లెనోవా వైబ్ కే5 ధర తగ్గింది

Written By:

గతఆగష్టు లో ఇండియాలో లాంచ్‌ అయిన లెనోవా వైబ్ కె 5 నోట్‌పై ఫ్లిప్‌‌కార్ట్‌ ప్రత్యేక తగ్గింపు ధరలను ప్రకటించింది. లెనోవా వైబ్ కే 5 4జీబీ, 3జీబీ రెండు వేరియంట్లపై రూ. 500 డిస్కౌంట్‌ అందిస్తోంది. దాదాపు ఈ సిరిస్‌లోని ఇతర వేరియంట్లు కొత్త ధర ట్యాగ్‌ లతో ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి.

రూ.1999కే 4జీ వోల్ట్ ఫోన్, దిగ్గజాలకు మైక్రోమ్యాక్స్ షాక్ !

 లెనోవా వైబ్ కే5 ధర తగ్గింది

గ్రే, సిల్వర్‌ , గోల్డ్‌ రంగుల్లో అందుబాటులో ఉన్న 3జీబీ మోడల్‌ను రూ. 11,499కే అందించనుంది. దీని అసలు ధరరూ.11,999గా ఉంది. అలాగే 4జీబీ ర్యామ్‌ 64 జీబీ స్టోరేజ్‌ కెపాసిటీ వేరియంట్‌ను 12,999 లకే అందిస్తోంది. దీని అసలు ధర రూ.13,499. ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.

సంచంలనం రేపుతున్న గూగుల్ కొత్త ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లేతో

వైబ్ కే5 ఫోన్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తోంది. (రిసల్యూషన్ సామర్థ్యం 1280 x 720పిక్సల్స్), 180 డిగ్రీ వైడ్ యూగింగ్ వ్యూవింగ్ సామర్థ్యాలను ఈ ఫోన్ డిస్‌ప్లే కలిగి ఉంది.

 

క్విక్ ఛార్జ్ 2.0 టెక్నాలజీ

వైబ్ కే5 ఫోన్‌లో 1.4గిగాహెర్ట్జ్ సామర్థ్యం గల ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 415 ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేసారు. అడ్రినో 450 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ ఆకట్టుకుంటుంది. క్విక్ ఛార్జ్ 2.0 టెక్నాలజీతో వస్తోన్న ఈ ఫోన్ బ్యాటరీ వేగవంతంగా ఛార్జ్ అవుతుంది.

ర్యామ్‌

వైబ్ కే5 ఫోన్ 2జీబి ర్యామ్‌తో వస్తోంది. 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

 

 

కెమెరా

వైబ్ కే5 ఫోన్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్, 1080పిక్సల్ వీడియో రికార్డింగ్). 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం

లెనోవో వైబ్ కే5 ఫోన్ ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. భవిష్యత్‌లో ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే అవకాశం

డాల్బీ ఆడియో టెక్నాలజీ

లెనోవో వైబ్ కే5 ఫోన్, డాల్బీ ఆడియో టెక్నాలజీతో వస్తంది. ఫోన్ సౌండ్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, 3.5 ఎమ్ఏమ్ రేడియో, ఎఫ్ఎమ్ రేడియో).

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo Vibe K5 Note Gets a Limited Period Discount on Flipkart Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting