Home
Mobile

Realme P3 5G స్మార్ట్ ఫోన్ విడుదల.. 6000mAh టైటాన్ బ్యాటరీ, IP 69 రేటింగ్, 50MP కెమెరా!

Realme P3 5G: రియల్‌మీ అదిరిపోయే ఫీచర్లతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. అదే రియల్‌మీ P3 5G. ఈ ఫోన్ పవర్‌ఫుల్ ఫీచర్లతో పాటు, చాలా తక్కువ ధరలో రావడం విశేషం. ఇందులో మూడు వేరియంట్లు ఉన్నాయి. మొదటిది 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999, ఇంకొకటి 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్, దీని ధర రూ.17,999.

మూడోది 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ దీని ధర రూ.19,999. అయితే, లాంచ్ ఆఫర్ కింద, బేస్ మోడల్‌ను కేవలం రూ.14,999కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్ ద్వారా అదనంగా రూ.2,000 తగ్గింపు లభిస్తుంది. ఈ ఫోన్ కామెట్ గ్రే, నెబ్యులా పింక్, స్పేస్ సిల్వర్ రంగుల్లో లభిస్తుంది.

Realme P3 5G has Launched With Snapdragon 6 Gen 4 5G Chipset and 6000mAh Titan Battery

* అదిరిపోయే లాంచ్ ఆఫర్లు..

రియల్‌మీ వినియోగదారుల కోసం అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. మార్చి 19 సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగిన ఎర్లీ బర్డ్ సేల్‌లో కొనుగోలు చేసిన వారికి ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. ఈ సమయంలో P3 5G కొన్న వారికి రియల్‌మీ బడ్స్ ఎయిర్ 5 కేవలం రూ.1,499కే లభిస్తాయి.

అలాగే రియల్‌మీ బడ్స్ వైర్‌లెస్ 5 ANC ను రూ.1,599 కే పొందవచ్చు. అంతేకాదు, పాత రియల్‌మీ ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే అదనంగా రూ.500 డిస్కౌంట్ కూడా ఉంది. రియల్‌మీ కేర్+ సేవలను 50% తగ్గింపుతో పొందవచ్చు, దీని ద్వారా రూ.849 వరకు ఆదా చేసుకోవచ్చు.

* దుమ్మురేపే ఫీచర్లు

రియల్‌మీ P3 5G ఫీచర్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా గేమింగ్ లవర్స్‌కి ఇది చాలా బాగా సరిపోతుంది. ఇందులో పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్‌ 6 Gen 4 5G చిప్‌సెట్‌తో అందించారు. 4nm ఆర్కిటెక్చర్‌తో తయారైన ఈ ప్రాసెసర్‌తో ఫోన్ స్పీడ్‌గా పనిచేస్తుంది. 8GB వరకు RAM 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంది.

దీనివల్ల యాప్స్, గేమ్స్, ఫోటోలు, వీడియోలు స్టోర్ చేసుకోవచ్చు. గేమింగ్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా ఉండడానికి 6050mm² ఏరోస్పేస్-గ్రేడ్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంది. గేమింగ్ కోసం AI-బేస్డ్ GT బూస్ట్ ఫీచర్లు, AI మోషన్ కంట్రోల్, AI అల్ట్రా టచ్ కంట్రోల్ వంటివి ఉన్నాయి, ఇవి గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత పెంచుతాయి.

* డిస్‌ప్లే

ఈ ఫోన్‌లో 6.7- అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది, ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అంటే స్క్రీన్ చాలా స్మూత్‌గా ఉంటుంది. 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉండడం వల్ల ఎండలో కూడా స్క్రీన్ బాగా కనిపిస్తుంది. 92.65% స్క్రీన్-టు-బాడీ రేషియోతో, వీడియోలు చూస్తున్నా, గేమ్స్ ఆడుతున్నా మంచి అనుభూతి కలుగుతుంది.

* బ్యాటరీ, ఇతర ఫీచర్లు

రియల్‌మీ P3 5Gలో 6,000mAh బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా వాడుకోవచ్చు. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో బ్యాటరీ త్వరగా ఎక్కుతుంది. ఈ ఫోన్ IP69 రేటింగ్‌తో దుమ్ము, నీరు నుంచి రక్షణ ఉంటుంది., 1500Hz టచ్ శాంప్లింగ్ రేట్, BGMIలో 90fps సపోర్ట్ ఉండటం వల్ల గేమింగ్ అనుభూతి బాగుంటుంది.

* ఎక్కడ కొనాలి..

రియల్‌మీ P3 5G ఇప్పుడు రియల్‌మీ ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ స్టోర్లలో అందుబాటులో ఉంది. తక్కువ ధర, పవర్‌ఫుల్ చిప్‌సెట్, పెద్ద బ్యాటరీతో, రియల్‌మీ P3 5G బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లు కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్ అనడంలో సందేహం లేదు.

More from GizBot

Best Mobiles in India

English summary
Realme P3 5G launched in India with Snapdragon 6 Gen 4, 6000mAh battery, 120Hz AMOLED display. Offers include bank discounts, and deals on earbuds. Available on Realme website and Flipkart.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X