5G స్మార్ట్‌ఫోన్ కొనాలా.. 12GB ర్యామ్, 50MP కెమెరా, 100W ఛార్జింగ్‌తో వస్తున్న వన్‌ప్లస్ 13R ఇప్పుడే కేవలం రూ.
OnePlus 13R: కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా, అయితే మీకో గుడ్ న్యూస్. వన్ ప్లస్ కంపెనీ తాజాగా విడుదల చేసిన వన్ ప్లస్ 13R ఫోన్ ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో అందుబాటులో ఉంది. ఇండియన్ మార్కెట్ లో ఈ ఫోన్ అసలు ధర రూ.49,999. కానీ ఇప్పుడు మీరు దీన్ని కేవలం రూ.32,000కే కొనుక్కోవచ్చు. అమెజాన్‌లో ఉన్న ఆఫర్లు ఉపయోగించుకుంటే ఈ డీల్ మీ సొంతం.
* ఎలా ఆఫర్ పొందాలి
నిర్దిష్ట బ్యాంకుల క్రెడిట్ కార్డులతో ఈ మొబైల్ కొంటే వెంటనే రూ.3,000 డిస్కౌంట్ వస్తుంది. అంతేకాదు, మీ పాత ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ చేస్తే అదనంగా రూ.24,300 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. మీ పాత ఫోన్ బాగా పనిచేస్తూ ఉంటే, కనీసం రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూ వస్తుంది.

అప్పుడు వన్‌ప్లస్ 13R ధర అక్షరాలా రూ.31,999కి తగ్గుతుంది. మీ పాత ఫోన్ కండీషన్, మోడల్‌ని బట్టి ఎక్స్చేంజ్ వాల్యూ మారుతుంది. మీ పాత ఫోన్ ఇంకా బాగానే ఉన్నా, మీకు 5G స్పీడ్ కావాలన్నా, ఛార్జింగ్ స్పీడ్ విషయంలో రాజీ పడొద్దనుకున్నా, ఈ ఫోన్ తీసుకోవడం తెలివైన పని అవుతుంది.
* వన్‌ప్లస్ 13R ఫీచర్స్
ఈ ఫోన్‌లో 6.78-అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అందించారు. వీడియోలు చాలా బాగా వస్తాయి. ఎంత క్వాలిటీ వీడియోలైనా ల్యాగ్ అవ్వవు. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో ఫోన్ వేగంగా పనిచేస్తుంది. 12GB RAM, 1TB వరకు స్టోరేజ్ ఉండటంతో గేమ్స్ ఆడినా, వీడియోలు చూసినా ఫోన్ నెమ్మదించదు.
* బ్యాటరీ కూడా అదిరింది.
6,000mAh బ్యాటరీతో రోజంతా వాడుకోవచ్చు. 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండటంతో క్షణాల్లో ఫోన్ ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఇందులో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. 50MP మెయిన్ కెమెరా (OIS తో), 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OxygenOS 15 తో ఫోన్ పనిచేస్తుంది. గూగుల్ జెమిని AI ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌తో రోజువారీ పనులు సులువుగా చేసుకోవచ్చు. వీడియో ఎడిటింగ్ చేసేవాళ్లకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా బయట తిరిగేవాళ్లకి కూడా ఈ ఫీచర్లు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
* ప్లస్, మైనస్ పాయింట్స్
ఈ ఫోన్ ప్లస్ పాయింట్స్ చూస్తే, పెద్ద, మంచి కలర్స్‌తో ఉండే డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేటుతో స్క్రీన్ చాలా మృదువుగా పనిచేస్తుంది. ఫాస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ ఉండటంతో ఫోన్ వేగంగా పనిచేస్తుంది. బ్యాటరీ కూడా 6,000mAh వస్తుంది, 100W ఫాస్ట్ చార్జింగ్ ఉండటంతో చార్జింగ్ అయిపోయిందనే ఆందోళన ఉండదు.
కెమెరాలు కూడా చాలా బాగుంటాయి, ముఖ్యంగా OIS ఫీచర్ తో ఫొటోలు షేక్ అవ్వకుండా వస్తాయి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ కూడా రెగ్యులర్‌గా వస్తాయి. మైనస్ పాయింట్స్ విషయానికొస్తే, వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ లేదు, అలాగే తక్కువ లైటింగ్ లో కెమెరా యావరేజ్ గా అనిపిస్తుంది. ఈ విషయాలను గుర్తు పెట్టుకొని కొనచ్చో లేదో నిర్ణయించుకోవచ్చు
* కలర్స్, ఎక్కడ కొనాలి
వన్ ప్లస్ 13R రెండు కలర్లలో లభిస్తుంది. అవి నెబ్యులా నోయిర్, ఆస్ట్రల్ ట్రైల్. ఈ ధరకు ఇన్ని ఫీచర్స్ ఉన్న ఫోన్ దొరకడం నిజంగా అద్భుతం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే అమెజాన్ లో ఈ డీల్ ని చెక్ చేసి, మీ కొత్త వన్ ప్లస్ 13R ఫోన్ ని ఆర్డర్ చేసుకోండి.


Click it and Unblock the Notifications








