ఇంటెక్స్‌తో జతకట్టిన శ్రీమంతుడు

Written By:

భారతదేశపు రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఇంటెక్స్‌కు టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ హహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తమ ఉత్పత్తుల ప్రచారం నిమిత్తం ప్రిన్స్ మహేష్‌ను ఇంటెక్స్ సంస్థ ఎంచుకుంది. ఈ డీల్ ఏడాది పాటు కొనసాగుతుంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ డీల్ విషయాన్ని ఇంటెక్స్ వెల్లడించింది.

ఇంటెక్స్‌తో జతకట్టిన శ్రీమంతుడు

Read More: సామ్‌సంగ్ నుంచి ఫింగర్ ప్రింట్ ఫోన్
టాలీవుడ్ సంచలనంగా నిలిచి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న మహేష్ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండటంతో తమ స్మార్ట్‌ఫోన్‌‌లకు యువత మరింత కనెక్ట్ అవుతారని ఇంటెక్స్ టెక్నాలజీ డైరెక్టర్ కేశవ్ బన్సాల్ తెలిపారు. అందుబాటు ధరల్లో బెస్ట్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తూ నమ్మకమైన బ్రాండ్‌గా అవతరించిన ఇంటెక్స్‌తో చేతులు కలపటం సంతోషంగా ఉందని మహేష్ అన్నారు. ఈ సందర్భంగా ఇంటెక్స్ ఆక్వా ట్రెండ్ పేరుతో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను మహేష్ ఆవిష్కరించారు. ధర రూ.9,444 

ఇంటెక్స్ ఆక్వా ట్రెండ్ ఫీచర్లు:

ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.1 ఆపరేటింగ్ సిస్టం, 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ తాకేతెర, 4జీ కనెక్టువిటీ, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఎంటీ6735 చిప్ సెట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. బ్లూటత్, వై-ఫై, హాట్ స్పాట్.

ఇంటెక్స్‌తో జతకట్టిన శ్రీమంతుడు

Read More:  మోటో జీ3 స్మార్ట్‌ఫోన్‌.. నచ్చేవేంటి, నచ్చనివేంటి

ఫోటోలను వేగంగా షేర్ చేసుకునేందుకు హాట్ క్నాట్ ఫీచర్, పొందుపరిచిన ఎయిర్ షుఫుల్ ఫీచర్ ద్వారా ఎయిర్ షఫుల్ ఫీచర్, వీడియోలను స్లో మోషన్‌లో రికార్డ్ చేసుకునేందుకు స్లో మోషన్ వీడియో రికార్డింగ్ ఫీచర్, యాంటీ-స్నేక్ కెమెరా ఫీచర్.కెమెరా ప్రత్యేకతలు: ఆటో ఫోకస్, డిజిటల్ జూమ్, మల్టీ షాట్, నైట్ విజన్, సింగిల్ టచ్ కెమెరా ఆప్షన్, కలర్ర ఎఫెక్ట్, కంటిన్యూస్ షాట్, ఫేస్ బ్యూటీ, పానోరమా, జీపీఎస్ ఇన్ఫో.

English summary
Intex Ropes in Tollywood Heartthrob Mahesh Babu as Brand Ambassador. Read More in Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot