ఐపీఎల్ టార్గెట్‌గా ఇంటెక్స్ సరికొత్త 4జీ ఫోన్
దేశీయ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఇంటెక్స్ ఐపీఎల్ అభిమానుల కోసం ఓ కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
దేశీయ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఇంటెక్స్ ఐపీఎల్ అభిమానుల కోసం ఓ కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇంటెక్స్ ఆక్వా లయన్స్‌తో వచ్చిన ఈ ఫోన్ ధర రూ.5499. షాంపైన్, గ్రే కలర్స్‌లో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ఐపీఎల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసుకుని, పాక్షికంగా ఆ ఫోన్ ఫీచరింగ్ గుజరాత్ లయన్స్ బ్రాండింగ్‌ను కలిగి ఉండేలా దీన్ని ప్రవేశపెట్టింది.
రూ. 7 వేలలో బెస్ట్ 4జీ స్మార్ట్‌ఫోన్స్

ఇంటెక్స్ ఆక్వా లయన్స్ 4జీ ఫీచర్స్ విషయానికొస్తే ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లోతో పాటు 5 అంగుళాల ఎఫ్‌డబ్ల్యూవీజీఏ డిస్‌ప్లే ఉంటుంది. 1.3గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ మీద ఫోన్ రన్ అవుతుంది. ర్యామ్ విషయానికొస్తే 1 జీబీ ర్యామ్ తో పాటు 8జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ అలాగే 64జీబీ వరకు మెమరీ విస్తరణ సామర్ధ్యం ఉంటుంది.
హువాయి నుంచి 2 జిబి ర్యామ్‌తో ఎంట్రీ లెవల్ ఫోన్

బ్యాటరీ విషయానికొస్తే 2000ఎంఏహెచ్ బ్యాటరీ. కెమెరా విషయానికొస్తే 5 మెగాపిక్సెల్ వెనుక కెమెరా తో పాటు సెల్ఫీ ప్రియుల కోసం 2 మెగాపిక్సెల్ ఫ్లాష్ కెమెరా ను ముందు పొందుపరిచారు.


Click it and Unblock the Notifications








