Just In
- 34 min ago
వివో X90 ప్రో స్మార్ట్ ఫోన్లు ఇండియాలో లాంచ్ అయింది! ధర ,స్పెసిఫికేషన్లు!
- 5 hrs ago
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు
- 17 hrs ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- 1 day ago
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్‌వర్క్ గా మారనున్న Airtel!
Don't Miss
- Sports
INDvsAUS : ఆసీస్ టాప్ బ్యాటర్‌కు చెక్ పెట్టే బౌలర్లు వీళ్లే!
- News
హిందూపురానికి `వందే మెట్రో ఎక్స్‌ప్రెస్` - బెంగళూరు నుంచి..!!
- Movies
Butta Bomma Review తెలుగుదనం ఉట్టిపడే బుట్టబొమ్మ.. ప్లస్, మైనస్‌లు ఏమిటంటే?
- Finance
Adani పోర్ట్స్ పై ఔట్‌లుక్‌ను సవరించిన S&P గ్లోబల్ రేటింగ్స్..
- Lifestyle
Valentines Day 2023: ఈ దేశాల్లో ప్రేమికుల రోజు వేడుకలు కాస్త డిఫరెంట్, వావ్ అనాల్సిందే..
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
లెనోవో పీ780.. ‘ద బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఫోన్’
ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రతినెలా వందలాది ఫోన్‌లు ఆవిష్కరించబడుతున్నాయి. ఈ క్రమంలో, వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఉండే స్మార్ట్‌ఫోన్‌లను ఎంపిక చేసుకోవటంలో విఫలమవుతున్నాయి. పాత జనరేషన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్న అత్యధిక శాతం మంది మొబైల్ యూజర్లు ఫేలవమైన బ్యాటరీ బ్యాకప్ సమస్యను ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యకు చెక్ పెట్టే క్రమంలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ బ్రాండ్ లెనోవో శక్తివంతమైన బ్యాటరీబ్యాకప్ వ్యవస్థతో కూడిన దృఢమైన స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. అత్యాధునిక స్మార్ట్ మొబైలింగ్ ఫీచర్లతో రూపుదిద్దుకున్న ‘లెనోవో పీ780' సుధీర్ఘమైన బ్యాటరీ బ్యాకప్‌ను సమకూరస్తుంది.
శక్తివంతమైన స్మార్ట్ మొబైలింగ్ ఫీచర్లతో ‘లెనోవో పీ780'
లెనోవో పీ780 ప్రధాన ఫీచర్లను పరిశీలించినట్లయితే:
5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 5 పాయింట్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (178 డిగ్రీల వీక్షణా కోణంతో). ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, ఎంటీకే 6589 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, పవర్ వీఆర్‌ఎస్ జిఎక్స్544 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ప్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 4000ఎమ్ఏహెచ్ లితియమ్ పాలిమర్ బ్యాటరీ (3జీ నెట్‌వర్క్ పై 25 గంటల టాక్‌టైమ్, 2జీ నెట్‌వర్క్ పై 43 గంటల టాక్‌టైమ్, 32రోజుల స్టాండ్‌బై).
కనెక్టువిటీ ఫీచర్లు:
డ్యూయల్ సిమ్, 802.11 ఏ/బి/జి/ఎన్ విత్ హాట్‌స్పాట్, మైక్రోయూఎస్బీ వీ2.0, యూఎస్బీ - ఓటీజీ, బ్లూటూత్ 3.0, జీఎస్ఎమ్ 900/1800/1900 మెగాహెట్జ్, యూఎమ్ టీఎస్ 900/2100 మెగాహెట్జ్, ఎఫ్ఎమ్ రేడియో, ఏ-జీపీఎస్, గ్రావిటేషన్, యాంబియంట్ లైట్, సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్.
ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ పనితీరును గిజ్‌బాట్ నిపుణుల బృందం వారం పాటు అంచనా వేయటం జరిగింది. ఆ ఫలితాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు........
దమ్మున్న స్మార్ట్‌ఫోన్: లెనోవో పీ780

మొదటి రోజు
మొదటి రోజు:
లెనోవో పీ780 హ్యాండ్ సెట్ బ్యాటరీని ఒక రాత్రి పాటు పూర్తిగా ఛార్జ్ చేసిన తరువాత గిజ్‌బాట్ నిపుణుల బృందం పరిశీలనకు సన్నద్దమైంది. ఈ ఫోన్‌లో ముందుగానే లోడ్ చేయబడిన బ్యాటరీ మేనేజర్ అప్లికేషన్ గిజ్‌బాట్ నిపుణుల బృందానికి పూర్తి స్థాయిలో ఉపయోగపడింది.
మొదటిరోజు పరీక్షలో భాగంగా పూర్తిగా ఛార్జ్ చేయబడిన లెనోవో పీ780 ద్వారా 30 నిమిషాల పాటు యూట్యూబ్ (వై-ఫై ద్వారా), 20 నిమిషాల కాలింగ్, 3జీ, వాట్స్‌యాప్, ఇన్స్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా అప్లికేషన్‌లను ఉపయోగించటం జరిగింది. అంతేకాకుండా, 30 నిమిషాల పాటు ప్లాంట్స్ vs జూంబీస్ వీడియోగేమ్‌ను ఆడటం జరిగింది. మొదటి రోజు పరిశీలన ముగిసే సమయానికి 48 శాతం బ్యాటరీ లైఫ్ లెనోవో పీ780లో మిలిగి ఉండటాన్ని బ్యాటరీ మేనేజర్ అప్లికేషన్ ద్వారా గిజ్‌బాట్ నిపుణుల బృందం గుర్తించిది.

రెండవ రోజు
రెండవ రోజు:
రెండవ రోజు పరిశీలనలో భాగంగా గిజ్‌బాట్ నిపుణుల బృందం 48 శాతం బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉన్న లెనోవో పీ780 హ్యాండ్‌సెట్‌ను మొదటి రోజులానే వినియోగించటం జరిగింది. అయితే, సాయంత్రం 7 గంటల సమయం నాటికి ఫోన్ ఛార్జింగ్ పూర్తిగా అయిపోయింది. ఈ రెండు రోజుల పరిశీలనలో భాగంగా ఫోన్ ప్రాసెసింగ్ పవర్, హైడెఫినిషన్ స్ర్కీన్ పనితీరు వంటి అంశాలు గిజ్‌బాట్ నిపుణుల బృందాన్ని ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.

మూడవ రోజు
మూడవ రోజు:
మూడవ రోజు పరిశీలన భాగంగా గిజ్‌బాట్ నిపుణుల బృందం పూర్తిగా ఛార్జ్ చేయబడిన లెనోవో పీ780 హ్యాండ్‌సెట్‌తో పరిశీలనను ప్రారంభించింది. మొదటి రెండు రోజుల ఫలితాలను దృష్టిలో ఉంచుకున్న నిపుణుల బృందం మూడవ రోజు ఫోన్‌లోని 3జీ కనెక్టువిటీ ఆప్షన్‌ను పూర్తిగా టర్న్ ఆఫ్ చేసి వై-ఫై కనెక్షన్ ద్వారా డేటాను వినియోగించటం జరిగింది. 7 గంటల డేటా వినియోగం తరువాత ఫోన్‌లో 67 శాతం బ్యాటరీ బ్యాకప్ మిగిలి ఉండటాన్ని నిపుణుల బృందం గుర్తించింది.

నాలుగవ రోజు
నాలుగవ రోజు:
నాలుగువ రోజు పరిశీలన పూర్తి అయ్యే సరికి 28 శాతం బ్యాటరీ బ్యాకప్ లెనోవో పీ780 హ్యాండ్‌సెట్‌లో మిగిలి ఉంది.

ఐదవ రోజు
ఐదవ రోజు:
ఐదవ రోజు మధ్యాహ్ననికి ఫోన్ బ్యాటరీ బ్యాకప్ పూర్తిగా అయిపోయింది.

ఆరవ రోజు
ఆరవ రోజు:
ఆరవ రోజు...గిజ్‌బాట్ నిపుణుల బృందం పూర్తిగా ఛార్జ్ చేయబడిన లెనోవో పీ780 హ్యాండ్‌సెట్‌తో తమ పరిశీలనను ప్రారంభించింది. అయితే, ఈ రోజు ఫోన్‌లోని అన్ని డేటా సర్వీసులను ఆఫ్ చేసి హ్యాండ్‌సెట్‌ను కేవలం ఫోన్ కాల్స్, టెక్స్ట్ సందేశాలు ఇంకా కెమెరా ద్వారా ఫోటోలను చిత్రీకరించుకునేందుకు ఉపయోగించటం జరిగింది. 6వ రోజుల పరిశీలన ముగిసే నాటికి లెనోవో పీ780 హ్యాండ్‌సెట్‌లో 79శాతం బ్యాటరీ బ్యాకప్ మిగిలే ఉంది.

7వ రోజు
7వ రోజు
7వ రోజు పరిశీలనలో భాగంగా 6వ రోజు తరహాలోనే ఫోన్‌ను పరీక్షించటం జరిగింది. 7వ రోజు పరిశీలన ముగిసేనాటికి 49శాతం బ్యాటరీలైఫ్ ఫోన్‌లో మిగిలే ఉంది

పర్యవేక్షణలో ఏం తెలిదంటే..?
పర్యవేక్షణలో ఏం తెలిదంటే..?
3జీ వినియోగాన్ని తగ్గించి వై-ఫై పై ఆధారపడినట్లయితే ఈ ఫోన్ ద్వారా రెండున్నర రోజుల బ్యాటరీ లైఫ్‌ను ఆస్వాదించవచ్చు. లెనోవో పీ780 హ్యాండ్‌సెట్‌లో నిక్షిప్తం చేసిన శక్తివంతమైన 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఖచ్చితమైన 40 గంటల దృఢమైన స్మార్ట్‌ఫోన్ వినియోగానికి సహకరిస్తుంది. పోటీ కమ్యూనికేషన్ ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం కీలకమవుతున్న నేపధ్యంలో ‘లెనోవో పీ780' అత్యుత్తమ ఎంపిక.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470