ఆఫరంటే ఇదే..ఈ ఫోన్ ధర భారీగా తగ్గింది.

Written By:

ప్రముఖ ఎల‌క్ట్రానిక్స్ దిగ్గజం ఎల్‌జీ త‌న నూత‌న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 'జీ6పై భారీ తగ్గింపును ప్రకటించింది. ఈ ఫోన్ ను రూ.10 వేల తగ్గింపుతో రూ.41,990 అందుబాటులోకి తీసుకొచ్చింది. 2017 వరల్డ్‌ కాంగ్రెస్‌లో డ్యూయల్‌ కెమెరాలతో విడుద‌ల చేసిన ఈ స్మార్ట్‌పోన్‌ను గత నెలలోనే భారత్‌లోనే ప్రవేశపెట్టింది. దీని లాంచింగ్‌ ధర రూ.51,990.

ఐఫోన్ 7లోని ఇంత వరస్ట్ ఫీచర్‌ని వన్‌ప్లస్ 5లో కాపీ కొట్టారా..?

ఆఫరంటే ఇదే..ఈ ఫోన్ ధర భారీగా తగ్గింది.

అయితే ఈ ఆఫ‌ర్ కేవ‌లం మే 18 నుంచి జూన్ 15 వ‌ర‌కు మాత్ర‌మే ఉంది. ముంబై రీటైలర్‌ అందించిన సమాచారం ప్రకారం 20 సంవత్సరాల భాగస్వామ్యం సందర్భంగా ఎల్‌జీ ఇతర ఉత్పతులపై పలు ఆఫర్లను అందిస్తోంది. అయితే మిగతా ఇ-సైట్లలో ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధరను పరిశీలించాల్సి ఉంది. దీని ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి.

మొబైల్ యూజర్లకు డబుల్ షాక్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

5.7 ఇంచ్ QHD+ పుల్ వర్షన్ డిస్‌ప్లే విత్ 18:9 (or 2:1) aspect ratio.మాములుగా ఇండస్ట్రీ స్టాండర్డ్ రేషియో 16.9 ఉంటుంది. దీని ద్వారా సినిమాలు, టీవీ, లాంటివి ఫాస్ట్ గా మూవ్ అవుతాయి. డాల్బే విజన్ తో వచ్చిన మొదటి ఫోన్ కూడా ఇదే.

ర్యామ్

క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 821 SoC విత్ 4GB of LPDDR4 ర్యామ్, 32/ 64 జిబి ఇంటర్నల్ స్టోరేజి, మైక్రో ఎస్ డీ ద్వారా 2 టిబి వరకు విస్తరించుకునే సామర్ధ్యం ఉంది.

కెమెరా

డ్యూయెల్ రేర్ కెమెరాతో వచ్చిన ఈ ఫోన్ వెనకభాగంలో 13 ఎంపీ సెన్సార్ ని పొందుపరిచారు. ఒక కెమెరాతో వైడ్ యాంగిల్ షాట్స్ 125 డిగ్రీల కోణంలో తీయవచ్చు. మరొకటి రెగ్యలుర్ కెమెరా 7 డిగ్రీల కోణంలో ఫోటోలు తీసుకోవచ్చు. సెల్పీ అభిమానుల కోసం 5 ఎంపీ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు.

బ్యాటరీ

బ్యాటరీ విషయానికొస్తే 3300mAh నాన్ రిమూవబుల్ బ్యాటరీ. క్విక్ ఛార్జ్ 3.0ని సపోర్ట్ చేస్తుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ను వెనుక భాగంలో పొందుపరిచారు. ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ మీద రన్ అవుతుంది.

గూగుల్ అసిస్టెంట్

గూగుల్ ఫిక్సల్ ఫోన్ల తర్వాత గూగుల్ అసిస్టెంట్ తో వచ్చిన మొట్టమొదటి ఫోన్ కూడా ఇదే. ఫోన్ బరువు 163 గ్రాములు. డస్ట్ అండ్ వాటర్ రిసెస్టింట్ ఫీచర్ ఉంది. అస్ట్రో బ్లాక్, ఐస్ ప్లాటినం, మిస్టిక్ వైట్ ఈ మూడు రంగుల్లో ఈ ఫోన్ లభిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
LG G6 Available For Rs. 41,990 After A Price Cut Of Rs. 10,000 read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot