Home
Mobile

ధర రూ.9,499 కే 5G శాంసంగ్ ఫోన్‌.. 50MP కెమెరా, 6.7 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ..!

శాంసంగ్‌ నుంచి ఇటీవల రెండు M సిరీస్‌ ఫోన్‌లను లాంచ్‌ చేసింది. గెలాక్సీ M16 5G, గెలాక్సీ M06 5G ఫోన్‌లను విడుదల చేసింది. M16 5G హ్యాండ్‌సెట్‌ ఇప్పటికే ప్రారంభం అయింది. రూ.11499 కే అందుబాటులో ఉంది. రేపటి నుంచి M06 5G హ్యాండ్‌సెట్ సేల్ ప్రారంభం కానుంది. శాంసంగ్‌ అధికారిక వెబ్‌సైట్, ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్‌ గెలాక్సీ M06 5G స్మార్ట్‌ఫోన్ (Samsung galaxy M06 5G Sale) 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9,499 గా ఉంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,999 కే కొనుగోలు చేయవచ్చు. బ్లేజింగ్ బ్లాక్, సెజ్‌ గ్రీన్‌ రంగుల్లో లభిస్తుంది.

Samsung galaxy M06 5g sale

శాంసంగ్‌ గెలాక్సీ M06 5G స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
గెలాక్సీ M06 5G స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ పరంగా ఆకట్టుకుటుంది. ఈ ఫోన్ 90Hz రీప్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఈ డిస్‌ప్లే 800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ కలిగి ఉంది.

తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చినా మెరుగైన కెమెరాలను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు రెండు కెమెరాలను అమర్చారు. 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. 8MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది.

శాంసంగ్ ఎంట్రీ లెవల్‌ 5G హ్యాండ్‌సెట్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 S0C ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7.0 ను కలిగి ఉంది. ఈ గెలాక్సీ హ్యాండ్‌సెట్‌ 4 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌ తోపాటు 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తామని శాంసంగ్ హామీ ఇచ్చింది.

ఈ ఫోన్ 25W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్‌ 5.3, వైఫై, GPS, 3.5mm ఆడియో జాక్‌ను కలిగి ఉంది. శాంసంగ్‌ Knox Vault, క్విక్‌ షేర్‌, వాయిస్ ఫోకస్‌ ఫీచర్‌తో అందుబాటులోకి వచ్చింది.

మరో M సిరీస్‌ ఫోన్‌ శాంసంగ్ గెలాక్సీ M16 5G.. 6.7 అంగుళాల ఫుల్‌ HD+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7.0 OS ను కలిగి ఉంది. ఈ ఫోన్ 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తామని శాంసంగ్ తెలిపింది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాను అమర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ 25W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung galaxy M06 5g sale to start tomorrow via flipkart check specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X