‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ - 2013’: మొదటి రోజు ప్రముఖ ఆవిష్కరణలు

Posted By:

‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ - 2013’: మొదటి రోజు ప్రముఖ ఆవిష్కరణలు
అతిపెద్ద మొబైల్ టెక్నాలజీ ఎగ్జిబిషన్ ‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ - 2013' సోమవారం స్పెయిన్‌లోని బార్సిలోనాలో ప్రారంభమైంది. ఈ మొబైల్ గాడ్జెట్ షోను పురస్కరించుకుని ప్రముఖ మొబైల్ తయారీ బ్రాండ్‌లు ఆధునిక ఆలోచనలతో ముందుకొచ్చాయి. తొలిరోజు ఎగ్జిబిషన్ లో భాగంగా చోటుచేసకున్న ప్రముఖ ఆవిష్కరణల వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.

ముష్కరమూకల పనిపట్టే ‘ఆధునిక టెక్నాలజీ'

బెస్ట్ ల్యాప్‌టాప్‌లు.. రూ.20,000 నుంచి రూ.30,000 ధరల్లో

టెక్ చిట్కా: ప్రతి మొబైల్ లేదా స్మార్ట్‌ఫోన్‌కు ఐఎమ్ఈఐ (IMEI)నెంబర్ తప్పనిసరిగా కేటాయించటం జరుగుతుంది. ‘*#06#'కు డయిల్ చేయటం ద్వారా 15 అంకెలతో కూడిన మీ ఫోన్ ఐఎమ్ఈఐ నెంబరును తెలుసుకోవచ్చు. భవిష్యత ఉపయోగం కోసం ఈ నెంబరును భద్రపరుచటం మంచిది. ఫోన్ వెనుక భాగంలో అంటే బ్యాటరీ క్రింది ప్రదేశంలో ఈ నెంబర్‌ను మీరు చూడవచ్చు. ఫోన్ అపహరణకు గురైన సమయంలో పోలీసులను ఆశ్రయించాల్సి వస్తే తప్పనిసరిగా సదరు మొబైల్ ఐఎమ్ఈఐ (IMEI)నెంబర్‌ను ఎఫ్ఐఆర్ పత్రంలో పొందుపరచాల్సి ఉంటుంది. మొబైల్‌ను కనుగొనటంలో ఐఎమ్ఈఐ నెంబర్ కీలక పాత్ర పోషిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా లూమియా 720 (Nokia Lumia 720):


విశ్వసనీయ మొబైల్ ఫోన్ తయారీ బ్రాండ్ నోకియా, తన లూమియా సిరీస్ నుంచి ‘లూమియా 720' మోడల్‌లో సరికొత్త విండోస్ ఆధారిత ఫోన్‌లను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఆవిష్కరించింది.

స్పెసిఫికేషన్‌లు:

4.3 అంగుళాల డిస్‌ప్లే, 6.7 మెగాపిక్సల్ కెమెరా, 1గిగాహెట్జ్ డ్యూయల్-కోర్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 8జీబి ఆన్‌బోర్డ్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, ఆప్షనల్ వైర్‌లెస్ ఛార్జింగ్.
ఇండియన్ మార్కెట్లో విడుదల: రెండవ క్వార్డర్, 2013.

 

నోకియా 301 ఇంకా 305 (Nokia 301 and 105):

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా నోకియా మరో రెండు సరికొత్త ఫీచర్ ఫోన్‌లను ఆవిష్కరించింది. వీటిలో ఒకటి నోకియా 301 కాగా మరొకటి నోకియా 105. ఈ హ్యాండ్ సెట్‌లు పటిష్టమైన ధృడత్వాన్ని కలిగి ఉంటాయి. నోకియా 105 ఎంట్రీ లెవల్ మోడల్ కాగా, నోకియా 301, సొంత చిత్తరవు ఫోటో సహాయక వ్యవస్థను కలిగి నాన్-టచ్ సిరీస్ 40 యూజర్ ఇంటర్ ఫేస్ పై స్పందిస్తుంది.

అసూస్ ప్యాడ్‌ఫోన్ ఇన్ఫినిటీ (Asus Padfone Infinity):


మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ మొదటి రోజు కార్యక్రమాల్లో భాగంగా అసూస్ విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్ ‘ప్యాడ్‌ఫోన్ ఇన్ఫినిటీ'ని ప్రత్యేక ట్యాబ్లెట్ డాక్ సహాయంతో ట్యాబ్లెట్ పీసీలా ఉపయోగించుకోవచ్చు. శక్తివంతమైన ఫీచర్లను ఈ డివైజ్ కలిగి ఉంది.

అసూస్ ఫోన్ ప్యాడ్ (Asus Fonepad):

ఈ ఎగ్జిబిషన్‌లో భాగంగా అసూస్ 7 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లో బడ్జెట్ ఫ్రెండ్లీ ట్యాబ్లెట్‌ను ఆవిష్కరించింది. పేరు అసూస్ ఫోన్ ప్యాడ్. డివైజ్ సిమ్‌కార్డ్ స్లాట్ ఫీచర్‌ను కలిగి ఉండటంతో ఫోన్‌కాల్స్ నిర్వహించుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting