సామ్‌సంగ్ కొత్త ఫోన్ ‘గెలాక్సీ గ్రాండ్ నియో ప్లస్’
సామ్‌సంగ్ ఇండియా ‘గెలాక్సీ గ్రాండ్ నియో ప్లస్' పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.9,999. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాల మేరకు గెలాక్సీ గ్రాండ్ నియో ప్లస్ స్సెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి...
(ఇంకా చదవండి: ఇన్ఫోసిస్‌లో అత్యధిక జీతం తీసుకుంటున్న ఐదుగురు ఎగ్జిక్యూటివ్‌లు)

5 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే ప్యానల్ (రిసల్యూషన్ 480x800పిక్సల్స్), ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా.
(చదవండి: యాపిల్ వాచ్ అందరికి సూట్ కాదా..? )
కనెక్టువిటీ ఆప్షన్స్ విషయానికొస్తే.. (డ్యుయల్ సిమ్, వై-ఫై, యూఎస్బీ, బ్లూటూత్ 4.0), 2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ కొలతలు 143.7 x 77.1 x 9.5 మిల్లీ మీటర్లు, బరువు 160 గ్రాములు. బ్లాక్, గోల్డ్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications








