ఒప్పో F29 ప్రో vs రియల్‌మీ P3 అల్ట్రా.. రూ.30,000లోపు ధరలో అదే అసలైన తోపు ఫోన్?
OPPO F29 Pro vs Realme P3 Ultra: రూ.30,000 బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీ ముందు మీకోసం మంచి ఆప్షన్లు ఉన్నాయి. అవే ఒప్పో F29 ప్రో, రియల్‌మీ P3 అల్ట్రా. ఒప్పో ఫోన్ వాడకంలో స్మూత్‌గా, ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తుందని చెబుతుంటే, రియల్‌మీ మాత్రం తమ ఫోన్ చాలా వేగంతో పనిచేస్తుందని అంటోంది.
మరి నిజంగా ఏది బెటర్, ఏది తోపు ఫోన్? తెలుసుకోవడానికి మేం ఈ రెండు ఫోన్లను రకరకాల పరీక్షలకు గురిచేశాం. అవి బెంచ్‌మార్క్ స్కోర్స్ నుంచి రియల్ లైఫ్ గేమింగ్ వరకు ఉన్నాయి. వీటిలో ఏ ఫోన్ ఎక్కువ స్కోరు చేసి పై చేయి సాధించిందో తెలుసుకుందాం పదండి.

శాంసంగ్ నుంచి సరికొత్త ఫోల్డబుల్ ఫోన్.. ఇక లోపలికే కాదు, బయటకీ మడతపెట్టొచ్చు!
* గీక్‌బెంచ్ బెంచ్‌మార్క్: ప్రాసెసర్ పవర్‌లో ఎవరు టాప్?
గీక్‌బెంచ్ అనేది ఫోన్ ప్రాసెసర్ ఎంత వేగంగా పనిచేస్తుందో కొలిచే ఒక పరీక్ష. ఇందులో సింగిల్-కోర్ (ఒక పనిని చేసేటప్పుడు వేగం), మల్టీ-కోర్ (ఒకేసారి ఎక్కువ పనులు చేసేటప్పుడు వేగం) పనితీరును చూస్తారు. స్కోర్ ఎక్కువ ఉంటే, ఫోన్ అంత స్పీడ్‌గా పనిచేస్తుందని అర్థం.
గీక్‌బెంచ్ ప్రాసెసర్ పనితీరు పరీక్షలో, మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌తో వచ్చిన రియల్‌మీ P3 అల్ట్రా సింగిల్-కోర్‌లో 1,278 పాయింట్లు, మల్టీ-కోర్‌లో 3,991 పాయింట్లు సాధించింది. అదే సమయంలో, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్‌సెట్‌ను ఉపయోగించిన ఒప్పో F29 Pro సింగిల్-కోర్‌లో 1,008 పాయింట్లు, మల్టీ-కోర్‌లో 2,937 పాయింట్లు నమోదు చేసింది.
- విజేత రియల్‌మీ P3 అల్ట్రా
రియల్‌మీ P3 అల్ట్రా సింగిల్-కోర్‌లో 25%, మల్టీ-కోర్‌లో ఏకంగా 35% ఎక్కువ స్కోర్‌తో అదరగొట్టింది. అంటే రోజువారీ పనులైనా, హెవీగా వాడినా ఒప్పో F29 ప్రో కంటే రియల్‌మీ ఫోనే వేగంగా స్పందిస్తుంది. అయితే, సింగిల్-కోర్ స్కోర్లలో మరీ అంత పెద్ద తేడా లేదు కాబట్టి, మామూలు వాడకంలో రెండూ బాగానే పనిచేస్తాయి.
LG డాల్బీ అట్మాస్ సౌండ్ బార్‌పై భారీ డిస్కౌంట్.. 3.1.3 ఛానల్, DTS:X, 400W పవర్‌తో థియేటర్ అనుభూతి.!
* అన్‌టుటు బెంచ్‌మార్క్‌లో ఏది మేటి?
అన్‌టుటు టెస్ట్ ఫోన్ పనితీరును మొత్తం (ఓవరాల్‌గా) పరీక్షిస్తుంది. ఇందులో ప్రాసెసర్ (CPU), గ్రాఫిక్స్ (GPU), మెమరీ, ఫోన్ వాడే అనుభూతి (User Experience) అన్నీ కలిసి ఉంటాయి. కాగా రియల్‌మీ P3 అల్ట్రా 1,403,197 స్కోరు సాధించింది. ఒప్పో F29 ప్రో 633,480 స్కోర్ చేసింది.
- విన్నర్ రియల్‌మీ P3 అల్ట్రా
ఇక్కడ కూడా రియల్‌మీ P3 అల్ట్రాదే హవా. ఏకంగా 55% భారీ తేడాతో OPPO F29 Proని వెనక్కి నెట్టింది. అంటే గేమింగ్ నుండి మల్టీటాస్కింగ్ వరకు అన్ని విషయాల్లోనూ Realme ఫోన్ సూపర్ స్మూత్ అనుభవాన్ని ఇస్తుంది. ఒప్పో F29 ప్రో బాగానే పనిచేసినా, వేగం విషయంలో మాత్రం చాలా వెనుకబడింది.
* గేమింగ్ టెస్ట్
గేమింగ్ అనుభవం ఎలా ఉందో తెలుసుకోవడానికి COD: Mobile, BGMI వంటి పాపులర్ గేమ్స్ ఆడి చూశాం. గేమ్ ఎంత స్మూత్‌గా నడుస్తుందో చెప్పే FPS (ఫ్రేమ్స్ పర్ సెకండ్)ని చెక్ చేశాం. COD: మొబైల్ ఆడుతున్నప్పుడు ఒప్పో F29 Pro 57 FPS సాధించగా, రియల్‌మీ P3 అల్ట్రా 54.7 FPSతో చాలా దగ్గరగా నిలిచింది.
ఈ గేమ్‌లో రెండు ఫోన్ల మధ్య పెద్ద తేడా కనిపించలేదు. అయితే, BGMI పరీక్షలో ఒప్పో F29 ప్రో 29 FPS మాత్రమే నమోదు చేయగా, రియల్‌మీ P3 అల్ట్రా 37.6 FPS తో మెరుగైన ప్రదర్శన కనబరిచింది, ఇది మరింత సున్నితమైన గేమ్‌ప్లే అనుభవాన్ని సూచిస్తుంది.
* CPU థ్రాటిల్ టెస్ట్ ఎక్కువసేపు వాడితే ఏది నిలబడుతుంది?
ఫోన్‌ను ఎక్కువసేపు కష్టపెడితే (హెవీగా వాడితే), ప్రాసెసర్లు వేడెక్కిపోకుండా తమ వేగాన్ని కొంచెం తగ్గించుకుంటాయి. దీన్నే థ్రాటిలింగ్ అంటారు. మరి ఈ ఒత్తిడిలో ఏ ఫోన్ తన అసలు వేగాన్ని ఎంతవరకు నిలబెట్టుకుందో చూద్దాం. ఒప్పో F29 ప్రో తన పూర్తి శక్తిలో 64.60% నిలబెట్టుకుంది.
- విజేత ఒప్పో F29 ప్రో
రియల్‌మీ P3 అల్ట్రా తన పూర్తి శక్తిలో 50.60% మాత్రమే నిలబెట్టుకుంది. ఆశ్చర్యకరంగా, ఈ విషయంలో ఒప్పో F29 ప్రో గెలిచింది. ఒత్తిడిని తట్టుకోవడంలో ఇది మెరుగ్గా ఉంది, అంటే ఎక్కువ సేపు హెవీగా వాడినా దీని పనితీరులో పెద్దగా మార్పు ఉండదు, నిలకడగా పనిచేస్తుంది.
* వేడి ఎలా ఉంది (థర్మల్ పర్ఫార్మెన్స్):
COD: మొబైల్ గేమ్ ఆడుతున్నప్పుడు ఒప్పో F29 ప్రో +9.4°C వేడెక్కింది. Realme P3 అల్ట్రా 6.8°C వేడెక్కింది. BGMI గేమ్ ఒప్పో F29 ప్రో +7°C వేడెక్కింది. రియల్‌మీ P3 అల్ట్రా +6.5°C వేడెక్కింది. గేమింగ్ ఆడేటప్పుడు రియల్‌మీ P3 అల్ట్రా తక్కువ వేడెక్కింది.
కాబట్టి, గంటల తరబడి గేమ్స్ ఆడేవారికి ఇది మంచి ఎంపిక. అయితే, అప్పుడప్పుడు సరదాగా ఆడుకునే వారికి (Casual gaming) OPPO F29 Pro కూడా నిరాశపరచదు. ఈ టెస్ట్ లో టై అయింది. ఎక్కువసేపు ఆడితే రియల్‌మీ P3 అల్ట్రా, అప్పుడప్పుడు ఆడితే ఒప్పో F29 ప్రో అయింది.
* తుది తీర్పు: మరి ఏ ఫోన్ కొనాలి?
మీకు కావాల్సింది మంచి వేగం, యాప్స్ వాడినా, గేమ్స్ ఆడినా ఎక్కడా ఆగకుండా సూపర్ స్మూత్‌గా పనిచేసే ఫోన్ అయితే, ఆలోచించకుండా రియల్‌మీ P3 అల్ట్రా వైపు వెళ్లొచ్చు. బెంచ్‌మార్క్‌లలో ఇదే టాప్, హెవీ యాప్స్‌ను కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది, గేమింగ్‌లో కూడా తక్కువ వేడెక్కుతుంది. దీని ప్రారంభ ధర రూ.26,999.
ఒత్తిడిలో కూడా నిలకడగా పనిచేసే, ఎక్కువ సేపు వాడినా పనితీరు తగ్గని, నమ్మకమైన ఫోన్ కావాలనుకుంటే, అప్పుడు OPPO F29 Pro మీకు సరైనది. ఇది హెవీ వాడకాన్ని ఎక్కువసేపు బాగా తట్టుకుంటుంది, గేమింగ్‌లో కూడా స్థిరంగా పనిచేస్తుంది. దీని ప్రారంభ ధర రూ.27,999.
చివరిగా చెప్పాలంటే, Realme P3 Ultra వేగంలో దుమ్మురేపితే, OPPO F29 Pro నిలకడ, సామర్థ్యంలో మెరుగ్గా ఉంది. మీ అవసరం ఏంటో చూసుకుని, మీకు నచ్చిన ఫోన్‌ను ఎంచుకోండి.


Click it and Unblock the Notifications