నెట్‌లో ఆ ఫోటో!

Posted By: Staff

నెట్‌లో ఆ ఫోటో!

 

 

సీఈఎస్ 2013లో ప్రదర్శనకు సిద్ధంగా ఉన్న మూడు ‘హవాయి’(Huawei) ఉత్పత్తుల  ఫోటోలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఆసెండ్ సిరీస్ నుంచి వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ అంచనాలు నెలకున్నాయి. వీటీలో మొదటిదైన ‘హవాయి ఆసెండ్ మేట్’ 6అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్‌ను కలిగి ట్యాబ్లెట్ తరహా అనుభూతికి లోను చేస్తుంది.

యూట్యూబ్‌లో కేకపుట్టిస్తున్న టాప్-5 హాట్‌హాట్ వీడియోలు!

1.8గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన హైసిలికాన్ కె3వీ3 క్వాడ్-కోర్ ప్రాసెసర్‌ను డివైజ్‌లో వినియోగించినట్లు సమాచారం. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ప్లాట్‌ఫామ్ పై ఈ ఫాబ్లెట్ రన్ అవుతుంది.  మరో ఫోన్ హవాయి ‘ఆసెండ్ డీ2’ 1080 పిక్సల్ రిసల్యూషన్‌తో కూడిన 5 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్ కోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.5గిగాహెట్జ్). ఫోటోగ్రఫీకి మరింత అనుకూలమైన 13 మెగా పిక్సల్ సూపర్ క్లారిటీ కెమెరా వ్యవస్థను డీ2లో ఏర్పాటుచేసినట్లు  తెలుస్తోంది.

అందగత్తెలు… ఆరబోతలు!

మరో విండోస్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ హవాయి ‘ఆసెండ్ డబ్ల్యూ1’విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది. 4 అంగుళాల స్ర్కీన్, డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌ను వినియోగించారు (క్లాక్ వేగం 1.2గిగాహెట్జ్). వివిధ కలర్ వేరియంట్‌లలో ఈ హ్యాండ్‌సెట్‌లు లభ్యంకానున్నాయి. చివరి రెండు మోడళ్ల ధరలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వచ్చే నెలలో చైనా మార్కెట్లో విడుదల కాబోతున్న హవాయి ఆసెండ్ మేట్ ధర $480 (రూ.26000/-).

Read in English

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting