రికార్డుల బుల్లి ఫోన్ వస్తోంది, దుమ్ము రేపే ఫీచర్లతో..

Written By:

నోకియా 3310 ఈ ఫోన్ గురించి పరిచయం చేయనక్కరలేదు. ఒకప్పుడు మొబైల్ మార్కెట్ లో టాప్ సెల్లర్‌గా నిలిచింది. ఇప్పటికే చాలామంది ఈ ఫోనంటే ఇష్టపడతారు కూడా. దుమ్మురేపే ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి అతి త్వరలోనే దూసుకొస్తోంది.

ఫోన్ నుంచే మీ పీఎఫ్ డ్రా !

ఈ నెల చివరి వారంలో మలేషియాలో ఈ ఫోన్‌ని లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు నోకియా 3, 5 ,6 కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. ఏప్రిల్ చివరి వారంలో ఈ ఫోన్ లాంచ్ అయినప్పటికీ మార్చి 5 అర్థరాత్రి నుంచి అమ్మకాలు జరుగుతాయని కంపెనీ తెలిపింది. ధర ఎంతనేది ఇంకా కంపెనీ చెప్పలేదు.

రూ.1999కే 4జీ వోల్ట్ ఫోన్, దిగ్గజాలకు మైక్రోమ్యాక్స్ షాక్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోడల్ కన్నా 10 రెట్లు ఎక్కువ బ్యాటరీ పవర్‌

అప్‌డేట్ ఫీచర్లతో వస్తున్న నోకియా 3310 పాత మోడల్ కన్నా 10 రెట్లు ఎక్కువ బ్యాటరీ పవర్‌ని కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది. 22 గంటలు ఏకధాటిగా మాట్లాడుకునే బ్యాటరీ పవర్‌ని రూపొందించారు.

2.4 ఇంచ్ QVGA డిస్‌ప్లే

నోకియా 3310 2.4 ఇంచ్ QVGA డిస్‌ప్లేతో రానుంది. రిజల్యూషన్ 240 pixels by 320 pixels.

2 ఎంపీ కెమెరా‌

2 ఎంపీ కెమెరా‌తో ఈ ఫోన్ రానుంది. స్నేక్ గేమ్ అప్‌గ్రేడెడ్ వర్సన్‌తో రానుంది. ఈ గేమ్‌ని ఫోన్‌లో ఫ్రీ ఇన్‌స్టాల్ చేశారు.

రెడ్, గ్రీన్ ఇంకా ఎల్లో కలర్ వేరియంట్‌లలో

పాత వర్షన్ నోకియా 3310 గ్రే, బ్లాక్ ఇంకా యాఫ్ బ్లూ కలర్ వేరియంట్‌లలో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు.. రెడ్, గ్రీన్ ఇంకా ఎల్లో కలర్ వేరియంట్‌లలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

పెద్ద కలర్ డిస్‌ప్లేను

గతంలో వచ్చిన మోడల్‌తో పోలిస్తే స్వల్ప మార్పుచేర్పులు ఈ ఫోన్‌లో ఉంటాయి. తాజాగా నోకియా కంపెనీ తీసుకువస్తున్న కొత్త ఫోన్ 3310 మోడల్ ఇంకాస్త పెద్ద కలర్ డిస్‌ప్లేను కలిగి ఉండనుంది.

16 ఎంబి ఇంటర్నల్ స్టోరేజ్

16 ఎంబి ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటు మైక్రో ఎస్ డీ ద్వారా 32 జిబి వరకు విస్తరణ సామర్ధ్యాన్ని ఈ ఫోన్ కలిగి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Nokia 3310 to Launch in April; Nokia 3, 5, and 6 to Follow read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting