Home
Mobile

రూ.28 వేల స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.19 వేలకే.. 6.7-అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరా, ఇంకా మరెన్నో!

Realme P2 Pro: రియల్‌మీ P2 ప్రో 5G ఇండియాలో సూపర్ హిట్ అయింది. మంచి ఫీచర్లు ఉండటమే కాకుండా తక్కువ ధరకు లభించడంతో చాలామంది కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో మరింత తగ్గింపుతో లభిస్తోంది. ప్రత్యేక సేల్ ఏమీ లేకపోయినా, ఈ ప్రీమియం 5G స్మార్ట్‌ఫోన్‌ను ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లతో కలిపి రూ.19,000లోపే సొంతం చేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లతో ఫోన్ కోసం చూస్తుంటే, ఇది సరైన సమయం.

* రియల్‌మీ P2 ప్రో 5G ధర, ఆఫర్లు

రియల్‌మీ P2 ప్రో (8GB RAM + 128GB స్టోరేజ్) అసలు ధర రూ.27,999. కానీ ఫ్లిప్‌కార్ట్ ఏకంగా 28 శాతం డిస్కౌంట్ ఇస్తోంది, దీంతో ధర ఒక్కసారిగా రూ.19,999కి పడిపోయింది. అంతేకాదు, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడేవారికి అదనంగా 5% క్యాష్‌బ్యాక్ కూడా ఉంది.

On Realme P2 Pro 5G Huge Price Drop on Flipkart now available for just Rs 19999

మీ పాత ఫోన్ కండిషన్ బాగుంటే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా గరిష్టంగా రూ.19,450 వరకు తగ్గింపు పొందొచ్చు. ఎక్స్ఛేంజ్ మినహాయించి ఇతర అన్ని బ్యాంక్ ఆఫర్లు కలిపితే, ఈ ఫోన్ ధర రూ.18,809కి తగ్గే అవకాశం ఉంది. EMI ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. SBI కార్డ్ హోల్డర్లు నెలకు రూ.872తో ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ యూజర్లు కూడా వెయ్యి రూపాయల లోపే ఈఎంఐతో కొనుక్కోవచ్చు. మిగిలిన వారికైతే EMI నెలకు రూ.980 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే తక్కువ జీతం వచ్చేవాళ్లైనా, నెల నెలా కరెక్ట్‌గా సంపాదన లేనివాళ్లైనా సరే, ఈ ఫోన్ ధైర్యంగా కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల ఆర్థిక భారం పడదు.

* రియల్‌మీ P2 ప్రో 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఈ ఫోన్‌లో 6.7-అంగుళాల FHD+ 3D కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్క్రోలింగ్, గేమింగ్ చాలా స్మూత్‌గా ఉంటాయి. 1,080 x 2,412 పిక్సెల్స్ రిజల్యూషన్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉండటంతో ఫోన్ చాలా ఫాస్ట్‌గా రెస్పాండ్ అవుతుంది.

డిస్‌ప్లేకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది, 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో సూర్యరశ్మిలో కూడా స్క్రీన్ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 ప్రాసెసర్ ఉంది, ఇది 2.4GHz స్పీడ్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తోంది ఈ ఫోన్.

12GB RAM, 256GB స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. వెనుకవైపు 50MP మెయిన్ కెమెరా ఉంది, ఇది స్పష్టమైన ఫోటోలను అందిస్తుంది. ముందువైపు 32MP కెమెరా ఇచ్చారు, దీంతో సెల్ఫీలు క్వాలిటీతో వస్తాయి. ఇందులో 5,200mAh బ్యాటరీ ఉంది, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో ఫోన్‌ను చాలా త్వరగా ఛార్జ్ చేసుకోవచ్చు.

* యూజర్ రేటింగ్స్, రివ్యూలు

రియల్‌మీ P2 ప్రోకి 8,839 మంది యూజర్లు 4.4/5 రేటింగ్ ఇచ్చారు, అలాగే 740 రివ్యూలు కూడా ఉన్నాయి. డిస్‌ప్లే క్లారిటీ, స్మూత్‌నెస్‌కు 4.4/5 రేటింగ్, డిజైన్‌కు 4.4/5 రేటింగ్, పర్ఫార్మెన్స్‌కు 4.3/5 రేటింగ్, ఫాస్ట్ ఛార్జింగ్‌కు 4.0/5 రేటింగ్ ఇచ్చారు. అయితే, బ్యాటరీ బ్యాకప్ విషయంలో కొంతమంది యూజర్లు 3.3/5 రేటింగ్ ఇచ్చారు, బ్యాటరీ అనుకున్నదానికంటే కాస్త త్వరగా అయిపోతుందని చెప్పారు.

మొత్తానికి, అదిరిపోయే ఫీచర్లు, భారీగా తగ్గిన ధరతో రియల్‌మీ P2 ప్రో రూ.19,000లోపు మంచి డీల్ అని చెప్పొచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme P2 Pro discounted under Rs 19,000 on Flipkart boasts great features like AMOLED display, fast charging, and 50MP camera. Positive user reviews highlight its value.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X