Home
Mobile

యాపిల్ తాజా అప్‌డేట్ ఏంటి..?

By Super
 iPhone 6, iOS 7: Next Generation Apple Hardware and OS Under Testing


ఐఫోన్5 అమ్మకాలు ఆశాజనకంగా సాగుతున్న నేపధ్యంలో భవిష్యత్ ప్రణాళికలపై దృష్టిసారించిన టెక్ టైటాన్ యాపిల్ తన 6వ తరం స్మార్ట్‌ఫోన్ ‘ఐఫోన్6’ను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నట్లు వెబ్ ప్రపంచం కోడైకూస్తోంది. ఈ ఏడాది చివరిలో అందుబాటులోకి రానున్న ఐఫోన్6, యాపిల్ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ‘ఐవోఎస్7’ పై స్పందిస్తుంది. ఈ సరికొత్త హార్డ్‌వేర్ ఇంకా ఆపరేటింగ్ సిస్టం పై ప్రముఖ అప్లికేషన్‌లతో కూడిన పరీక్షలను యాపిల్ డెవలపర్ల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు ‘ద నెక్స్ట్ వెబ్’ పేర్కొంది. యాపిల్, ఏటా తన నూతన ఆవిష్కరణలను జూన్‌లో నిర్వహించే వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్ (డబ్ల్యూడబ్ల్యూడీసీ)లో ప్రకటిస్తున్న విషయం తెలసిందే. ఈ క్రమంలో ఐవోఎస్7 ప్లాట్‌ఫామ్‌ను ఈ 2013, జూన్‌లో నిర్వహించే డబ్ల్యూడబ్ల్యూడీసీ కార్యక్రమంలో ప్రదర్శించే అవకాశముందని టెక్ నిపుణులతో పాటు యాపిల్ అభిమానులు అంచనా వేస్తున్నారు.

ఈ పనిమనిషిని ఓ పట్టు పట్టాల్సిందే!

యాపిల్ ఐఫోన్‌5 స్పెసిఫికేషన్‌లు:

4 అంగుళాల స్ర్కీన్, సరికొత్త ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం, శక్తివంతమైన ఏ6 చిప్, 1జీబి ర్యామ్,8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో స్టెబిలైజేషన్), 1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ వీజీఏ కెమెరా, 4జీ ఎల్‌టీఈ వైర్‌లెస్ నెట్‍‌వర్క్, నెట్‌వర్క్ సపోర్ట్ (జీఎస్ఎమ్ 850 / 900 / 1800 / 1900), (సీడీఎమ్ఏ 800 / 1900- Verizon), (3జీ నెట్‌వర్క్ – హెచ్‌ఎస్‌డిపిఏ 850 / 900 / 1900 / 2100), బ్యాటరీ బ్యాకప్ (8 గంటలు 3జీ టాక్‌టైమ్, 10 గంటలు వై-ఫై బ్రౌజింగ్ ఇంకా వీడియో వీక్షణ సమయం, 40 గంటల పాటు మ్యూజిక్ వినొచ్చు, 225 గంటల స్టాండ్‌బై సదుపాయం).

ఇతర ఫీచర్లు:

నానో సిమ్‌కార్డ్ సపోర్ట్,

యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్,

సిరీ లాంగ్వేజ్ కమాండ్స్,

ఐక్లౌడ్ క్లౌడ్ సర్వీస్,

ట్విట్టర్ ఇంకా ఫేస్‌బుక్ అనుసంధానం,

టీవీ అవుట్,

ఐమ్యాప్స్,

ఐబుక్స్ పీడీఎఫ్ రీడర్,

ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్,

ఇమేజ్ ఎడిటర్,

వాయిస్ మెమో.

ఇండియాలో ఐఫోన్5 బ్లాక్ ఇంకా స్లేట్ కలర్ వేరియంట్‌లలో లభ్యంకానుంది. ధరలు 16జీబి – రూ.45,500, 32జీబి – రూ.52,500, 64జీబి – 59,500.

డ్యూయల్ సిమ్ పెద్ద‌స్ర్కీన్ ఫాబ్లెట్‌లు (తక్కువ ధర)

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X