మోటో నుంచి 2 బెస్ట్ ఫీచర్ ఫోన్లు, 15 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో సేల్
మోటో నుంచి అదిరే ఫీచర్లతో రెండు కొత్త ఫోన్లు దూసుకురానున్నాయి.
ఇండియాలో మోటో ఫోన్లు చాలా డిమాండ్ ఉందన్నసంగతి తెలిసిందే. మోటో నుంచి కొత్త ఫోన్లు ఏం వస్తున్నాయా అని చాలామంది ఎదురుచూస్తుంటారు. వారికోసం మోటో నుంచి అదిరే ఫీచర్లతో రెండు కొత్త ఫోన్లు దూసుకురానున్నాయి. మోటోజీ5, మోటో జీ5 ప్లస్ మోడల్స్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
మెసేంజర్‌లో దిస్ లైక్ బటన్ వస్తోంది

మార్చి 15 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ఈ మోడల్స్‌ను విక్రయించనున్నారు. బార్సిలోనియాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017 సదస్సులో ఈ రెండు మోడళ్లను మోటో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. కాగా మోటో జీ5 ధర: 14,054 రూపాయలు, మోటోజీ5 ప్లస్ ధర: 15,275 రూపాయలు.
జియో దెబ్బ..చైనా కంపెనీలు కూడా..

ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే
మోటో జీ5 అలానే జీ5 ప్లస్ వర్షన్‌లు ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేలతో వస్తున్నాయి. మోటో జీ5 మోడల్ 5 అంగుళాల (1080x1920పిక్సల్స్) డిస్‌ప్లేతో వస్తోండగా, మోటో జీ5 ప్లస్ మోడల్ 5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ స్ర్కీన్‌తో వస్తోంది. ఫోన్ డిజైనింగ్ విషయానికి వచ్చేసరికి మెటల్ ఫ్రేమ్స్ అలానే జెంటిల్ కర్వుస్ ఆకట్టుకుంటాయి.

ఆండ్రాయిడ్ నౌగట్
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతోన్న ఈ 5వ తరం మోటో జీ హ్యాండ్‌సెట్‌లు ఆధునీకరించబడిన డిజైనింగ్‌తో పాటు బెటర్ క్వాలిటీ హార్డ్‌వేర్ ఫీచర్లను కలిగి ఉన్నాయి.

కెమెరా క్వాలిటీ
ఫోటోగ్రఫీ విషయానికి వచ్చేసరికి, మోటో జీ5 ఫోన్.. 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ అలానే 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది. ఇదే సమయంలో మోటో జీ5 ప్లస్.. 12 మెగా పిక్సల్ డ్యుయల్ కెమెరా సెటప్‌తో పాటు, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది. మోటో జీ5 ప్లస్ కెమెరా ద్వారా 4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

ర్యామ్, ప్రాసెసర్
మోటో జీ5 ఫోన్ 1.4GHz స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. ఇదే సమయంలో మోటో జీ5 ప్లస్ మోడల్ 2GHz ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. ర్యామ్ విషయానికి వచ్చేసరికి మోటో జీ5 ఫోన్ 2జీబి అలానే 3జీబి ర్యామ్ వేరియంట్ లలో అందుబాటులో ఉంటుంది. ఇదే సమయంలో మోటో జీ5 ప్లస్ 3జీబి అలానే 4 జీబి ర్యామ్ వేరియంట్ లలో అందుబాటులో ఉంటుంది

స్టోరేజ్ వేరియంట్స్
స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి.. మోటో జీ5, మోటో జీ5 ప్లస్ మోడల్స్ 16జీబి, 32జీబి, 64జీబి స్టోరేజ్ వేరియంట్ లలో అందుబాటులో ఉంటాయి. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు.

బ్యాటరీ బ్యాకప్..
బ్యాటరీ విషయానికి వచ్చేసరికి.. మోటో జీ5 మోడల్ 2,800mAh బ్యాటరీ యూనిట్‌తో వస్తోంది. ఇదే సమయంలో మోటో జీ5 ప్లస్ మోడల్ 3,000mAh బ్యాటరీ యూనిట్‌తో వస్తోంది. టర్బో ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తోన్న ఈ రెండు ఫోన్‌లలో బ్యాటరీ వేగవంతంగా ఛార్జ్ అవుతుంది. ఈ రెండు ఫోన్‌లు 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తాయి.


Click it and Unblock the Notifications








