శాంసంగ్ గెలాక్సీ A56 5G, గెలాక్సీ A36 5G ధరల వివరాలు విడుదల.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు..!
శాంసంగ్ నిన్న గ్లోబల్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది. ఇందులో గెలాక్సీ A సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. గెలాక్సీ A56, గెలాక్సీ A36, గెలాక్సీ A26 విడుదల అయ్యాయి. ప్రస్తుతం గెలాక్సీ A56, A36 భారత్ మార్కె్ట్ ధరలు వెల్లడయ్యాయి. అయితే గెలాక్సీ A26 ధర వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ ఫోన్ 6 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌లను పొందవచ్చని శాంసంగ్ వెల్లడించింది.
శాంసంగ్ గెలాక్సీ A56 5G స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy A56 5G) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.41999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.44999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.47999 గా ఉంది. Awesome గ్రాఫైట్, Awesome లైట్ గ్రే, Awesome ఓలివ్ రంగుల్లో లభిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ A36 5G స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy A36 5G) 8GB ర్యామ్ + 128GB వేరియంట్ ధర రూ.32,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.35,999 గా ఉంది. అదే 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.38,999 గా ఉంది. Awesome బ్లాక్, Awesome లావెండర్, Awesome వైట్ రంగుల్లో లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ A56 5G వివరాలు :
గెలాక్సీ A56 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్‌ప్లే గొరెల్లా గ్లాస్ విక్టస్ + రక్షణను పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 45W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
ఈ హ్యాండ్‌సెట్ 4nm Exynos 1580 ఆక్టాకోర్ చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. గ్రాఫిక్స్ టాస్క్‌ల కోసం AMD Xclipse 540 GPU చిప్‌సెట్‌ను అమర్చి ఉంది. మరియు ఈ ఫోన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 ను కలిగి ఉంటుంది. ఆరు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, ఆరు సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను అమర్చారు. 50MP (OIS) ప్రైమరీ కెమెరా, 12MP, 5MP కెమెరాలు సహా 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. IP67 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ A36 స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
గెలాక్సీ A36 స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 7+ రక్షణను పొందుతుంది. 45W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 ను కలిగి ఉంది. ఈ ఫోన్ 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌ను అందుకుంటుంది. IP67 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
కెమెరా విభాగం పరంగా ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP (OIS) ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5MP మ్యాక్రో కెమెరాలు సహా సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ రెండు ఫోన్‌ల సేల్ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications