Home
Mobile

ధర రూ.11499 కే 50MP కెమెరా, 6.7 అంగుళాల డిస్‌ప్లే శాంసంగ్ 5G ఫోన్‌.. ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌!

శాంసంగ్ ఇటీవల భారత్‌ మార్కెట్‌లో బడ్జెట్‌, ఎంట్రీ లెవల్‌ ధరల్లో అనేక ఫోన్‌లను విడుదల చేస్తోంది. ఇప్పటికే ఈ ధరల సెగ్మెంట్‌లో బలమైన మార్కెట్‌ను కలిగి ఉన్న శాంసం‌గ్‌.. తాజాగా మరింత విస్తరిస్తోంది. ఇటీవల గెలాక్సీ F06 5G, గెలాక్సీ A06 5G స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. గెలాక్సీ S25 సిరీస్‌తో ప్లాగ్‌షిప్‌ సెగ్మెంట్ ఈ తరహా స్మార్ట్‌ఫోన్‌లతో రూ.15000 ధరలో బలమైన మార్కెట్‌ను క్రియేట్‌ చేసుకుంటోంది.

అయితే తాజాగా శాంసంగ్‌ గెలాక్సీ M16 5G, గెలాక్సీ M06 5G స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. బడ్జెట్‌ రేంజ్‌లోనే వీటిని అందుబాటులోకి తీసుకొచ్చినా.. ఈ ఫోన్‌లు ఆకట్టుకొనే డిజైన్‌తోపాటు మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ M16 5G స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy M16 5G Smartphone) పూర్తి వివరాలు.

Samsung Galaxy M16 5G smartphone launched

శాంసంగ్ గెలాక్సీ M16 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు :
గెలాక్సీ M16 5G స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకొనే డిజైన్‌లో లాంచ్‌ అయింది. 7.9mm సూపర్‌ స్లీక్‌ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 6.7 అంగుళాల ఫుల్‌ HD+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంది. విజన్ బూస్టర్, ఐ కేర్‌ షీల్డ్‌ వంటి ఫీచర్‌లున్నాయి.

ఏకంగా 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీంతోపాటు ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7.0 OS ను కలిగి ఉంది. ఈ ఫోన్ 6 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుంది.

Samsung Galaxy M16 5G smartphone launched

ట్రిపుల్‌ కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 13MP కెమెరాను అమర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ 25W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ 5G, 4G, బ్లూటూత్‌ 5.3, డ్యూయల్‌ బ్యాండ్ వైఫై, GPS, USB-C ఛార్జింగ్‌ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ను కలిగి ఉంది. దీంతోపాటు IP54 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. శాంసంగ్‌ Knox vault, వాయిస్ ఫోకస్, క్విక్‌ షేర్ వంటి ఫీచర్‌లున్నాయి.

Samsung Galaxy M16 5G smartphone launched

శాంసంగ్ గెలాక్సీ M16 5G ధర, సేల్ వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,499 గా ఉంది. ఈ ఫోన్ సేల్ మార్చి 5 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌, ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. మింట్ గ్రీన్‌, బ్లష్‌ పింక్‌, థండర్‌ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy M16 5G smartphone launched with triple camera and 6 OS updates in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X