Nokia కొత్త ఫీచర్ ఫోన్‌లు!!!! తక్కువ ధరలోనే...
ప్రముఖ హెచ్‌ఎండి గ్లోబల్ సంస్థ ఇప్పుడు కొత్తగా రెండు ఫీచర్ ఫోన్లు నోకియా 125, నోకియా 150 (2020) లను అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసింది. నోకియా 150 (2020) ఫోన్ 2016 లో కంపెనీ ప్రారంభించిన నోకియా 150 యొక్క అప్ డేట్ వెర్షన్ అని చెప్పబడింది.

నోకియా ఫీచర్ ఫోన్లు
ఈ రెండు ఫీచర్ ఫోన్లు తొలగించగల 1020mAh బ్యాటరీతో మరియు 2.4-అంగుళాల QVGA కలర్ డిస్ప్లేను కలిగి ఉన్నాయి. ఈ రెండు ఫీచర్ ఫోన్‌లు అద్భుతమైన మరియు పొడవైన డిజైన్‌ను కలిగి ఉన్నాయి.ఇందులో మెసేజ్లు మరియు కాలింగ్‌కు సహాయపడే బటన్లకు అనుగుణంగా ఎక్కువ స్థలాన్ని కలిగి ఉంది.

ఈ ఫీచర్ ఫోన్‌ల యొక్క నిర్దిష్ట ప్రయోగ తేదీని హెచ్‌ఎండి గ్లోబల్ సంస్థ ప్రకటించలేదు. కాబట్టి ఇండియాలో ఈ ఫోన్‌ల యొక్క లభ్యత గురించి ఇంకా ఇటువంటి ఖచ్చితమైన సమాచారం లేదు. అలాగే రెండు ఫోన్‌లు ఎంచుకున్న మార్కెట్లలో మాత్రమే లభిస్తాయని హెచ్‌ఎండి గ్లోబల్ సంస్థ తెలిపింది.

ధరల వివరాలు
అంతర్జాతీయ మార్కెట్లలో నోకియా 150 (2020) ఫీచర్ ఫోన్ రూ.2,200 ధర వద్ద బ్లాక్, సియాన్ మరియు రెడ్ అనే మూడు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. అలాగే నోకియా 125 ఫీచర్ ఫోన్ యొక్క ధర సుమారు 1,800 రూపాయలు. ఈ ఫోన్ చార్కోల్ బ్లాక్ మరియు పౌడర్ వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

నోకియా 125 స్పెసిఫికేషన్స్
నోకియా 125 ఫీచర్ ఫోన్ 2.4-అంగుళాల క్యూవిజిఎ కలర్ డిస్ప్లేను కలిగి ఉండి మెరుగైన కీప్యాడ్‌తో వస్తుంది. నోకియా 125 ఫీచర్ ఫోన్ యొక్క ఉత్తమ లక్షణం 19.4 గంటల టాక్ టైమ్ లైఫ్ మరియు 23.4 రోజుల స్టాండ్ బై సమయంను కలిగి ఉండడం. ఈ ఫోన్ 91.3 గ్రాముల బరువును కలిగి ఉండి 132 × 50.5x15mm కొలతలతో వస్తుంది.

నోకియా 125 ఫీచర్స్
నోకియా 125 సిరీస్ 30+ సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తుంది మరియు 4MB యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో ఫ్లాష్ సపోర్ట్ ఉన్న వీజీఆర్ కెమెరా కూడా ఉంది.ఇందులో క్లాసిక్ గేమ్, స్నేక్ జెన్జియా గేమ్ లు ఆడదానికి అవకాశం ఉంది. నోకియా 125 సింగిల్ సిమ్ (మినీ) మరియు డ్యూయల్ సిమ్ (మినీ) ఎంపికలలో వస్తుంది. అలాగే ఇది 1020 ఎమ్ఏహెచ్ తొలగించగల బ్యాటరీ మరియు 3.5mm హెడ్ ఫోన్ జాక్ తో ప్యాక్ చేయబడి వస్తుంది.

నోకియా 150 (2020) ఫీచర్ ఫోన్ స్పెసిఫికేషన్స్
నోకియా 150 (2020) ఫోన్ కూడా నోకియా 125 వంటి సారూప్య లక్షణాలను కలిగి ఉంది. అయినప్పటికీ నోకియా 150 (2020) ఫోన్ లో వినియోగదారులకు కొంచెం అదనపు ప్రయోజనం లభిస్తుంది. ఇది 2016 లో రిలీజ్ అయిన నోకియా 150 యొక్క అప్ డేట్ వెర్షన్ అని చెప్పబడింది. నోకియా 150 (2020) డ్యూయల్ సిమ్ (మినీ) ఎంపికను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 90.54 గ్రాముల బరువును కలిగి ఉండి 132 × 50.5x15mm కొలతలతో వస్తుంది.

నోకియా 150 (2020) స్టోరేజ్
నోకియా 150 (2020) లో ప్రత్యేకమైన MP3 ప్లేయర్ మరియు 4MB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డు స్లాట్ తో మెమొరీని 32GB వరకు విస్తరించవచ్చు. నోకియా 150 (2020) ఫీచర్ ఫోన్ కూడా సిరీస్ 30+ సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తుంది మరియు బ్లూటూత్ v3.0 ను కలిగి ఉంది. అలాగే ఇందులో 4MB ర్యామ్ మరియు తొలగించగల 1020mAh బ్యాటరీ కూడా ఉంది. ఈ బ్యాటరీ 19.4 గంటల వరకు టాక్ టైమ్‌ను అందిస్తుంది.


Click it and Unblock the Notifications








