సామ్‌సంగ్ నుంచి కొత్త గెలాక్సీ ఫోన్‌లు

Posted By:

సామ్‌సంగ్ తన సరికొత్త గెలాక్సీ ఆన్5 (Galaxy On5), గెలాక్సీ ఆన్7 (Galaxy On7) ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఆన్5 స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,990. గెలాక్సీ ఆన్7 స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,990. ప్రముఖ రిటైలర్ Flipkart ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

దుమ్మురేపే స్పెక్స్‌తో OnePlus X

గెలాక్సీ ఆన్5 స్పెక్స్: 

5 అంగుళాల డిస్ ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
ఎక్సినోస్ 3475 క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారాఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (15 గంటల టాక్‌టైమ్‌తో), కనెక్టువిటీ ఆప్షన్స్ (డ్యుయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లుటూత్ 4.1, జీపీఎస్). 

ఈ ‘రోబోట్' ఉతికి.. ఆరేసి.. మడతపెట్టేస్తుంది

గెలాక్సీ ఆన్7 స్పెక్స్:

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఎక్సినోస్ 3475 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారాఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, కనెక్టువిటీ ఆప్షన్స్ (డ్యుయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లుటూత్ 4.1, జీపీఎస్)

గెలాక్సీ ఆన్7 స్మార్ట్‌ఫోన్‌లోని 5 బెస్ట్, వరస్ట్ ఫీచర్లను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గెలాక్సీ ఆన్7 స్మార్ట్‌ఫోన్‌లోని 5 బెస్ట్ ఫీచర్లు


బెస్ట్ ఫీచర్:

1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ స్నాప్ డ్రాగన్ 410 (ఎమ్ఎస్ఎమ్8916) ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1.5జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం.

 

గెలాక్సీ ఆన్7 స్మార్ట్‌ఫోన్‌లోని 5 బెస్ట్ ఫీచర్లు

బెస్ట్ సెల్పీ కెమెరా

క్వాలిటీ సెల్పీలను చిత్రీకరించుకునేందుకు గెలాక్సీ ఆన్7 స్మార్ట్‌ఫోన్‌లో 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను ఏర్పాటు చేసారు.

 

గెలాక్సీ ఆన్7 స్మార్ట్‌ఫోన్‌లోని 5 బెస్ట్ ఫీచర్లు

గుడ్ బ్యాటరీ బ్యాకప్

3,000 ఎమ్ఏహెచ్ సామర్థ్యం గల శక్తివంతమైన బ్యాటరీని గెలాక్సీ ఆన్7 ఫోన్ లో పొందుపరిచారు. 3జీ నెట్‌వర్క్ పై ఈ బ్యాటరీ 11 గంటల టాక్‌టైమ్‌ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

 

గెలాక్సీ ఆన్7 స్మార్ట్‌ఫోన్‌లోని 5 బెస్ట్ ఫీచర్లు

బడ్జెట్ ఫ్రెండ్లీ ధర

మిడ్ రేంజ్ స్పెక్స్‌తో వస్తోన్న గెలాక్సీ ఆన్7 ఫోన్ ధర కేవలం 10,990.

 

గెలాక్సీ ఆన్7 స్మార్ట్‌ఫోన్‌లోని 5 బెస్ట్ ఫీచర్లు

4జీ ఎల్టీఈ సపోర్ట్

గెలాక్సీ ఆన్7 స్మార్ట్‌ఫోన్ 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ నెట్‌వర్క్ ద్వారా ఇంటర్నెట్‌కు వేగవంతంగా కనెక్ట్ కావొచ్చు.

 

గెలాక్సీ ఆన్7 స్మార్ట్‌ఫోన్‌లోని 5 నిరుత్సాహపరిచే అంశాలు

టీఎఫ్టీ టైప్ డిస్‌ప్లే

గెలాక్సీ ఆన్7 స్మార్ట్‌ఫోన్ టీఎఫ్టీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది కొంచం నిరుత్సాహపరిచే అంశం. టీఎఫ్టీ డిస్‌ప్లేకు బదులుగా ఐపీఎస్ లేదా అమోల్డ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది.

 

గెలాక్సీ ఆన్7 స్మార్ట్‌ఫోన్‌లోని 5 నిరుత్సాహపరిచే అంశాలు

బరువెక్కువ!

గెలాక్సీ ఆన్7 స్మార్ట్‌ఫోన్ 151.8x77.5x 8.2 మిల్లీ మీటర్ల చుట్టుకొలతతో 172 గ్రాముల బరువును కలిగి ఉంది. ఇది కొంచ హవీ అనిపిస్తుంది.

 

గెలాక్సీ ఆన్7 స్మార్ట్‌ఫోన్‌లోని 5 నిరుత్సాహపరిచే అంశాలు


తక్కువనిపించే ఇంటర్నల్ మెమరీ.

గెలాక్సీ ఆన్7 స్మార్ట్‌ఫోన్‌లోని 5 నిరుత్సాహపరిచే అంశాలు

ఏ విధమైన స్ర్కీన్ ప్రొటెక్షన్ లేకపోవటం.

గెలాక్సీ ఆన్7 స్మార్ట్‌ఫోన్‌లోని 5 నిరుత్సాహపరిచే అంశాలు

మార్కెట్లో ఇదే ధరకు ఇంకా శక్తివంతమైన స్పెక్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉండటం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy On5, Galaxy On7 launched at Rs 8990 and Rs 10990 respectively. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot