోన్ అందించనున్నారు. నోయిడాకు చెందిన రింగింగ్ బెల్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి ఈ రోజు తీసుకురానుంది. మోడీ చేతుల మీదుగా దీన్ని సాయంత్రం లాంచ్ చేయనున్నారు.

Read more: రూ.500కే స్మార్ట్‌ఫోన్, రేపే విడుదల

రూ.251కే 3G స్మార్ట్‌ఫోన్: ఎలా బుక్ చేయాలంటే..

ప్రధానమంత్రితో పాటు రక్షణ శాఖా మంత్రి మనోహర్ పారికర్ అలాగే బీజెపీ సీనియర్ ఎంపీ మురళీ మనోహర్ జోషీ తదితరుల సమక్షంలో న్యూఢిల్లీలో ఈ ఫోన్‌ను గ్రాండ్ గా ఓపెన్ చేయనున్నారు. పెద్దగా ఎవరికీ తెలియని రింగింగ్ బెల్స్ కంపెనీ గతంలో రూ. 500 కన్న తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్ అందిస్తామని ప్రకటించి ఆశ్చర్యంలో ముంచెత్తింది.

Read more: అమెరికా నుంచి హైదరాబాద్‌కు ఆపిల్ కంపెనీ

అయితే ఇప్పుడు ఆ సంస్థ తమ ఫోన్‌ ధరను రూ. 251గా ఖరారుచేసింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు లభించే స్మార్ట్ ఫోన్‌గా ఇది నిలువనుంది.మరి దీని ఫీచర్స్‌పై, బుకింగ్ పై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫ్రీడమ్ 251లోని ఫీచర్స్

డిస్‌ప్లే: నాలుగు అంగుళాలు, ప్రాసెసర్‌: 1.3GHz quad-core

ఫ్రీడమ్ 251లోని ఫీచర్స్

ర్యామ్‌: 1 జీబీ, ఇంటర్నల్ స్టోరేజ్‌: 8 జీబీ, ఎక్స్‌పాండబుల్ స్టోరేజీ: 32 జీబీ వరకు

ఫ్రీడమ్ 251లోని ఫీచర్స్

వెనుక కెమెరా: 3.2 మెగాపిక్సెల్, ముందు కెమెరా: 0.3 మెగాపిక్సెల్, 

ఫ్రీడమ్ 251లోని ఫీచర్స్

3జీ నెట్ వర్క్ , బ్యాటరీ: 1450mAh

ఈ ఫోన్ కేవలం మూడు రోజులు మాత్రమే ఆన్‌లైన్‌లో

అలాగే ఈ ఫోన్ కేవలం మూడు రోజులు మాత్రమే ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. ఫిబ్రవరి 18 ఉదయం 6 నుండి 21 వతేదీ సాయంత్రం 8 గంటల వరకు ఈ ఆపర్ అందుబాటులో ఉంటుంది.

ఆండ్రాయిడ్ 5.1 లాలీ పాప్, వన్ ఇయర్ వారంటీ

ఆండ్రాయిడ్ 5.1 లాలీ పాప్, వన్ ఇయర్ వారంటీ తో పాటు 650 సర్వీసు సెంటర్లను అందుబాటులో ఉంచామని కంపెనీ వెబ్ సైట్ లో తెలిపారు. 

ఈ స్మార్ట్‌ఫోన్‌ను జూన్ 30న డెలివరీ చేసే అవకాశం

కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను జూన్ 30న డెలివరీ చేసే అవకాశం ఉంది. కంపెనీ వెబ్‌సైట్‌లో మాత్రమే దొరకుతుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ను బుక్ చేయాలనుకుంటే

ఎవరైనా ఈ స్మార్ట్‌ఫోన్‌ను బుక్ చేయాలనుకుంటే కంపెనీ వెబ్‌సైట్ http://www.freedom251.com/.లో కెళ్లి బుక్ చేసుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వం అందించిన భారీ మద్దతుతో

అయితే కేంద్ర ప్రభుత్వం అందించిన భారీ మద్దతుతో ఫ్రీడమ్ 251 ఫోన్‌ను తయారు చేశామని, ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 'మేకిన్ ఇండియా' పథకంలో భాగంగానే ఈ విజయం సాధించామని రింగింగ్ బేల్స్ సంస్థ ప్రకటించింది.

ప్రధాని మోదీ ప్రవచిస్తున్న 'డిజిటల్ ఇండియా' కార్యక్రమానికి

ప్రధాని మోదీ ప్రవచిస్తున్న 'డిజిటల్ ఇండియా' కార్యక్రమానికి ఈ ఫోన్‌ భారీగా ఊతమందించే అవకాశముంది. అధిక ధరతో స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేయలేని గ్రామీణ అట్టడుగు వర్గాలకు ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది.

గతంలో బలహీన వర్గాలకు కంప్యూటర్ సేవలను

గతంలో బలహీన వర్గాలకు కంప్యూటర్ సేవలను చేరువ చేసేందుకు 'ఆకాశ్ ట్యాబ్లెట్ల' పథకాన్ని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌తో మరింత ముందుకు దూసుకెళ్లే అవకాశం ఉంది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. 

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write How to book India's cheapest smartphone Freedom 251
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot