16జీబి ఇంటెక్స్ ఫోన్ రూ.5,999కే
16జీబి ఇంటర్నల్ మెమరీ, 2జీబి వంటి శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో కూడిన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను ఇంటెక్స్ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ‘క్లౌడ్ ఎం6' పేరుతో మార్కెట్లో లభ్యంకానున్న ఈ ఫోన్ ధర రూ.5,999. ప్రముఖ రిటైలర్ స్నాప్‌డీల్ ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.
Read More: సవాల్ విసరుతోన్న స్వదేశీ
ఇంటెక్స్ క్లౌడ్ ఎం6 16జీబి వర్షన్ ప్రత్యేకతలు:
5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్), 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ స్ప్రెడ్‌ట్రమ్ ఎస్‌సీ7731 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
Read More : 1925కి కాల్ చేస్తే..?
యువతలో స్మార్ట్‌ఫోన్‌ల పై క్రేజ్ రోజురోజుకు పెరుగిపోతోంది. సకల సౌకర్యాలతో లభ్యమవుతోన్న స్మార్ట్‌ఫోన్‌లతో సరికొత్త జీవనశైలిని యువత అలవర్చుకుంటున్నారు. సెల్‌ఫోన్ నిర్వచనాన్నే మార్చేసిన స్మార్ట్‌ఫోన్ మనిషిని మరింతగా లోబర్చుకుని పదే పదే తడిమిచూసుకునే వస్తువులా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్ లేకుండా మీరు జీవించలేకపోతున్నారనటానికి 10 సంకేతాలను మీకు సూచిస్తున్నాం...
ఉదయం లేవటంతోనే మన మనసు మనకు తెలియకుండానే మన ఫోన్ పై వెళ్లిపోతుంటుంది. ఇంటి నుంచి బయటకు వెళ్లేముందు మన జేబులో ఫోన్ ఉందా లేదా అని ఒకటికి పదిసార్లు తడుముకుంటుంటాం. జేబులోని పర్సు పోయినా పర్వాలేదు కానీ ఫోన్ పోతే మాత్రం తట్టుకోలేం. ఎందుకంటే మనకు సంబంధించిన విలువైన సమాచారమంతా ఆ ఫోన్ లోనే ఉంటుంటి కాబట్టి. పొరపాటున ఫోన్ ఇంట్లో మరిచిపోయి ఆఫీసుకు వచ్చేస్తే, ఆ రోజంతా ప్రపంచానిని దూరంగా ఉన్నట్లు ఏదో భాదను ఫీలవుతాం. ఏ సమాచారం కావాలన్న ఫోన్‌లో టక్కున వెతికేస్తుటాం. ఫోన్ పై అంత నమ్మకం మరి! పొరపాటున ఫోన్ స్ర్కీన్‌కు దెబ్బతగిలతే మనకు తగిలినట్లు ఫీలై ఆ రోజంతా పూర్తిగా అప్ సెట్ అయిపోతాం. ప్రతి విషయానికి ఫోన్ పైనా ఆధారపడుతుంటాం. ఆఖరికి మన ప్రియమిత్రుని పుట్టినరోజును కూడా ఫోన్ ద్వారానే గుర్తుపెట్టుకుంటాం. ఫోన్‌ను కొండంత అండగా ఫీలవతాం. ఫోన్ వెంట ఉంటే చాలు ఒంటిరిగా కూడా బతికేయవచ్చు అన్న భావనకు లోనవుతాం. కాస్తంత తీరక సమయం దొరికితే చాలు మనకు తెలియకుండానే మన చేతులు ఫోన్ పై టచ్చిటలాడుతుంటాయి. పొరపాటున మన చేతిలోని ఫోన్ మిస్ అయితే, అది దొరికేంత వరకు అది దొరికేంత వరకు అనుభవించే టెన్షన్ అంతా ఇంతా కాదు.
ఉదయం లేవటంతోనే

ఇంటి నుంచి బయటకు వెళ్లేముందు

ఫోన్ పోతే మాత్రం తట్టుకోలేం

పొరపాటున ఫోన్ ఇంట్లో మరిచిపోయి ఆఫీసుకు వచ్చేస్తే

ఏ సమాచారం కావాలన్న ఫోన్‌లో టక్కున వెతికేస్తుటాం

ఫోన్ స్ర్కీన్‌కు దెబ్బతగిలతే

ప్రతి విషయానికి ఫోన్ పైనా ఆధారపడుతుంటాం

ఫోన్‌ను కొండంత అండగా ఫీలవతాం

కాస్తంత తీరక సమయం దొరికితే చాలు

పొరపాటున మన చేతిలోని ఫోన్ మిస్ అయితే


Click it and Unblock the Notifications








