Home
Mobile

ధర రూ.9499 కే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 6.7 అంగుళాల HD+ డిస్‌ప్లే శాంసంగ్‌ 5G ఫోన్ విడుదల..!

శాంసంగ్‌ నుంచి ఇటీవల రూ.10000 తక్కువ ధరలో అనేక స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్‌ అయ్యాయి. ఈ సంవత్సరంలో ఇప్పటికే గెలాక్సీ F06 5G, గెలాక్సీ A06 5G స్మార్ట్‌ఫోన్‌ లు అందుబాటులోకి వచ్చాయి. అయితే తాజాగా శాంసంగ్‌ గెలాక్సీ M06 5G స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. ఎంట్రీ లెవల్‌ ధరలోనే అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు గెలాక్సీ M16 5G హ్యాండ్‌సెట్ కూడా ఇవాళ విడుదల అయింది.

శాంసంగ్‌ గెలాక్సీ M06 5G స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy M06 5G) భారత్‌ మార్కెట్‌లో ఇవాళ విడుదల అయింది. డిజైన్‌ పరంగా ఆకట్టుకుంటోంది. మరియు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు సహా 4 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌లను అందిస్తామని శాంసంగ్‌ వెల్లడించింది.

Samsung galaxy M06 5G smartphone telugu news

శాంసంగ్‌ గెలాక్సీ M06 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
గెలాక్సీ M06 5G హ్యాండ్‌సెట్‌ 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది.

4 సంవత్సరాల వరకు సాఫ్ట్‌వేట్‌ అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 S0C చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మరియు ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7.0 ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 4 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని శాంసంగ్‌ వెల్లడించింది.

Samsung galaxy M06 5G smartphone telugu news

కెమెరా, బ్యాటరీ వివరాలు :
కెమెరా పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP ‌ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను అమర్చి ఉంది. ఈ ఫోన్ 25W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ 5G, 4G, బ్లూటూత్‌ 5.3, డ్యూయల్‌ బ్యాండ్‌ వైఫై, GPS, 3.5mm హెడ్‌ఫోన్‌ జాక్‌ను కలిగి ఉంది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్ స్సానర్‌ను కలిగి ఉంది. మరియు శాంసంగ్‌ Knox Vault, క్విక్‌ షేర్‌, కాల్‌ క్లారిటీ కోసం వాయిస్ ఫోకస్‌ ఫీచర్‌తో అందుబాటులోకి వచ్చింది.

స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు :
శాంసంగ్‌ గెలాక్సీ M06 5G స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9499 గా ఉంది. సేజ్‌ గ్రీన్‌, బ్లేజింగ్‌ బ్లాక్‌ కలర్‌ వేరియంట్స్ లభిస్తుంది. మార్చి 7 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు సేల్‌ ప్రారంభం కానుంది. శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌, స్టోర్‌, అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

* మరో హ్యాండ్‌సెట్ గెలాక్సీ M16 5G ఫోన్ 6.7 అంగుళాల ఫుల్‌ HD+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7.0 OS ను కలిగి ఉంది. ఈ ఫోన్ 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుంది.

కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, 2MP డెప్త్ సెన్సార్‌, 13MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ 25W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.11499 గా ఉంది. మార్చి 5 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung galaxy M06 5G smartphone launched with starting price RS9499 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X