50MP టెలిఫొటో కెమెరా, 16GB ర్యామ్, 1.5K డిస్‌ప్లే, 5700mAh బ్యాటరీతో ఒప్పో X8s, X8s+ ఫోన్లు.. ఏప్రిల్‌లోనే విడ
Oppo Find X8s and X8s+: ఒప్పో లవర్స్‌కు శుభవార్త. ఎందుకంటే ఒప్పో కంపెనీ అదిరిపోయే ఫీచర్లతో సరికొత్త ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఫైండ్ X8s, ఫైండ్ X8s+ మోడల్స్‌ను ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ రెండు ఫోన్లలోనూ మీడియాటెక్ కంపెనీ తీసుకొస్తున్న సరికొత్త డైమెన్సిటీ 9400+ చిప్‌సెట్‌ను వాడబోతున్నారు. దీంతో పర్ఫార్మెన్స్ విషయంలో ఈ ఫోన్లు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయని చెప్పొచ్చు.
మీడియాటెక్ డెవలపర్ కాన్ఫరెన్స్ (MDDC) జరిగే సమయంలోనే ఈ ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఈ కొత్త ప్రాసెసర్‌తో మార్కెట్లోకి వచ్చే మొట్టమొదటి ఫోన్లలో ఇవీ ఉండబోతున్నాయి. వీటికి సంబంధించిన ఫీచర్లు, ధరల వంటి వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.

* డిస్‌ప్లే, డిజైన్
ఒప్పో ఫైండ్ X8s మోడల్ 6.3-అంగుళాల 1.5K ఫ్లాట్ డిస్‌ప్లేతో వస్తోంది. ఇక ఫైండ్ X8s+ మోడల్ కాస్త పెద్దగా 6.59-అంగుళాల 1.5K స్క్రీన్‌తో రానుంది. రెండు ఫోన్లలోనూ స్క్రీన్ చుట్టూ చాలా సన్నని బెజెల్స్‌ను ఇస్తున్నారు. దీంతో ఫోన్లు చూడటానికి చాలా స్టైలిష్‌గా, స్లిమ్‌గా ఉంటాయి.
ఫైండ్ X8s సెగ్మెంట్లోనే చాలా తేలికైన, సన్నని ఫోన్‌గా నిలవనుంది. దీని మందం 8.15mm కంటే తక్కువగా, బరువు 187 గ్రాముల కంటే తక్కువగా ఉంటుందట. ఫైండ్ X8s చెర్రీ పింక్, మూన్‌లైట్ వైట్, ఐలాండ్ బ్లూ, హోషినో బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. ఫైండ్ X8s+ మాత్రం మూన్‌లైట్ వైట్, హోషినో బ్లాక్, హేసింత్ పర్పుల్ కలర్ ఆప్షన్స్‌లో వస్తుంది.
* పర్ఫార్మెన్స్, బ్యాటరీ
రెండు ఫోన్లలోనూ డైమెన్సిటీ 9400+ చిప్‌సెట్ ఉండటంతో పనితీరు గురించి అస్సలు ఆలోచించాల్సిన పనేలేదు. మల్టీ టాస్కింగ్ అయినా, గేమ్స్ ఆడినా ఫోన్ ఎప్పుడూ కూడా స్లో అవ్వదు. బ్యాటరీ విషయానికొస్తే.. రెండిట్లోనూ భారీ బ్యాటరీలను ఇస్తున్నారు. ఫైండ్ X8s లో ఏకంగా 5,700mAh కంటే ఎక్కువ కెపాసిటీ బ్యాటరీ ఉండనుంది.
ఛార్జింగ్ స్పీడ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్లు సపోర్ట్ చేస్తాయి. కెమెరాల విషయంలో ఒప్పో ఎప్పుడూ రాజీ పడదు. ఈ ఫోన్లలోనూ అదిరిపోయే కెమెరాలు ఉండబోతున్నాయి. రెండు మోడల్స్‌లోనూ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను ఇస్తున్నారు. ఇది జూమ్ క్వాలిటీని బాగా పెంచుతుంది.
* ఫైండ్ X8 అల్ట్రా
ఫైండ్ X8 అల్ట్రా మోడల్ ఏకంగా ఐదు కెమెరాలతో రాబోతోంది. ఇందులో 50MP 1/1.56" సోనీ IMX906 3X టెలిఫోటో, 50MP 1/2" సోనీ LYT-600 6X టెలిఫోటో, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్‌లు ఉన్నాయి. వీటితో పాటు 50MP 1" సోనీ LYT-900 సెన్సార్ ఉంటుంది. దీనితో నైట్ పోర్ట్రెయిట్స్ బాగా వస్తాయి.
* సెక్యూరిటీ, డ్యూరబిలిటీ
సెక్యూరిటీ కోసం రెండు ఫోన్లలోనూ ఆప్టికల్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను ఇచ్చారు. అలాగే IP69 రేటింగ్‌తో వస్తున్నాయి. అంటే దుమ్ము, నీరు ఏమీ చేయలేవు. ధూళి, నీటిని తట్టుకునేలా ఈ ఫోన్లను డిజైన్ చేశారు. ఫైండ్ X8s మోడల్ చాలా వేరియంట్స్‌లో లభిస్తుంది.
12GB + 256GB, 16GB + 256GB, 12GB + 512GB, 16GB + 512GB, 16GB + 1TB కాన్ఫిగరేషన్స్‌లో దీన్ని కొనుక్కోవచ్చు. ఫైండ్ X8s+ కూడా దాదాపు ఇలాంటి వేరియంట్స్‌లోనే వస్తుంది. స్టోరేజ్, ర్యామ్ విషయంలో యూజర్స్‌కు చాలా ఆప్షన్స్ ఉండబోతున్నాయి.


Click it and Unblock the Notifications








