శామ్‌సంగ్ గెలాక్సీ A36, A56 ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. 6 OS అప్‌డేట్లతో రికార్డు!
Samsung Galaxy A36 and A56: శామ్‌సంగ్ కంపెనీ ఇటీవల గెలాక్సీ A06 5Gని ఇండియాలో లాంచ్ చేసి హీట్ పుట్టించింది, ఇప్పుడు మరో రెండు అద్భుతమైన మోడల్స్ విడుదల చేయడానికి సిద్ధం అయిపోయింది. అవే గెలాక్సీ A36, A56 మొబైల్స్. అఫీషియల్‌గా చెప్పకపోయినా, లీకులు మాత్రం ఈ ఫోన్ల కెమెరా డిజైన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే అంటున్నారు. యూట్యూబ్, ఎక్స్‌లో శామ్‌సంగ్ రిలీజ్ చేసిన టీజర్ వీడియోలో A సిరీస్ ఫోన్లు అన్నీ కనిపించాయి.
కానీ A36, A56 మాత్రం సీక్రెట్‌గా ఉంచారు. అయితే, వీడియోలో ఒక అదిరిపోయే అప్‌గ్రేడ్ మాత్రం లీక్ చేశారు. ఈ కొత్త ఫోన్లకు ఏకంగా ఆరు OS అప్‌డేట్లు ఇస్తారంట. పోయినేడాది వచ్చిన A35, A55 లకు నాలుగే అప్‌డేట్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏకంగా ఆరు ఇస్తున్నారు.

అంటే సాఫ్ట్‌వేర్ విషయంలో ఇవి ఎక్కువ కాలం కొత్తగా ఉంటాయి. శామ్‌సంగ్ టాప్ మోడల్స్ S, Z సిరీస్‌లకు ఏడు అప్‌డేట్లు ఇస్తారు. వాటికి ఈ ఫోన్లు దాదాపు పోటీ పడేలా ఉన్నాయి. గెలాక్సీ A36, A56 ఎప్పుడు వస్తాయో శామ్‌సంగ్ ఇంకా చెప్పలేదు.
టీజర్ వీడియోలో మాత్రం A సిరీస్ యూజర్లు 89 మిలియన్లు దాటారంటూ హడావిడి చేశారు. @SamsungIndia X అకౌంట్ కూడా ఈ విషయంపై గుంభనంగానే ఉంది. వీటితో పాటు గెలాక్సీ M16, M06 5G మోడల్స్ కూడా త్వరలోనే వస్తాయంటున్నారు కానీ, డేట్ మాత్రం సస్పెన్సే.
అయితే వీటిని త్వరలోనే తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి కొత్త ఫోన్ కొనాలని చూసేవారు కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది. త్వరలోనే ఈ మొబైల్స్ ధరలు, స్పెసిఫికేషన్లు పూర్తిస్థాయిలో తెలిసే అవకాశం ముందే తద్వారా ఏ ఫోన్ కొనాలనేది నిర్ణయించుకోవచ్చు.
* స్పెసిఫికేషన్స్ చూస్తే
గెలాక్సీ A56లో శామ్‌సంగ్ ఎక్సినోస్ 1580 ప్రాసెసర్ ఉంటుందట, A36లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌తో వస్తుందని టాక్. రెండు ఫోన్లలోనూ 6.6 ఇంచుల OLED డిస్‌ప్లేలు ఉంటాయంటున్నారు. పిక్చర్లు, వీడియోలు చూస్తే కలర్‌ఫుల్‌గా, షార్ప్‌గా ఉంటాయి. బ్యాటరీ గురించి చెప్పక్కర్లేదు, 5000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తాయంటున్నారు.
పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్ రెండూ మెరుగ్గా ఉంటాయి. A26 కూడా లైన్‌లో ఉంది. గెలాక్సీ A26 కోసం సపోర్ట్ పేజీలు వెబ్‌సైట్స్‌లో దర్శనమిచ్చాయి. అంటే త్వరలోనే అది కూడా వచ్చేస్తుందని లీకులు వస్తున్నాయి. ఇండియా BIS సర్టిఫికేషన్ కూడా వచ్చేసింది. కానీ అందరి కళ్లు మాత్రం గెలాక్సీ A36, A56 ల మీదే ఉన్నాయి.
* ఫీచర్లు, అప్‌గ్రేడ్స్ అన్నీ వాటిలోనే..
కొత్త A సిరీస్ ఫోన్లకు సాఫ్ట్‌వేర్ సపోర్ట్ పెంచడం నిజంగా గొప్ప అడుగు. ఫోన్లు కూడా ఫ్యూచర్ ప్రూఫ్ గా ఉంటాయి. శామ్‌సంగ్ హై-ఎండ్ ఫోన్లకు ఏ మాత్రం తగ్గవు. హార్డ్‌వేర్, డిజైన్ అన్నీ మార్చేసి, గెలాక్సీ A36, A56 మిడ్-రేంజ్ మార్కెట్ ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.


Click it and Unblock the Notifications








