Google Phone కొత్త అప్‌డేట్‌లతో నోకియా స్మార్ట్‌ఫోన్‌లు

|

నోకియా సంస్థ ఇటీవల విడుదల చేసిన ఫోన్‌లతో సహా తన అన్ని ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌లలో గూగుల్ ఫోన్ యాప్ యాక్సిస్ ను తీసుకువచ్చింది. సరళమైన గూగుల్ డయలర్ ఫ్లిప్ టు సైలెన్స్ లేదా ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ వంటి చాలా కొత్త ఫీచర్లతో రాదు. అయితే క్రొత్త అప్ డేట్ గూగుల్ ఫోన్ పునరుద్ధరణకు సంకేతం కావచ్చు.

గూగుల్ ఫోన్ యాప్

గూగుల్ ఫోన్ యాప్

ఈ గూగుల్ ఫోన్ యాప్ కొంతకాలంగా కాల్ రికార్డింగ్ వంటి అదనపు ఫీచర్లపై పనిచేస్తోంది. నోకియా స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉన్న భారతీయ వినియోగదారులు కాల్ రికార్డింగ్ ఫీచర్లతో యాప్ యొక్క అప్ డేట్ ను స్వీకరించడం ప్రారంభించారు. అధికారిక నోకియా కమ్యూనిటీ ఫోరమ్‌లలో ఇటీవలి పోస్ట్‌లో నోకియా 7 ప్లస్ యూజర్ ఈ ఫీచర్‌ను పొందారని ధృవీకరించారు. తరువాత నోకియా 7.2, నోకియా 8.1 మరియు నోకియా 7 ప్లస్ వినియోగదారులు కూడా ఇండియాలో ఈ కొత్త ఫీచర్‌ను పొందుతున్నట్లు నివేదించారు.

నోకియా-గూగుల్ ఫోన్ అప్ డేట్

నోకియా-గూగుల్ ఫోన్ అప్ డేట్

క్రొత్త గూగుల్ ఫోన్ అప్ డేట్ దాదాపుగా సిద్ధంగా ఉంది. ఇది త్వరలో మరింత విస్తృతమైన రోల్ అవుట్ తో ఉండాలని సూచిస్తుంది. గూగుల్ ఫోన్ యొక్క వెర్షన్ v47 అప్‌డేట్‌లో ఫ్లిప్ టు సైలెన్స్ ఫీచర్‌లో గూగుల్ కూడా పనిచేస్తుందని చెప్పడం విశేషం. అలాగే వీడియో కాలింగ్ వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్ కూడా ఉంది. క్రొత్త ఫీచర్ వీడియో కాల్‌లకు వన్-వే పద్ధతిలో సమాధానం ఇవ్వడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

నోకియా 9.3 ప్యూర్ వ్యూ కెమెరా ఫీచర్స్
 

నోకియా 9.3 ప్యూర్ వ్యూ కెమెరా ఫీచర్స్

నోకియా సంస్థ నుంచి రాబోయే నోకియా 9.3 ప్యూర్ వ్యూ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 108 మెగాపిక్సెల్ కెమెరా ఫీచర్లతో రాబోతున్నట్లు సమాచారం. 108 మెగాపిక్సెల్ సెన్సార్‌ల కంటే ముందు నోకియా 9.3 ప్యూర్‌వ్యూ కోసం 24 మెగాపిక్సెల్, 20 మెగాపిక్సెల్, 48 మెగాపిక్సెల్ సెన్సార్లను కంపెనీ పరీక్షించినట్లు కొన్ని నివేదికలు సూచించాయి. ప్రస్తుతం ఉన్న పుకార్ల ప్రకారం రాబోయే ఫోన్ ఆగస్టు లేదా సెప్టెంబరులో ఇండియాలో విడుదల కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

నోకియా 9.3 ప్యూర్ వ్యూ లీక్ స్పెసిఫికేషన్స్

నోకియా 9.3 ప్యూర్ వ్యూ లీక్ స్పెసిఫికేషన్స్

నోకియా 9.3 ప్యూర్ వ్యూ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ ప్యానెల్తో రాబోతున్నట్లు సమాచారం. ఇప్పుడు చాలా స్మార్ట్‌ఫోన్లు ఇటువంటి ఫ్లాగ్‌షిప్‌ల ఫీచర్లతో మార్కెట్ లోకి వస్తున్నాయి. ఇటీవల శామ్‌సంగ్ గెలాక్సీ S20 సిరీస్ ఫీచర్ ఫోన్ 120HZ ప్యానెల్స్‌తో విడుదల అయ్యాయి. దీనితో పాటు వన్‌ప్లస్ 8 ప్రో కూడా ఇదే రకమైన ఫీచర్లను ఉపయోగించింది. రాబోయే నోకియా ఫోన్ లాంచ్ ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా తయారీ మరియు లాజిస్టిక్స్ ఆలస్యం కావడం దీనికి ప్రధాన కారణం.

Best Mobiles in India

English summary
Nokia Phones Receives Google Phone Update in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X