మైక్రోమాక్స్ కాన్వాస్ డూడుల్ 4@రూ.9,499
ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్ తన కాన్వాస్ సిరీస్ నుంచి ‘కాన్వాస్ డూడుల్ 4' పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే ఈ ఫోన్ ధర రూ.9,499.
(చదవండి: ఆన్‌లైన్ షాపింగ్: లాభాలు.. నష్టాలు)

మైక్రోమాక్స్ కాన్వాస్ డూడుల్ 4 కీలక స్పెసిఫికేషన్‌లు:
(చదవండి: హువాయి హానర్ 4సీ : బెస్ట్ అనటానికి 10 కారణాలు)
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో కూడిన 6 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 540×960పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ (ఎంటీకే6582ఎమ్) ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, 3జీ సపోర్ట్, వై-ఫై, బ్లూటూత్), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
(చదవండి: మార్కెట్‌ను శాసిస్తోన్న 15 చైనా స్మార్ట్‌ఫోన్‌లు)


Click it and Unblock the Notifications








