Home
Mobile

ఆ ఫోన్ వాటర్ ప్రూఫ్ కాదు.. తప్పు ఒప్పుకున్న శాంసంగ్

By Hazarath

కొరియా దిగ్గజం శాంసంగ్ గెలాక్సి ఎస్7 విషయంలో తన తప్పును ఒప్పుకుంది. గెలాక్సీ సిరీస్ లో వస్తున్న ఎస్ 7 ఆక్టీవ్ ఫోన్ వాటర్ ప్రూఫ్ కాదని, కొన్ని లోపాలున్నాయని అంగీకరించింది. అయితే దీన్ని సరిచేసే సామర్థ్యం తమ దగ్గరున్నట్టు తెలిపింది. అయితే దీనికి సంబంధించి చాలా కొద్ది ఫిర్యాదులు తమకు అందాయని పేర్కొంది. వారంటీ పీరియడ్ లో ఉన్న ఫోన్లకు రిప్లేస్ మెంట్ చేస్తున్నట్టు ప్రకటించింది సీఎన్ఈటీ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించినపుడు టచ్ స్క్రీన్ పనిచేయలేదని, గ్రీన్ లైన్స్ వచ్చాయని, ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడంతోపాటు .. పవర్ బటన్ పనిచేయలేదు.

నవ్వాలో..ఏడ్వాలో తెలియని ఆవిష్కరణలు

samsung

కెమెరా లెన్స్ పై నీళ్లు తదితర సమస్యలు తలెత్తినట్టు శాంసంగ్ వివరించింది. అయితే తాను రిలీస్ చేసిన అన్ని ఫోన్లలో లోపాలు లేవని, చాలా తక్కువ వాటిలో చాలా స్వల్పలోపాలు తలెత్తాయని చెబుతున్న శాంసంగ్ ఎన్ని యూనిట్లలో ఈ లోపాలున్నాయనేది స్పష్టం చేయలేదని ఎన్ గాడ్జెట్ రిపోర్ట్ చేసింది. కాగా ఎస్ 7 ఆక్టివ్ ఫోన్ నీటిలో కూడా పనిచేస్తుందనీ (వాటర్ రెసిస్టెంట్), ఐపీ 68 సర్టిఫికేట్ ఉందనీ కంపెనీ ప్రచారం చేసుకుంది. అయితే కన్జ్యూమర్ రిపోర్ట్స్ అనే సంస్థ నిర్వహించిన పరీక్షల్లో ఈ స్మార్ట్ ఫోన్ వాటర్ రెసిస్టెంట్ గా లేదని తేలింది. నీటిలో ఉంచినపుడు స్క్రీన్ పై గ్రీన్ షేడ్స్ కనిపించినట్లు, కెమెరాపై బుడగలను గుర్తించినట్టు ఇటీవల నివేదించిన సంగతి తెలిసిందే.

పోకెమాన్ గేమ్ ఆడితే మీకు జాబ్ వచ్చినట్లే..ఎలా ఆడాలంటే..

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లు

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లు

5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ కర్వుడ్ ఎడ్జ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 2560×1440పిక్సల్స్), 534 పీపీఐ.

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లు

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లు

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ రెండు ప్రాసెసర్ వేరియంట్‌లలో లభ్యంకానుంది. మొదటి వేరియంట్ స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్ కాగా రెండవ వేరియంట్ ఆక్టా కోర్ ఎక్సినోస్ 8 ఆక్టా 8890 ప్రాసెసర్,

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లు

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లు

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ఫోన్‌లో హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ స్లాట్‌లను పొందుపరిచారు. 4జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ ఆప్షన్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరినీ 200జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లు

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లు

డ్యుయల్ పిక్సల్ 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: ఎల్ఈడి ఫ్లాష్, ఎఫ్ 1.7 అపెర్చర్, స్మార్ట్ ఓఐఎస్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లు

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లు

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ఐపీ68 రేటింగ్‌తో వస్తోంది. వాటర్ ఇంకా డస్ట్ ప్రమాదాలను గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ సమర్థవంతంగా తట్టుకోగలదు.

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లు

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లు

ఆపరేటింగ్ సిస్టం గెలాక్సీ ఎస్7 ఎడ్జ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. యాప్ పర్మిషన్, గూగుల్ నౌ ఆన్ టాప్, డోజ్ మోడ్, ర్యామ్ మేనేజర్, ఆటో బ్యాకప్, బ్యాటరీ లైఫ్, ఆటో హ్యాండ్లింగ్ యాప్స్, ఆండ్రాయిడ్ పే వంటి ప్రత్యేక ఫీచర్లను ఎస్7 ఎడ్జ్ అందిస్తుంది.

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లు

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లు

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ఫోన్ కు "Always-On Display" ఫీచర్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ ఫీచర్ ఫోన్ స్ర్కీన్ పై ఎఫ్పుడు ఆన్ అయ్యే ఉంటుంది. క్లాక్, నోటిఫికేషన్స్, క్యాలెండర్‌లను ఈ ఫీచర్ డిస్‌ప్లే సూచిస్తుంది. తద్వారా చీటికి మాటికి పోన్‌ను ఓపెన్ చేయకుండా బ్యాటరీ ఆదా చేయవచ్చు.

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లు

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లు

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్, 4జీ ఎల్టీఈ, వై-ఫై 802.11, బ్లూటూత్, జీపీఎస్, గ్లోనాస్, వంటి కనెక్టువిటీ ఆప్షన్‌లను సపోర్ట్ చేస్తుంది.

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లు

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లు

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ 3600 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్

Best Mobiles in India

English summary
Here Write Samsung admits fault regarding failed Samsung Galaxy S7 Active waterproof tests
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X