రూ.15 వేలలో నెక్స్ట్ లెవెల్ గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G రిలీజ్ డేట్ ఫిక్స్!
Infinix Note 50X 5G: ఇన్ఫినిక్స్ లవర్స్‌కి అదిరిపోయే న్యూస్. మార్చి 27న ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ఇండియాలో లాంచ్ కాబోతోందని కంపెనీ తాజాగా ప్రకటించింది. లాంచ్ అయిన వెంటనే ఫ్లిప్‌కార్ట్‌లో మీకోసం అందుబాటులో ఉంటుంది. గతంలో దుమ్ము రేపిన ఇన్ఫినిక్స్ నోట్ 40X 5G కి ఇది అప్‌గ్రేడెడ్ వెర్షన్. నోట్ 40X 5G అయితే గతేడాది ఆగస్టులోనే మార్కెట్లోకి వచ్చేసింది. మరి రాబోయే ఫోన్ స్పెసిఫికేషన్లు, ధర వివరాలు తెలుసుకుందాం.
* ప్రాసెసర్, పర్ఫార్మెన్స్
పర్ఫార్మెన్స్ విషయానికొస్తే, ఇన్ఫినిక్స్ ఈసారి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. నోట్ 50X 5G+లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్ అందిస్తోంది. ఈ చిప్‌సెట్‌లో నాలుగు కార్టెక్స్ A78 కోర్లు ఉంటాయి, అవి 2.5GHz క్లాక్ స్పీడ్‌తో పనిచేస్తాయి. అంటే పర్ఫార్మెన్స్ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

గేమింగ్ కోసం ప్రత్యేకంగా మాలి-G615 MC2 GPU ని కూడా యాడ్ చేశారు. 90FPS గేమింగ్‌కు ఇది సపోర్ట్ చేస్తుందని కంపెనీ చెబుతోంది. సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే, ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 బేస్డ్ XOS 15 తో వస్తుంది. XOS 15 లో యానిమేషన్స్ చాలా స్మూత్‌గా ఉంటాయి, కస్టమైజేషన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి.
* AI ఫీచర్లు
అంతేకాదు, AI ఫీచర్లు కూడా చాలా ఉన్నాయి. వీటితో రోజువారి జీవితం చాలా సులభతరం అవుతుందని చెప్పుకోవచ్చు. ఐకాన్స్ షేప్, సైజ్, కలర్ మార్చుకోవచ్చు. 25 రకాల ఫాంట్ స్టైల్స్ కూడా ఉన్నాయి. ఇంకా కొత్త బూట్-అప్ యానిమేషన్ కూడా ఇచ్చారు, మొత్తం మీద యూజర్ ఎక్స్‌పీరియన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోంది.
* యాక్టివ్ హాలో లైటింగ్ & డిజైన్
ఈ ఫోన్‌లో అత్యంత ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే యాక్టివ్ హాలో లైటింగ్. ఇది ఒక LED రింగ్ లాంటిది, ఫోన్ వెనుక కెమెరా చుట్టూ ఉంటుంది. ఇది యూజర్ యాక్షన్లకి తగ్గట్టుగా రియాక్ట్ అవుతుంది. నోటిఫికేషన్స్ వస్తే లైటింగ్ వెలుగుతుంది, ఛార్జింగ్ పెట్టినప్పుడు డిఫరెంట్ లైటింగ్ వస్తుంది.
సెల్ఫీ టైమర్ పెట్టినప్పుడు, గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా లైటింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. డిజైన్ కూడా చాలా ప్రీమియంగా ఉంది. "జెమ్-కట్" ఆక్టాగోనల్ కెమెరా మోడ్యూల్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఈ సెగ్మెంట్‌లో వస్తోంది. ఇలాంటి ప్రత్యేకమైన ఫీచర్లతో ఈ ఫోన్ చాలా మందిని ఆకట్టుకుంటోంది.
* బ్యాటరీ, సర్టిఫికేషన్
నోట్ 50X 5Gకి TUV సర్టిఫికేషన్ కూడా వచ్చింది. దీని ప్రకారం 5,100mAh బ్యాటరీ ఉంటుంది. ఈ భారీ బ్యాటరీ లైఫ్‌తో నిరంతరాయంగా గేమ్స్ ఆడుతూ, సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ట్రావెలింగ్‌లోనూ ఈ బ్యాటరీ లైఫ్ ఉపయోగకరంగా ఉంటుంది. ఛార్జింగ్ స్పీడ్ ఎంత ఉంటుందో త్వరలోనే తెలుస్తుంది.
* నోట్ 40X 5Gతో పోలిక
గతంలో వచ్చిన ఇన్ఫినిక్స్ నోట్ 40X 5Gలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 6.78-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే (120Hz రిఫ్రెష్ రేట్‌తో), 108MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్నాయి. దాని ధర 8GB + 256GB వేరియంట్‌కి రూ.14,999. కానీ నోట్ 50X 5G మాత్రం పర్ఫార్మెన్స్, డిజైన్, సాఫ్ట్‌వేర్ అన్నిట్లోనూ చాలా అప్‌గ్రేడ్స్‌తో వస్తోంది.


Click it and Unblock the Notifications








