galaxy m21 మొదటి సేల్స్: అమెజాన్ లో గొప్ప తగ్గింపు ఆఫర్స్

|

ప్రముఖ కొరియా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ సామ్‌సంగ్ నుండి కొత్తగా లాంచ్ అయిన సామ్‌సంగ్ గెలాక్సీ M21 స్మార్ట్‌ఫోన్ ఈ రోజు మొదటిసారిగా అమ్మకానికి అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారీ బ్యాటరీని అందించే శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల శ్రేణిలో ఒక భాగం. గెలాక్సీ M30 వంటి మోడల్లు సాధించిన విజయాన్ని అధికమించడమే లక్ష్యంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను మొదటి సారిగా అద్భుతమైన ఆఫర్లతో అమ్మకానికి తీసుకువస్తున్నారు.

గెలాక్సీ M21 సేల్స్

గెలాక్సీ M21 సేల్స్

సామ్‌సంగ్ గెలాక్సీ M21 స్మార్ట్‌ఫోన్ యొక్క అమ్మకాలు ఈ రోజు మధ్యాహ్నం 12:00 గంటలకు అమెజాన్ ఇండియా మరియు శామ్‌సంగ్ యొక్క సొంత వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వివిధ రకాల వేరియంట్ లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మార్చి 31 వరకు పరిచయ ఆఫర్‌లో భాగంగా రూ.500 తగ్గింపుతో లభిస్తుంది.

గెలాక్సీ M21 ధరల వివరాలు

గెలాక్సీ M21 ధరల వివరాలు

భారతదేశంలో శామ్‌సంగ్ గెలాక్సీ M21ను రెండు వేరియంట్‌లలో విడుదల చేసింది. ఇందులో 4GB ర్యామ్ + 64 GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ.13,499 లు కాగా 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ.15,499. ఈ రెండు మోడళ్లు మిడ్నైట్ బ్లూ మరియు రావెన్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి.

శామ్‌సంగ్ గెలాక్సీ M 21 స్పెసిఫికేషన్స్

శామ్‌సంగ్ గెలాక్సీ M 21 స్పెసిఫికేషన్స్

డ్యూయల్ సిమ్ (నానో) సిమ్ స్లాట్ గల శామ్‌సంగ్ గెలాక్సీ M 21 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత వన్ UI2.0 తో రన్ అవుతుంది. 6.4-అంగుళాల ఫుల్-హెచ్‌డి + డిస్‌ప్లే 1080x2340 పిక్సెల్స్ పరిమాణంలో ఉండి ఇన్ఫినిటీ-యు సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే 19.5: 9 కారక నిష్పత్తితో మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తుంది.

కెమెరా

కెమెరా

శామ్‌సంగ్ గెలాక్సీ M 21 స్మార్ట్ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెట్ -అప్ ను కలిగి ఉంటుంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ ఫోటోలను తీయడానికి మరియు వీడియోలను రికార్డ్ చేయడానికి సెటప్ చేయబడి ఉంది. అలాగే 123-డిగ్రీల అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ యొక్క 8 మెగాపిక్సెల్ సెన్సార్‌తో సెకండరీ కెమెరా మరియు 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో మూడవ కెమెరా జతచేయబడి ఉంటుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం దీని ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీ కెమెరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్లతో పనిచేస్తుంది.

కనెక్టివిటీ

కనెక్టివిటీ

శామ్సంగ్ గెలాక్సీ M21 స్మార్ట్ ఫోన్ 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించవచ్చు. కనెక్టివిటీ ఎంపికలలో 4 G VoLTE, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్, యుఎస్బి టైప్-సి మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ కూడా వస్తుంది. ఫోన్‌లోని ఇతర సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, గైరో, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 6,000 mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ ఫోన్ 8.9mm మందంతో 188 గ్రాముల బరువు కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy M21 First Sale Start on Amazon at 12PM: Price, Specs, Offers, and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X