Home
Mobile

50MP కెమెరా, 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో Redmi Note 14 Pro 5G.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్!

Redmi Note 14 Pro 5G: ఫ్లిప్‌కార్ట్ మెగా సేవింగ్ డేస్ సేల్‌లో షియోమీ రెడ్‌మీ నోట్ 14 ప్రో 5G ఫోన్‌పై అదిరిపోయే ఆఫర్ ఉంది. ప్రీమియం ఫీచర్లు ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకే కొనేందుకు ఇది మంచి సమయం. ఈ ఫోన్ మెరుగైన డిస్‌ప్లే, పర్ఫార్మెన్స్, పెద్ద బ్యాటరీ లైఫ్‌తో ప్రీమియం ఎక్స్‌పీరియన్స్‌ను బడ్జెట్ ధరలో అందిస్తోంది. తక్కువ ధరలో మంచి ఫోన్ కోసం చూస్తుంటే, ఫ్లిప్‌కార్ట్ సేల్ మీకు సువర్ణావకాశం.

* కళ్లు చెదిరే వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్..

షియోమీ రెడ్‌మీ నోట్ 14 ప్రో 5G లో 6.67-ఇంచ్ AMOLED డిస్‌ప్లే ఉంది, ఇది 1220 x 2712 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది, యానిమేషన్స్ కూడా బాగుంటాయి. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్‌కు ఇది మంచి ఆప్షన్.

Redmi Note 14 Pro 5G 50MP Camera  6 67 inches AMOLED Display  Mega Saving Days Deal

* ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌తో ఫొటోలు

రెడ్‌మీ నోట్ 14 ప్రో 5Gలో 50MP ప్రైమరీ కెమెరా ఉంది, OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), PDAF ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇవి స్థిరమైన ఫొటోలను క్యాప్చర్ చేస్తాయి. 8MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో గ్రూప్, ల్యాండ్‌స్కేప్స్ ఫొటోలు తీసుకోవచ్చు. 2MP మాక్రో సెన్సార్‌తో స్పష్టమైన క్లోజప్స్ తీసుకోవచ్చు. సెల్ఫీలకు 20MP ఫ్రంట్ కెమెరా ఉంది.

Take a Poll

* పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్‌

5500mAh బ్యాటరీతో ఈ ఫోన్ రోజంతా హ్యాపీగా వాడుకోవచ్చు, మళ్లీ మళ్లీ ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది, దీంతో చాలా త్వరగా రీఛార్జ్ చేయొచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14, షియోమీ హైపర్‌OS తో వస్తుంది. ఇది స్మూత్, ప్రీమియం ఫీచర్ల అనుభూతిని అందిస్తుంది.

ఏఐ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో లైవ్ ఇంటర్‌ప్రెటర్, AI సబ్‌టైటిల్స్, AI ట్రాన్స్‌లేషన్ వంటి AI ఫీచర్లు ఉన్నాయి, ఇవి కమ్యూనికేషన్‌ను ఇంప్రూవ్ చేస్తాయి. గూగుల్ జెమిని AI తో మీకు స్మార్ట్ అసిస్టెంట్ కూడా వస్తుంది, ఇది గూగుల్ యాప్స్‌తో ఈజీగా కలిసిపోతుంది.

* మన్నికైన, స్టైలిష్ డిజైన్

IP68 రేటింగ్ ఉండటంతో వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఫోన్ చాలా మన్నికగా ఉంటుంది. షాక్-అబ్జార్బింగ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ అదనపు రక్షణ ఇస్తుంది. స్టీరియో స్పీకర్లు ఉండటం వల్ల ఆడియో ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంటుంది, ఈ మొబైల్‌లో గేమింగ్, స్ట్రీమింగ్ వంటివి చాలా మంచి అనుభూతిని కలిగిస్తాయి.

* ఆకర్షణీయమైన ధర, ఆఫర్లు

షియోమీ రెడ్‌మీ నోట్ 14 ప్రో 5G వేర్వేరు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. అమెజాన్‌లో 8GB + 128GB వేరియంట్ ధర రూ.23,202, 8GB + 256GB మోడల్ ధర రూ.26,342. ఫ్లిప్‌కార్ట్, క్రోమాలో ఇది రూ.24,999కి లిస్ట్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌ మెగా సేవింగ్ డేస్‌లో మీకు అదనపు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

అన్ని బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్లపై రూ.1000 డిస్కౌంట్ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు 5% అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ ఉంది. నో-కాస్ట్ EMI రూ.2,084/నెల నుంచి స్టార్ట్ అవుతుంది, రెగ్యులర్ EMI ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మంచి డిస్‌ప్లే, ఫాస్ట్ పర్ఫార్మెన్స్, అదిరిపోయే కెమెరాలు, మన్నికైన డిజైన్‌తో షియోమీ రెడ్‌మీ నోట్ 14 ప్రో 5G ఒక పైసా వసూల్ ఆప్షన్ అవుతోంది.

ఫ్లిప్‌కార్ట్‌ మెగా సేవింగ్ డేస్‌లో అదనపు డిస్కౌంట్స్, EMI ఆప్షన్స్‌తో ఈ డీల్ అస్సలు మిస్ చేసుకోవద్దు.

More from GizBot

Best Mobiles in India

English summary
Grab the Xiaomi Redmi Note 14 Pro 5G at a huge discount during Flipkart Mega Saving Days. Enjoy its AMOLED display, Dimensity 7300 Ultra processor, and 50MP camera with exciting offers.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X