‘గెలాక్సీ ఎస్4’కు పోటీగా ‘ఆప్టిమస్ జీ2’?

Posted By: Super

 ‘గెలాక్సీ ఎస్4’కు పోటీగా ‘ఆప్టిమస్ జీ2’?

 

గూగుల్ బ్రాండెడ్ ఫోన్ నెక్సస్4ను రూపొందించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్న సౌత్ కొరియన్ స్మార్ట్‌ఫోన్ వెండర్ ‘ఎల్‌జి’ పూర్వవైభవాన్ని తిరిగిదక్కించుకునే ప్రయత్నంలో నిమగ్నమైంది. దిగ్గజ స్మార్ట్‌ఫోన్  బ్రాండ్‌లలో ఒకటైన

సామ్‌సంగ్‌ను సవాల్ చేస్తూ  ఎల్‌జి,  ‘గెలాక్సీ ఎస్4’కు పోటీగా  ‘ఆప్టిమస్ జీ2’పేరుతో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్ చేస్తున్నట్లు ప్రముఖ కొరియా వెబ్‌సైట్ ఆసియన్ ఎకనామిక్స్ ఓ కథనాన్ని ప్రచురించింది.

మీ కంప్యూటర్‌ను ప్రతిసారి షట్‌డౌన్ చేస్తున్నారా.?

ఈ పోర్టల్ వెలవరించిన వివరాల ప్రకారం ఆప్టిమస్ జీ2, 1080 పిక్సల్ డిస్‌ప్లేతో కూడిన 5.5అంగుళాల స్ర్కీన్‌ను కలిగి ఉంటుంది. ఎల్‌జీ కొత్త స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి  ఇటీవల ఎంకే బిజినెస్ న్యూస్ వెలువరించిన సమాచారం మేరకు కొత్త డివైజ్‌లో  ఆండ్రాయిడ్ 5.0 కీలైమ్ పీ వోఎస్ ఇంకా క్వాడ్ కోర్ 2గిగాహెడ్జ్ ప్రాసెసర్‌ను వినియోగిస్తున్నట్లు  తెలుస్తోంది.

ఇవే తరహా స్పెసిఫికేషన్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను 2013లో విడుదల చేసేందుకు సామ్‌సంగ్, హెచ్‌టీసీ, హవాయి తదితర బ్రాండ్‌లు సన్నాహాలు చేస్తున్నాయి. గెలాక్సీ ఎస్4కు పోటీగా రూపుదిద్దుకుంటున్న ఆప్టిమస్ జీ2‌ను 2013 ప్రధమాకంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వినికిడి. అయితే పైన పేర్కొన్న వివరాలను ఎల్‌జి వర్గాలు అధికారింగా ధృవీకరించాల్సి ఉంది. సదరు స్పెసిఫికేషన్‌లు నిజమే అయితే సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4కు, ఎల్‌జి ఆప్టిమస్2 ఖచ్చితమైన పోటినిస్తుంది.

ఏలా హింసించారో మీరే చూడండి.. (వీడియో)!

పలు అనధికారిక నివేదికల ఆధారం సేకరించిన వివరాల మేరకు సామ్‌సంగ్ రేపటితరం స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్4 స్పెసిఫికేషన్‌లు……

5 అంగుళాల ఆమోల్డ్ డిస్‌ప్లే,

441 పీపీఐ పిక్సల్ డెన్సిటీ,

రిసల్యూషన్ 1920× 1080పిక్సల్స్,

మెమరీ వేరియంట్స్: 16జీబి, 32జీబి, 64జీబి, 128జీబి,

3జీబి ర్యామ్,

3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

1.9మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (స్కైప్ రెడీ ఫీచర్),

ఎల్‌టీఈ నెట్‌వర్క్ సపోర్ట్.

బెస్ట్ వాటర్‌ప్రూఫ్ మొబైల్‌ ఫోన్స్ (నీటిలో తడవకుండా)

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot