అమెజాన్ లో RS.700 లోపు కొనుగోలు చేయగల స్మార్ట్-హోమ్ గాడ్జెట్లు

|

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ మొదలై రెండు రోజులు అవుతున్నది. ఈ సేల్స్ అక్టోబర్ 17 వరకు జరుగుతున్న విషయం ముందే తెలియజేసాము. ఇందులో భాగంగా అన్ని రకాల ఉత్పత్తులపై గొప్ప ఆఫర్లు మరియు డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఈ దీపావళి ఫెస్టివల్ సేల్స్ లలో మీరు తక్కువ ధర వద్ద మీ ఇంటిని స్మార్ట్-హోమ్ గా మార్చుకోవచ్చు. ఈ స్మార్ట్-హోమ్ గాడ్జెట్లను మీరు కేవలం రూ.700ల లోపు కొనుగోలు చేయవచ్చు. వీటి వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

స్మార్ట్-హోమ్
 

సాధారణమైన ఇంటిని స్మార్ట్-హోమ్ గా మార్చడానికి మొదటగా కావలసినది స్మార్ట్-ఎల్ఈడి బల్బ్ లు. ఇవి ఇప్పుడు అమెజాన్ లో చాలా తక్కువ ధర వద్ద లభిస్తున్నాయి. వీటితో పాటు స్మార్ట్ స్విచ్ బోర్డ్ మరియు వై-ఫై ద్వారా కంట్రోల్ చేయగల కొన్నిటిని డిస్కౌంట్ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. వాటిలో కొన్ని కింద ఉన్నాయి.

సిస్కా 7-వాట్ స్మార్ట్-ఎల్ఈడి బల్బ్

-- అమెజాన్ అలెక్సాకు అనుకూలమైన సిస్కా 7-వాట్ స్మార్ట్-ఎల్ఈడి బల్బ్ మీద ఇప్పుడు 72% డిస్కౌంట్ లభించిన తరువాత దీనిని కేవలం రూ. 499లకు పొందవచ్చు. దీని అసలు ధర 1300 రూపాయలు.

-- 9-వాట్, B22 హోల్డర్, అలెక్సా-ఎనేబుల్డ్ సోలిమో స్మార్ట్-ఎల్ఈడి లైట్ మీద రూ.851 డిస్కౌంట్ లభించిన తరువాత ఇప్పుడు రూ.699లకు లభిస్తుంది. దీని అసలు ధర రూ.1400.

-- అలెక్సా, గూగుల్ హోమ్‌కు అనుకూలమైన హోమ్‌లెట్ స్మార్ట్-వై-ఫై స్విచ్ రూ.1300 ల తగ్గింపు తర్వాత ఇప్పుడు కేవలం రూ.699 లకు లభిస్తుంది. దీని అసలు ధర రూ.1999.

--- యుఎస్‌బితో నడిచే UV LED లైట్ ఎలక్ట్రానిక్ ఎల్‌ఈడీ మస్కిటో కిల్లర్ లాంప్ ఇప్పుడు రూ.600 తగ్గింపు తర్వాత కేవలం రూ.599 వద్ద లభిస్తుంది. దీని అసలు ధర రూ.1,199.

వివో గ్రాండ్ దీపావళి సేల్స్.... వీటిపై ఆఫర్లే ఆఫర్లు

Xఎలెక్ట్రాన్ సెక్యూరిటీ ప్యాడ్
 

--- స్మార్ట్-అలారం మోషన్ సెన్సార్‌తో పనిచేసే Xఎలెక్ట్రాన్ సెక్యూరిటీ ప్యాడ్ లాక్ రూ.311 ల తగ్గింపు తర్వాత ఇప్పుడు కేవలం రూ.289 వద్ద లభిస్తుంది. దీని అసలు ధర రూ.600.

--- అమెజాన్ అలెక్సా మరియు గూగుల్ అసిస్టెంట్ రెండింటితోనూ పనిచేసే నిషికా వైఫై-ఎనేబుల్డ్ స్మార్ట్-ఎల్ఈడి బల్బ్ (9 వాట్) రూ .950 డిస్కౌంట్ పొందిన తరువాత ఇప్పుడు కేవలం రూ.599 వద్ద లభిస్తుంది. దీని అసలు ధర రూ.1499.

--- మీ యొక్క ఇల్లు లేదా కార్యాలయానికి తేదీ మరియు ఉష్ణోగ్రతను తెలియజేయడానికి ఆటోమేటిక్ సెన్సార్ బ్యాక్‌లైట్‌తో కూడిన V2A స్మార్ట్ డిజిటల్ అలారం క్లాక్ రూ.800ల డిస్కౌంట్ ధర పొందిన తర్వాత ఇప్పుడు కేవలం 499 రూపాయలకు లభిస్తుంది. దీని అసలు ధర

రూ.1299.

--- స్మార్ట్ సెన్సార్ మరియు ఆటో ఆన్-ఆఫ్‌తో పని చేసే నర్సరీ ప్లాంట్ నైట్ ప్లగ్ లైట్ రూ.201ల డిస్కౌంట్ ధర పొందిన తర్వాత ఇప్పుడు అమెజాన్ లో రూ.199 వద్ద లభిస్తుంది.

డిష్ టివి దీపావళి ఆఫర్: RS.219లకే 250 ఛానెల్‌లు

ఎలక్ట్రోటెక్ PIR

--- బ్లాక్‌ట్ ఎలక్ట్రోటెక్ PIR సెన్సార్ మరియు లైట్ అండ్ ఎనర్జీ-సేవింగ్ తో పనిచేసే మోషన్ డిటెక్టర్‌ రూ.509 తగ్గింపు తర్వాత ఇప్పుడు కేవలం 546 రూపాయలకు లభిస్తుంది.

--- 3 లైట్లు ,ఫ్యాన్ లకు అవిశ్వాస వైర్‌లెస్ రిమోట్ స్విచ్ మరియు స్లీప్ టైమర్ మోడ్ ను 401 రూపాయల తగ్గింపు తర్వాత ఇప్పుడు కేవలం రూ.549 ల వద్ద అమెజాన్ లో పొందవచ్చు.

---- హోమ్ క్యూబ్ 1 PC స్మార్ట్ కంట్రోల్ సెన్సార్ ఎల్‌ఇడి నైట్ లైట్ బెడ్‌రూమ్ లాంప్ రూ.499 తగ్గింపు తర్వాత ఇప్పుడు రూ .599 వద్ద లభిస్తుంది.

---- ఎలక్ట్రోబోట్ 24-Hr మెకానికల్ టైమర్ 134 రూపాయల తగ్గింపు తర్వాత రూ.516 లకు లభిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Amazon Great Indian Festival sale: Best smart-home gadgets under Rs.700

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X