ఐఫోన్ 8 రిలీజ్ డేట్ ఫిక్సయింది !

Written By:

ఐఫోన్ 8. ఈ ఫోన్ గురించి ఎవ్వరూ చెప్పనవసరం లేదు. లీకులతో రోజు రోజుకు అభిమానుల్లో తెగ ఉత్కంఠను రేపుతోంది. ఐఫోన్ 8 విడుద‌ల‌కు చెందిన వార్త‌లు ఇప్ప‌టికే చాలా సార్లు నెట్‌లో హ‌ల్ చేల్ చేశాయి. ఓ లీకు రిపోర్ట్ ప్రకారం ఆపిల్ ఐఫోన్ 8కు 8 అని కాకుండా ఐఫోన్ ఎక్స్ (X అంటే రోమ‌న్ అంకె 10ని సూచిస్తుంది) అని నామ‌క‌ర‌ణం చేసి విడుద‌ల చేస్తుంద‌ని కూడా తెలిపారు.

ల్యాపీ కొంటున్నారా..? అయితే మీ కోసమే ఈ చిట్కాలు 

మొద‌టి ఆపిల్ ఐఫోన్ విడుద‌లై 10 ఏళ్లు పూర్త‌వుతున్న సంద‌ర్భంగా యాపిల్ ఐఫోన్ ఎక్స్ విడుద‌ల చేస్తుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా తెలుస్తున్న స‌మాచారం ప్ర‌కారం ఐఫోన్ 8 అతి త్వ‌ర‌లో విడుద‌ల కానున్న‌ట్టు తెలిసింది.

ఐఫోన్ వర్సెస్ గూగుల్ ఫిక్సల్, విన్నర్ ఏదీ..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఒక్కో వివరాలు లీకేజీ

ఆపిల్ ఐఫోన్ 8 ఒకసారి ఇమేజెస్, మరోసారి ఫీచర్లు, ధర ఇలా ఒక్కోసారి ఒక్కో వివరాలు లీకేజీ రూపంలోసంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే.

లాంచింగ్ డేట్

ఇప్పుడు లాంచింగ్ డేట్ కూడా లీకయింది. ఐఫోన్ 8 స్మార్ట్ ఫోన్ల వివరాలను అదేపనిగా లీక్ చేస్తున్న బెంజామిన్ గెస్కిన్ అనే ట్విట్టర్ అకౌంట్ ప్రస్తుతం లాంచింగ్ తేదీలను రివీల్ చేసింది. సెప్టెంబర్ 17న ఐఫోన్ 8 లాంచ్ అవుతుందని, ఆ ఫోన్ తో పాటు ఐఫోన్ 7ఎస్, ఐఫోన్ 7ఎస్ ప్లస్ లు కూడా లాంచ్ అవుతాయని తెలిపింది.

అమ్మకాలు సెప్టెంబర్ 25 నుంచే

అంతేకాక ఈ డివైజ్ ల అమ్మకాలు సెప్టెంబర్ 25 నుంచే ప్రారంభమవుతాయని కూడా వెల్లడించింది. అయితే ఈ తేదీలు అమెరికా లేదా ఇతర ప్రాంతాలకు సంబంధించిందా? అనే దానిపై స్పష్టత లేదు.

వైబో కూడా

వైబో కూడా ఇటీవలే ఈ ఫోన్లకు సంబంధించిన ఇమేజ్ లను లీక్ చేసింది. ఈ మూడు డివైజ్ ల ప్యానల్ డిజైన్లను ఈ ఇమేజెస్ లో చూపించింది.

ఐఫోన్ 7ఎస్

లీకయిన రిపోర్టుల ప్రకారం ఐఫోన్ 7ఎస్ ప్లస్ పొడవులో అతిపెద్దదిగా ఉండగా.. ఐఫోన్ 7ఎస్ చాలా చిన్నదిగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. మధ్య స్థాయిలో ఐఫోన్ 8 ఉంది.

ఐఫోన్ 7ఎస్ ప్లస్

ఐఫోన్ 7ఎస్ ప్లస్, సమాంతర డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉండగా.. ఐఫోన్ 7ఎస్ కు ఒక్కటే కెమెరా ఉంది. అదేవిధంగా ఐఫోన్ 8కు నిటారుగా రెండు వెనుక కెమెరాలు ఉన్నాయని లీకేజీలు చెబుతున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
iPhone 8 launch date leaked on Twitter? We’re not so sure read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot