ఏకంగా 50 లక్షల ఫోన్ల అమ్మకాలు, దుమ్మురేపిన శాంసంగ్

Written By:

ఇటీవల శాంసంగ్ విడుదల చేసిన గెలాక్సీ ఎస్ 8, 8 ప్లస్ మోడళ్లు ప్రపంచవ్యాప్తంగా అమ్మకాల్లో దుమ్మురేపాయి. ఇప్పటి వరకు ఏకంగా 50 లక్షల ఫోన్లు విక్రయించినట్టు సంస్థ తెలిపింది. మొత్తం 120 దేశాల్లో వీటిని విక్రయించినట్టు పేర్కొంది. ఎస్‌8 విడుదల చేశాక చాలా చోట్ల వినియోగదారులు డిస్‌ప్లే ఎర్ర రంగులో వస్తోందని ఫిర్యాదు చేశారు.

Redmi 4 వచ్చేసింది, రూ.6,999కే కేక పుట్టించే ఫీచర్లతో

ఏకంగా 50 లక్షల ఫోన్ల అమ్మకాలు, దుమ్మురేపిన శాంసంగ్

దీంతో కంపెనీ వెంటనే స్పందించి సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ను విడుదల చేసింది. వినియోగదారుల నుంచి మంచి స్పందన రావడంతో మొబైల్‌ అమ్మకాల ద్వారా కంపెనీ రెండో త్రైమాసికంలో మంచి లాభాలను ఆర్జించే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

రూ. 5,790 కే శాంసంగ్ కొత్త ఫోన్ , ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే..?

ఏకంగా 50 లక్షల ఫోన్ల అమ్మకాలు, దుమ్మురేపిన శాంసంగ్

ఇక గత రెండు సంవత్సరాలుగా చైనాలో తన మార్కెట్‌ను క్రమంగా కోల్పోతున్న శాంసంగ్‌ అక్కడ మే ఆఖరు లేదా జూన్‌లో ఈ మోడల్స్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. గెలాక్సీ ఎస్ 8 ఫీచర్లు ఇలా ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్క్రీన్

ఎస్‌8 ఫోన్‌లో 5.8 అంగుళాల స్క్రీన్, ఎస్‌8 ప్లస్‌లో 6.2 అంగుళాల స్క్రీన్‌ ఉంది. స్క్రీన్‌ డిస్‌ప్లే పెద్దదిగా ఉంటుంది. దాదాపు ఫోన్‌ మొత్తం స్క్రీనే ఉన్నట్లు కనిసిస్తుంది. ఆండ్రాయిడ్‌ 7.0 నౌగోట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేస్తాయి.

కెమెరా

12 ఎంపీ రియర్‌ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా.

ర్యామ్

4 జిబి ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్‌ మెమరీ.

వర్చువల్‌ రియాలిటీ

కంపెనీ ఎస్‌8, ఎస్‌8 ప్లస్‌ ఫోన్లతోపాటు కొత్త 360 డిగ్రీ కెమెరాను (360 డిగ్రీల్లోనూ వీడియో తీసుకోవచ్చు), వర్చువల్‌ రియాలిటీ హెడ్‌సెట్‌ ‘గేర్‌ వీఆర్‌'ను, ఫోన్‌ డాక్‌ ‘డెక్స్‌' వంటి పలు ప్రొడక్టులను కూడా ఆవిష్కరించింది.

వాటర్‌, డస్ట్‌ రెసిస్టెంట్‌

గత మోడళ్లలాగే ఎస్‌8, ఎస్‌8 ప్లస్‌ కూడా వాటర్‌, డస్ట్‌ రెసిస్టెంట్‌..

వేగం

గత మోడళ్ల కన్నా ఈ మోడల్‌ ప్రాసెసర్‌ 10శాతం, జీపీయూ 21శాతం వేగంగా పనిచేస్తాయి.

3300 mAh battery

వైర్‌లెస్‌ చార్జర్‌ను సైతం ఈ మోడళ్లు సపోర్ట్ చేస్తాయి. అత్యంత రక్షణతో కూడిన 8పాయింట్‌ బ్యాటరీతో ఫోన్ వచ్చింది.3300 mAh battery

ఫేస్‌ రికగ్నిషన్‌

ఈ మోడల్‌లో ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌, ఐరిస్‌ స్కానర్‌తోపాటు ఫేస్‌ రికగ్నిషన్‌ ఆప్షన్‌ కూడా ఉండనుంది. పాస్‌వర్డ్‌, ప్యాటర్న్‌ అవసరం లేకుండా ఫేస్‌ రికగ్నిషన్‌ తో ఫోన్‌ను అన్‌లాక్‌ చేయవచ్చు. అంటే ముఖాన్ని స్కాన్‌చేయడం ద్వారా ఫోన్‌ను ఆన్‌లాక్‌ చేయవచ్చు.

వాయిస్‌ అసిస్టెంట్‌ టూల్‌

అత్యాధునిక సేవలను అందించేందుకు శాంసంగ్‌ ప్రత్యేకంగా వాయిస్‌ అసిస్టెంట్‌ టూల్‌ బిక్స్‌బైను తీసుకొచ్చింది. ఎన్నో ప్రత్యేక సేవలను ఈ టూల్‌ అందిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Samsung says it sold 5 million units of its Galaxy S8 in 25 days Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting