రెడ్‌మి నోట్ 8,నోట్ 8 ప్రో రిలీజ్... ధర ఎంతో తెలుసా?

|

ప్రముఖ చైనా సంస్థ షియోమి రెడ్‌మి 8A, రెడ్‌మి 8 స్మార్ట్‌ఫోన్‌లను ఇండియాలో లాంచ్ చేసిన తర్వాత వాటి హవా ఇంకా ముగియక మునుపే ఇప్పుడు మరో రెండు స్మార్ట్‌ఫోన్‌లను భారత్‌లో విడుదల చేసింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు - రెడ్‌మి నోట్ 8 మరియు రెడ్‌మి నోట్ 8 ప్రో. ఇవి క్వాడ్ కెమెరా సెటప్, ఎక్కువ స్టోరేజ్ మరియు ర్యామ్‌తో వస్తాయి. రెడ్‌మి నోట్ 8 ప్రో యొక్క హైలైట్ ఫీచర్ 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా కాగా, రెడ్‌మి నోట్ 8 హైలైట్ ఫీచర్ 48 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ధరల వివరాలు
 

ధరల వివరాలు

షియోమి యొక్క కొత్త స్మార్ట్‌ఫోన్‌లు రెడ్‌మి నోట్ 8 రెండు వేరియంట్ లలో మరియు రెడ్‌మి నోట్ 8 ప్రో మూడు వేరియంట్ లలో విడుదల అయింది. వాటి యొక్క దరల వివరాలు.

రెడ్‌మి నోట్ 8 ప్రో

1. 6GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ --- రూ.14,999

2. 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ --- రూ.15,999

3. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ --- రూ.17,999

రెడ్‌మి నోట్ 8

1. 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ --- రూ.9,999

2. 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ --- రూ.12,999. పైన తెలిపిన ఈ రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు అక్టోబర్ 21న మధ్యాహ్నం 12PM నుండి అమెజాన్ లో వీటి అమ్మకాలు మొదలవుతాయి.

రెడ్‌మి నోట్ 8 స్పెసిఫికేషన్స్

రెడ్‌మి నోట్ 8 స్పెసిఫికేషన్స్

షియోమి రెడ్‌మి నోట్ 8 స్మార్ట్‌ఫోన్‌ 6.3-అంగుళాల డాట్ నాచ్ డిస్ప్లే 90 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో ఉంటుంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 చిప్‌సెట్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో మొత్తం నాలుగు కెమెరాల సెటప్ ను కలిగి ఉన్నాయి. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ను కలిగి ఉంది. మిగిలిన కెమెరాలు 8 మెగాపిక్సెల్ 120-డిగ్రీల అల్ట్రా-వైడ్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్. మరియు పోర్ట్రెయిట్ షాట్ల కోసం 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా సెన్సార్ కూడా ఉంది. వినియోగదారులకు మెరుగైన ఫోటోగ్రఫీ అనుభవాన్ని అందించడానికి తక్కువ-కాంతిలో కూడా మెరుగైన ఫోటోలను పొందడానికి నైట్ మోడ్‌ ఫీచర్ తో కూడా వస్తుంది. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు వైపు 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది AI బ్యూటిఫై, పోర్ట్రెయిట్ మోడ్ మరియు AI సీన్ డిటెక్షన్ వంటి లక్షణాలకు మద్దతును అందిస్తుంది.

బ్యాటరీ

ఈ స్మార్ట్‌ఫోన్‌ 18W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ కొత్త రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌ యుఎస్‌బి టైప్-సి పోర్ట్‌ మద్దతుతో పొందుతారు. కొత్త ఫోన్‌లో స్పీకర్లు 40 శాతం బిగ్గరగా ఉన్నాయని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా ఇది ఇతర రెడ్‌మి ఫోన్‌ల మాదిరిగానే స్ప్లాష్ ప్రూఫ్ మరియు డస్ట్ ప్రూఫ్ డిజైన్‌ను కలిగి ఉంది.

రెడ్‌మి నోట్ 8 ప్రో స్పెసిఫికేషన్స్
 

రెడ్‌మి నోట్ 8 ప్రో స్పెసిఫికేషన్స్

రెడ్‌మి నోట్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 91.4 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో 6.53-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది 3D కర్వ్డ్ గ్లాస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది గ్రీన్ కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది. రెడ్‌మి నోట్ 8 యొక్క ప్రో వెర్షన్ వెనుక భాగంలో డైమండ్ కట్ గ్రేడ్ ఆకృతిని ప్రదర్శిస్తుంది. ఇందులో మెడిటెక్ G90t గేమింగ్ చిప్‌సెట్ మద్దతు లభిస్తుంది.

కెమెరా

ఈ స్మార్ట్‌ఫోన్ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఎఫ్ / 1.7 ఇమేజ్ సెన్సార్ తో వస్తుంది. ఇది వినియోగదారులకు మెరుగైన ఫోటో షాట్లను అందిస్తుందని చైనా కంపెనీ తెలిపింది. ఇంకా దీని ద్వారా గరిష్టంగా 9248 x 6936 రిజల్యూషన్ వద్ద కూడా షూట్ చేయగలరు. 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ కాకుండా ఇతర సెన్సార్లు ప్రామాణిక వెర్షన్ వలె ఉంటాయి. ఇది స్లో-మోషన్ వీడియో రికార్డింగ్‌కు మద్దతును కూడా అందిస్తుంది. ముందు వైపు 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. చివరగా ఈ షియోమి ఫోన్ లోపల 4,500 ఎంఏహెచ్ బ్యాటరీని జోడించి ఉంటుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Redmi Note 8, Redmi Note 8 Pro Launched in India: Price,Specifications,Availability and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X