అత్యంత తక్కువ ధరకే లావా వోల్ట్ 4జీ ఫోన్

Written By:

దేశీయ మొబైల్ దిగ్గజం లావా సరికొత్త ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఏ 97 పేరుతో విడుదల చేసిన ఈ 4జీ వోల్ట్ ఫోన్ ధరను రూ.5,949గా పేర్కొంది. అత్యంత తక్కువ ధరలో 4జీ వోల్ట్ ఫోన్ కావాలనుకునే వారికి ఇది ఉపయోగపడుందని కంపెనీ తెలిపింది.

జియోపై సర్వే చెప్పిన షాకింగ్ నిజాలు

అత్యంత తక్కువ ధరకే లావా వోల్ట్ 4జీ ఫోన్

ఫీచర్ల విషయానికొస్తే ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టం కలిగిన ఈ ఫోన్ 12 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. వెనుక భాగం 5 ఎంపీ కెమెరాతో ఫోటోలు తీసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరా కూడా 5 ఎంపీతో దూసుకువచ్చింది. అదిరిపోయే సెల్పీలు తీసుకోవచ్చు.

మోటో ఫోన్లకు ఆండ్రాయిడ్ 7.0 అప్‌డేట్

అత్యంత తక్కువ ధరకే లావా వోల్ట్ 4జీ ఫోన్

తక్కువ కాంతిలో మంచి క్వాలిటీతో ఫొటోలు తీసుకునేందుకు ఎల్‌ఈడీ ఫ్లాష్ లైట్ ను కూడా అమర్చారు. ఫేస్‌బ్యూటీ, జిఫ్ మోడ్, వీడియో ఇమేజెస్ కాప్చర్, ఆడియో పిక్చర్లను ఇమేజ్‌లుగా సేవ్ చేసుకునే సౌలభ్యం ఉంది.

అన్నాదమ్ముళ్లు ఏకమయ్యారు..జియోతో ఏం చేయబోతున్నారు ..?

అత్యంత తక్కువ ధరకే లావా వోల్ట్ 4జీ ఫోన్

5 అంగుళాల డిస్ప్లే, 1.3 జీహెచ్ జీ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, ఇన్‌బుల్ట్ మెమరీ 8 జీబీ. మైక్రో ఎస్ డీ ద్వారా 32 జీబీ వరకు విస్తరించుకునే సామర్థ్యం ఉంది. ఈ ఫోన్‌ అన్ని రిటైల్, మల్టీబ్రాండ్ అవుట్ లెట్లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

 

 

English summary
Lava A97 With Android 6.0 Marshmallow, VoLTE Support Launched at Rs. 5,949 read more telugu gizbot
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting