Home
Mobile

శాంసంగ్ Galaxy M56, F56 ఇండియాకు వచ్చేస్తున్నాయ్‌.. సపోర్ట్ పేజీలు లైవ్..

Samsung Galaxy M56, Galaxy F56: శాంసంగ్ కంపెనీ తన సరికొత్త స్మార్ట్‌ఫోన్లు గెలాక్సీ M56, గెలాక్సీ F56 లను ఇండియాలో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్లు త్వరలోనే విడుదల కాబోతున్నాయని సమాచారం, ఎందుకంటే ఈ రెండు డివైజ్‌లు BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించాయి. అంతేకాదు, వాటి సపోర్ట్ పేజీలు కూడా శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్‌లో లైవ్‌లోకి వచ్చేశాయి.

గతంలో వచ్చిన గెలాక్సీ M55 5G, గెలాక్సీ F55 5G మోడల్స్‌కు కొనసాగింపుగా ఇవి రానున్నాయి. అంతకుముందు మోడల్స్ తక్కువ ధరలో, అలాగే మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో మంచి పేరు తెచ్చుకున్నాయి. గత మోడల్స్ సక్సెస్ కావడంతో, శాంసంగ్ Galaxy M56, F56లపై అంచనాలు పెరిగాయి. శాంసంగ్ లవర్స్ ఈ కొత్త ఫోన్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Samsung Galaxy M56  F56 India Launch Confirmed  Support Pages Live Release Date and Specs Revealed

* సపోర్ట్ పేజీలు, మోడల్ నంబర్లు

టెక్ ఔట్ లుక్ (TechOutlook) అనే టెక్ న్యూస్ వెబ్‌సైట్ శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్‌లో రెండు కొత్త డివైజ్‌ల సపోర్ట్ పేజీలను చూసింది. వాటి మోడల్ నంబర్లు SM-M566B/DS, SM-E566B/DS. ఈ నంబర్లను బట్టి చూస్తే, ఇవి గెలాక్సీ M56 5G, గెలాక్సీ F56 5G ఫోన్లుగా భావిస్తున్నారు.

మోడల్ నంబర్ చివర్లో ఉన్న DS డ్యూయల్-సిమ్ సపోర్ట్‌ని కన్ఫర్మ్ చేస్తోంది. వాటి పాత మోడల్స్ లాగానే, ఈ ఫోన్లు కూడా రెండు సిమ్‌లలో 5G సపోర్ట్ చేస్తాయని అంటున్నారు. గెలాక్సీ M56 ఫోన్ శాంసంగ్ బంగ్లాదేశ్ వెబ్‌సైట్‌లో కూడా కనిపించింది. అంటే బంగ్లాదేశ్‌లో కూడా ఈ ఫోన్ త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

* BIS, బ్లూటూత్ SIG లిస్టింగ్‌లో కూడా కనిపించాయి

ఈ రెండు డివైజ్‌లు ఇండియన్‌ BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లోనూ కనిపించాయి. అంటే వాటి విడుదల దగ్గర్లోనే ఉందని అర్థం చేసుకోవచ్చు. ఈ ఫోన్లు బ్లూటూత్ డివైజ్‌లను సర్టిఫై చేసే బ్లూటూత్ SIG డేటాబేస్‌లో కూడా లిస్ట్ అయ్యాయి. పాత మోడల్స్ బ్లూటూత్ 5.2ని సపోర్ట్ చేశాయి. కొత్త మోడల్స్‌లో అప్‌గ్రేడ్ ఉంటుందా లేదా అనేది చూడాలి.

* ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉండొచ్చు..

శాంసంగ్ స్పెసిఫికేషన్ల గురించి చెప్పకపోయినా, గెలాక్సీ M56, గెలాక్సీ F56 ఫోన్లు రాబోయే గెలాక్సీ A56 5G (మోడల్ SM-A566B/DS)తో కొన్ని ఫీచర్లను షేర్ చేసుకుంటాయని భావిస్తున్నారు. అయితే, శాంసంగ్ ఖర్చు తగ్గించడం కోసం హార్డ్‌వేర్‌లో కొన్ని మార్పులు చేయొచ్చు. అంటే చిప్‌సెట్ మార్చడం లేదా కొన్ని ప్రీమియం ఫీచర్లను తీసేయడం లాంటివి చేయొచ్చు.

ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ UI 7తో వస్తాయని అంచనా వేస్తున్నారు. శాంసంగ్ ఆరు జనరేషన్ల OS అప్‌గ్రేడ్లు, ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లు ఇవ్వొచ్చని భావిస్తున్నారు. అంటే చాలా కాలం పాటు సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మళ్లీ వెంటనే కొత్త ఫోన్ కొనాల్సిన అవసరం రాదు.

Take a Poll

* టెస్టింగ్ కోసం దిగుమతి చేసుకున్న పరికరాలు

కొన్ని రిపోర్ట్స్ ప్రకారం, ఈ డివైజ్‌ల కోసం బ్యాటరీలు, డిస్‌ప్లేలు, మైక్రోఫోన్లు ఇంకా చాలా విడిభాగాలను సౌత్ కొరియా నుంచి ఇండియాకు టెస్టింగ్ కోసం దిగుమతి చేసుకున్నారు. అంటే శాంసంగ్ ఈ ఫోన్లను లాంచ్ చేయడానికి ఫైనల్ స్టేజ్‌లో ఉందని చెప్పొచ్చు.

సపోర్ట్ పేజీలు లైవ్ అవ్వడం, BIS సర్టిఫికేషన్ కన్ఫర్మ్ అవ్వడంతో, శాంసంగ్ గెలాక్సీ M56, గెలాక్సీ F56 ఫోన్లు ఇండియాలో చాలా త్వరలోనే రిలీజ్ అవుతాయని ఆశించవచ్చు. స్పెసిఫికేషన్లు ఇంకా సీక్రెట్‌గా ఉన్నా, ఈ ఫోన్లు 5G సపోర్ట్, ఆండ్రాయిడ్ 15, లాంగ్-టర్మ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లతో వస్తాయని తెలుస్తోంది. దీంతో మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో ఈ ఫోన్లు పోటీ ఇవ్వడం ఖాయం.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung is set to launch the Galaxy M56 and Galaxy F56 in India. With 5G support, Android 15, and One UI 7, these mid-range phones promise long-term OS and security updates.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X