హెచ్‌టీసీ vs సామ్‌సంగ్ (ఆండ్రాయిడ్ ఫాబ్లెట్ యుద్ధం)

Posted By: Super

హెచ్‌టీసీ  vs సామ్‌సంగ్  (ఆండ్రాయిడ్ ఫాబ్లెట్ యుద్ధం)

 

పెద్ద డిస్‌ప్లే కలిగిన స్మార్ట్‌ఫోన్‌లకు ఆదరణ పెరుగుతున్న నేపధ్యంలో దిగ్గజ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లైన సామ్‌సంగ్, హెచ్‌టీసీలు ఆండ్రాయిడ్ ఫాబ్లెట్‌లతో ముందుకొచ్చాయి. ఈ పరుగులో ముందున్న సామ్‌సంగ్  ‘గెలాక్సీ నోట్ 2’ పేరుతో అత్యాధునిక ఆండ్రాయిడ్ ఫాబ్లెట్‌ను ఇటీవల విడుదల చేసింది. ఈ పోర్టబుల్ మొబైలింగ్ కమ్ కంప్యూటింగ్ గాడ్జెట్ 2నెలల కాలంలో 5 మిలియన్‌లు యూనిట్లు అమ్ముడుపోయి సరికొత్త రికార్డును నెలకొల్పింది.  మరోవైపు హెచ్‌టీసీ  ‘బటర్ ఫ్లై’ పేరుతో సరికొత్త డివైజ్‌ను బరిలోకి దింపనుంది. జెల్లీబీన్ ప్లాట్‌ఫామ్ పై స్పందించే ఈ రెండు డివైజ్‌ల స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా...

అందగత్తెలు… ఆరబోతలు!

బరువు ఇంకా చుట్టుకొలత........

హెచ్‌టీసీ బటర్‌ఫ్లై: చుట్టుకొలత 143 x 70.5 x 9.08 మిల్లీ మీటర్లు, బరువు 140 గ్రాములు,

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్2: 151.1 x 80.5 x 9.4 మిల్లీ మీటర్లు, బరువు 180 గ్రాములు,

డిస్‌ప్లే...

హెచ్‌టీసీ బటర్‌ఫ్లై: హైడెఫినిషన్ 1080 పిక్సల్ 5 అంగుళాల ఎల్‌సీడీ 3 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,  రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్,

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్2: 5.5 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,  రిసల్యూషన్  1280 x 720పిక్సల్స్,  ఎస్-పెన్ స్టైలస్ సపోర్ట్,

ప్రాసెసర్.....

హెచ్‌టీసీ బటర్‌ఫ్లై: 1.5గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రో ప్రాసెసర్,

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్2: సామ్‌సంగ్ ఎక్సినోస్ 4412 క్వాడ్ చిప్‌సెట్,

ఆపరేటింగ్ సిస్టం....

హెచ్‌టీసీ బటర్‌ఫ్లై: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్2:  ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా.....

హెచ్‌టీసీ బటర్‌ఫ్లై: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),  2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్2: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

మెమరీ........

హెచ్‌టీసీ బటర్‌ఫ్లై:  16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 2జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా  మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్2: ఇంటర్నల్ స్టోరేజ్ వర్షన్స్ (16జీబి, 32జీబి, 64జీబి), 2జీబి ర్యామ్,  మైక్రోఎస్డీ కార్డ్ సౌలభ్యతతో మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ.......

హెచ్‌టీసీ బటర్‌ఫ్లై:  వై-ఫై, బ్లూటూత్ వీ4.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, మైక్రోయూఎస్బీ 2.0,

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్2: వై-ఫై, బ్లూటూత్ వీ4.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, మైక్రో యూఎస్బీ 2.0,

బ్యాటరీ......

హెచ్‌టీసీ బటర్‌ఫ్లై: 2020ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్2: 3100ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ధరలు.....

హెచ్‌టీసీ బటర్‌ఫ్లై:  తెలియాల్సి  ఉంది,

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్2: రూ.39,990 (16జీబి వర్షన్),

ప్రత్యేక ఫీచర్లు...

హెచ్‌టీసీ బటర్‌ఫ్లై: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,  బీట్స్ ఆడియో ఇంటిగ్రేషన్,

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్2: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, ఎస్-వాయిస్,  స్మార్ట్‌సే, ఎస్-బీమ్, పాప్-అప్‌ప్లే,

తీర్పు.......

వేగవంతమైన ప్రాసెసర్, 1080 పిక్సల్  హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఉత్తమ క్వాలటీ ఫోటోగ్రఫీ ఇంకా వీడియో చాటింగ్‌ను కోరుకునే వారికి హెచ్‌టీసీ బటర్‌ఫ్లై ఉత్తమ ఎంపిక. పెద్దదైన డిస్‌ప్లే, స్లైలస్ సపోర్ట్, మన్నికైన బ్యాకప్ ఇంకా ఆధునిక సాఫ్ట్‌వేర్ ఫీచర్లను కోరుకునే వారికి గెలాక్సీ నోట్ 2 ఉత్తమ ఎంపిక.

బ్లాక్‌బెర్రీ భవిష్యత్ మోడల్స్ (ఫోటో గ్యాలరీ)!

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot