Home
Mobile

OnePlus 8 & 8 Pro స్మార్ట్‌ఫోన్‌ల ధరలు, ఫీచర్స్ మీద ఓ లుక్ వేయండి!!!!

వన్‌ప్లస్ యొక్క కొత్త స్మార్ట్ ఫోన్లు 8 సిరీస్ గురించి అనేక లీక్‌లు మరియు పుకార్ల తరువాత చివరకు తన తాజా ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను విడుదల చేసింది. వన్‌ప్లస్ 8 మరియు వన్‌ప్లస్ 8 ప్రో అధిక రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 865 చిప్‌సెట్, 5G మరియు వై-ఫై 6 సపోర్ట్, భారీ సైజ్ బ్యాటరీలు వంటివి అద్భుతమైన స్పెసిఫికేషన్ లను కలిగి ఉన్నాయి.

వన్‌ప్లస్ 8 సిరీస్

వన్‌ప్లస్ 8 సిరీస్

వన్‌ప్లస్ 8 సిరీస్ ఫోన్ల యొక్క ధరలు $ 699 నుండి మొదలవుతాయి. ప్రస్తుతం ఇవి సంస్థ యొక్క ఆన్‌లైన్ స్టోర్ ద్వారా విక్రయించబడుతుంది. ఇందులో బేసిక్ వెర్షన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలతో ప్యాక్ చేయబడి రాగా, ప్రో వెర్షన్‌ క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. అలాగే వన్‌ప్లస్ 8 ప్రో వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు వస్తుంది. భారతదేశంలో వన్‌ప్లస్ 8 సిరీస్ యొక్క ధర మరియు స్పెసిఫికేషన్స్ గురించి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వన్‌ప్లస్ 8 ధరల వివరాలు

వన్‌ప్లస్ 8 ధరల వివరాలు

వన్‌ప్లస్ 8 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను 8GB / 12GB RAM మరియు 128GB / 256GB స్టోరేజ్ అనే రెండు కాన్ఫిగరేషన్లలో విడుదల చేసింది. ఇందులో వన్‌ప్లస్ 8 యొక్క 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధరను $699 గా నిర్ణయించబడింది. ఇండియాలో దీని యొక్క ధర సుమారు 53,090 రూపాయలు. అలాగే 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్ ధర $ 799 (సుమారు రూ .60,690).

 

 

వన్‌ప్లస్ 8 ప్రో ధరల వివరాలు

వన్‌ప్లస్ 8 ప్రో ధరల వివరాలు

వన్‌ప్లస్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర $ 899 (సుమారు రూ. 68,280). అలాగే 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ $999 (సుమారు రూ .75,880) ధర వద్ద లభిస్తుంది. ఈ పరికరాలు ఏప్రిల్ 19 నుండి విక్రయించబడతాయి. వన్‌ప్లస్ 8 మరియు 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌ల ఇండియా ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.

 

 

 

వన్‌ప్లస్ 8 సిరీస్ స్పెసిఫికేషన్స్

వన్‌ప్లస్ 8 సిరీస్ స్పెసిఫికేషన్స్

వన్‌ప్లస్ 8 స్మార్ట్‌ఫోన్‌ 6.55-అంగుళాల ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లేను 20: 9 కారక నిష్పత్తితో, HDR 10+ సపోర్ట్ మరియు 3D కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇది sRGB మరియు డిస్ప్లే P3 కలర్ ప్రొఫైల్స్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేకి మద్దతును అందిస్తుంది. దీని యొక్క ప్యానెల్ FHD + రిజల్యూషన్ వద్ద పనిచేస్తుంది. అలాగే వన్‌ప్లస్ 8 ప్రో వెర్షన్ 6.88-అంగుళాల ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లేను 19.8: 9 కారక నిష్పత్తితో, HDR10+ మరియు క్యూహెచ్‌డి + రిజల్యూషన్ మరియు 120HZ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది.

వన్‌ప్లస్ 8సిరీస్ సెన్సార్

వన్‌ప్లస్ 8సిరీస్ సెన్సార్

వన్‌ప్లస్ యొక్క సరికొత్త 8సిరీస్ ఫోన్‌లు క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 865 SoC తో రన్ అవుతూ అడ్రినో 650 GPU తో జత చేయబడి ఉంటుంది. వన్‌ప్లస్ 8 స్మార్ట్‌ఫోన్‌ 4,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో రాగా వన్‌ప్లస్ 8 ప్రో వెర్షన్ 4,510 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ రెండు ఫోన్‌లు వార్ప్ ఛార్జ్ 30T (30W ఫాస్ట్ ఛార్జింగ్) కు మద్దతుతో వస్తాయి. ప్రో వేరియంట్లో 30W వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు హాప్టిక్ వైబ్రేషన్ 2.0 సపోర్ట్ కూడా ఉంది. వన్‌ప్లస్ 8 సిరీస్ ఆండ్రాయిడ్ 10 తో ఆక్సిజన్‌ఓస్‌తో రన్ అవుతుంది. ఇవి డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉండి శబ్దం రద్దుతో పాటు డాల్బీ అట్మోస్‌కు మద్దతును ఇస్తాయి. ఈ రెండు ఫోన్‌లలో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.

వన్‌ప్లస్ 8 కెమెరా సెట్ అప్

వన్‌ప్లస్ 8 కెమెరా సెట్ అప్

కెమెరాల విషయానికొస్తే వన్‌ప్లస్ 8 స్మార్ట్ ఫోన్ 48 మెగాపిక్సెల్ సోనీ IMX586 సెన్సార్‌ను f / 1.75 ఎపర్చరు మరియు 0.8 μm పిక్సెల్ పరిమాణంతో కలిగి ఉంది. ఈ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మరియు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS) రెండింటికి మద్దతు ఇస్తుంది. ఇది 16 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో ఎఫ్ / 2.2 ఎపర్చరు మరియు 116-డిగ్రీ ఫీల్డ్ వ్యూతో జత చేయబడి ఉంటుంది. ఈ సెటప్‌లో 1.75 మైక్రాన్ పిక్సెల్ సైజు మరియు ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉంది. దీనికి డ్యూయల్-ఎల్ఈడి ఫ్లాష్ సహాయపడుతుంది. సెటప్ PDAF మరియు కాంట్రాస్ట్-బేస్డ్ ఆటో ఫోకస్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సోనీ IMX471 సెన్సార్ f / 2.45 ఎపర్చరు మరియు ఫిక్స్‌డ్ ఫోకస్ మరియు EIS తో ఉంటుంది.

వన్‌ప్లస్ 8 ప్రో కెమెరా సెట్ అప్

వన్‌ప్లస్ 8 ప్రో కెమెరా సెట్ అప్

వన్‌ప్లస్ 8 ప్రోలో వెనుకవైపు క్వాడ్-కెమెరా మాడ్యూల్ జతచేయబడి ఉంటుంది. ఈ సెటప్‌లో 48 మెగాపిక్సెల్ సోనీ IMX689 మెయిన్ సెన్సార్ ఎఫ్ / 1.78 ఎపర్చరు మరియు 1.12 మైక్రాన్ పిక్సెల్ సైజు ఉంటుంది. ఇది OIS మరియు EIS లకు మద్దతును అందిస్తుంది. 48 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్ కూడా ఉంది. ఇది ఎఫ్ / 2.2 ఎపర్చరు మరియు 119.7-డిగ్రీల వీక్షణ క్షేత్రాన్ని కలిగి ఉంది. మూడవ సెన్సార్ f / 2.4 ఎపర్చరు మరియు OIS తో 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. F / 2.4 ఎపర్చరుతో నాల్గవ 5 మెగాపిక్సెల్ కలర్ ఫిల్టర్ సెన్సార్ కూడా ఉంది. ఇది PDAF, లేజర్ ఆటో-ఫోకస్, CAF, 3X ఆప్టికల్ జూమ్ మరియు డ్యూయల్-LED ఫ్లాష్‌లకు మద్దతు ఇస్తుంది. సెల్ఫీల కోసం ఇందులో కూడా ముందువైపు 16 మెగాపిక్సెల్ సోనీ IMX471 సెన్సార్ ఉంది.

Best Mobiles in India

English summary
OnePlus 8, OnePlus 8 Pro Launched : Price, Specifications and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X