ఫోటోగ్రఫీ లవర్స్ కోసం ‘ఐబాల్ కోబాల్ట్4’

Posted By:

ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ ఐబాల్ తన కోబాల్ట్ సిరీస్ నుంచి ‘ఎంఎస్ఎల్ఆర్ కోబాల్ట్ 4' పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. నాలుగు రకాల డిజాచబుల్ లెన్స్‌తో లభించే ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,499.

ఫోటోగ్రఫీ లవర్స్ కోసం ‘ఐబాల్ కోబాల్ట్4’

Read More : మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను రికవర్ చేసుకోవటం ఏలా..?

డ్యుయల్ సిమ్ స్టాండ్‌బై సపోర్ట్‌తో లభ్యమయ్యే ఐబాల్ ఎంఎస్ఎల్ఆర్ కోబాల్ట్ 4 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 5 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 540x960పిక్సల్స్, 220 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), 1.4గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్‌తో కూడిన 8 మెగా పిక్సల్ రేర్ ఆటో ఫోకస్ కెమెరా, సాఫ్ట్ ఫ్లాష్‌తో కూడిన 3.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, జీపీఎర్ఎస్, ఎడ్జ్, మైక్రో యూఎస్బీ, ఎఫ్ఎమ్ రేడియో, బ్లూటూత్ 4.0), 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఫోటోగ్రఫీ లవర్స్ కోసం ‘ఐబాల్ కోబాల్ట్4’

ఫోన్‌తో పాటు లభించే నాలుగు లెన్సుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:

8ఎక్స్ జూమింగ్ పవర్‌తో కూడిన జూమ్ లెన్స్,
175-180 డిగ్రీల వ్యూవింగ్ యాంగిల్‌తో కూడిన ఫిష్ ఐ లెన్స్,
10ఎక్స్ మాగ్నిఫికేషన్‌తో కూడిన మాక్రో లెన్స్,
130 డిగ్రీల వీక్షణా కోణంతో కూడిన వైడ్ - యాంగిల్ లెన్స్.

వీటీని ఉపయోగించుకోవటం వల్ల ఫోటోలను మరింత నాణ్యతతో చిత్రీకరించుకోవచ్చు.

Read More: ల్యాప్‌టాప్‌ను టీవీకి కనెక్ట్ చేయటమెలా..?

English summary
iBall mSLR Cobalt4 With Bundled Detachable Lenses Launched at Rs. 8,499. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot