లెనోవో వైబ్ ఎక్స్ 3, మార్కెట్లోకి మరో ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్

Written By:

 లెనోవో వైబ్ ఎక్స్ 3, మార్కెట్లోకి మరో ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్

ఆధునిక అవసరాలకు అనుగుణంగా స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తూ మోస్ట్ వాంటెడ్ మొబైల్ బ్రాండ్‌గా మార్కెట్లో దూసుకుపోతున్న లెనోవో తన వైబ్ సిరీస్ నుంచి 'Vibe X3' పేరుతో ప్రీమియమ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం భారత్‌లో లాంచ్ చేసింది. ధర రూ.19,999. ఈ ఫోన్‌లకు సంబంధించిన సేల్ Amazon Indiaలో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు నుంచి స్టార్ట్ అవుతుంది.

 లెనోవో వైబ్ ఎక్స్ 3, మార్కెట్లోకి మరో ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్

8జీబి ర్యామ్‌తో వస్తున్న శక్తివంతమైన ల్యాప్‌టాప్‌లు

వైబ్ ఎక్స్2 స్మార్ట్‌ఫోన్‌కు సక్సెసర్ వర్షన్‌గా వచ్చిన వైబ్ ఎక్స్ 3 ఫోన్‌కు సాఫ్ట్‌వేర్ ఇంకా హార్డ్‌వేర్ అప్‌డేట్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా ఫింగర్ ప్రింట్ స్కానర్, హై-రిసల్యూషన్ కెమెరా, డాల్బీ ఆట్మోస్ ఆడియో టెక్నాలజీతో కూడిన డ్యయల్ ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్స్ వంటి అంశాలు ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ANT VR హెడ్‌సెట్‌ను ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

అప్పుడే 'లెనోవో కే5 నోట్' వచ్చేసింది

ఫోన్ స్పెక్స్ విషయానికొస్తే..

 లెనోవో వైబ్ ఎక్స్ 3, మార్కెట్లోకి మరో ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080పిక్సల్స్) విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 808 హెక్సాకోర్ చిప్‌సెట్ , 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 21 మెగా పిక్సల్ సోనీ ఐఎమ్ఎక్స్ 230 రేర్ ఫేసింగ్ కెమెరా (4కే వీడియో రికార్డింగ్ సౌలభ్యతతో), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, క్వాల్కమ్ 2.0 క్విక్ చార్జ్ సపోర్ట్‌తో కూడిన 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, వై-ఫై)

యూట్యూబ్ వాడుతున్నారా..? అయితే ఇవి తెలుసుకోండి

English summary
Lenovo Vibe X3 launched in India at Rs 19,999. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting