ఈ ఫోన్ ఖరీదు అక్షరాల రూ. 66 లక్షలు

By Hazarath
|

ఇప్పటివరకు మార్కెట్లో మీరు చూసిన ఫోన్లు వేరు..ఇప్పుడు రాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్ వేరు..ఇప్పటివరకు మీరు మహా అంటే లక్షో లేకుంటే 2 లక్షలో ఖరీదు చేసే ఫోన్లు చూసి ఉంటారు. కాని వచ్చే నెలలో విడుదలవబోతున్నఈ ఫోన్ ఖరీదు అక్షరాల 66 లక్షల రూపాయలు. ఇజ్రాయెల్‌కు చెందిన సిరిన్ ల్యాబ్స్ సొలారిన్ పేరుతో ఈ హై ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే నెలలో రిలీజ్ చేయనుంది.

Read more: సిలికాన్ వ్యాలీ సముద్రంలో కలిసిపోనుందా..

Sirin Labs

ఈ హై ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లో మిలిటరీ గ్రేడ్ సెక్యూరిటీని పొందుపరిచారు. ఇంతవరకు ఏ ఫోన్ కు లేనటువంటి సెక్యూరిటీ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉంటాయని కంపెనీ చెబుతోంది. 1.7 గెగా హెడ్జ్ ప్రాసెసర్, 1 జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఈ ఫోన్ వచ్చే నెలలో మార్కెట్లో దిగనుంది. టైటానియం బాడీతో పాటు స్టీరియో స్పీకర్స్ అలాగే స్క్రీన్ స్క్రాచ్ ప్రూఫ్ ఉంటాయని సంస్థ తెలిపింది. ఈ సంధర్భంగా ఇప్పటివరకు ప్రపంచంలో ఖరీదైన స్మార్ట్‌ఫోన్లు ఏంటో ఓ స్మార్ట్ లుక్కేయండి.

Read more: ఐఫోన్‌లో ఉన్న సీక్రెట్ ఫీచర్స్ గురించి తెలుసా..?

1

1

ఇది 32 జిబి ఐపోన్. దీని ధర 8 మిలియన్ల డాలర్లు. దీనికి దాదాపు 500 డైమండ్లను వాడారు. ఇక ఆపిల్ లోగో కోసం 53 డైమండ్లను అధికంగా వాడారు. ఈ ఫోన్ చూసినవారికి కళ్లు జిగేల్ మంటాయి.

2

2

దీని ధర 3,200,000 డాలర్లు. ఇది 3జీ ఐపోన్, దీని బరువు 271 గ్రాములు ఉంటుంది. 22కె బంగారంతో నిండి ఉంటుంది. కాశ్మీర్ గోల్డ్ అలాగే అత్యంత పవర్ పుల్ బంగారాన్ని ఈ ఫోన్ కోసం వాడారు.

3
 

3

దీని ధర 2.4 మిలియన్ల డాలర్లు. మొత్తం డైమండ్లతో నిండి ఉంటుంది. దాదాపు 138 డైమండ్లను ఈ ఫోన్ కోసం వాడారు.

4

4

దీన్ని ఇమ్యాన్యుయేల్ అనే వ్యక్తి  డిజైన్ చేశారు. వీరి కంపెనీ వాచీలు అలాగే బంగారాన్ని డిజైన్ చేస్తారు. అతను దీన్ని తయారుచేసి స్విట్జర్లాండ్ లో లాంచ్ చేశారు. ఈ ఫోన్ 18కె క్యారెట్ల బంగారంతో అలాగే 20 క్యారెట్ల VVS1 డైమండ్ తో తయారుచేశారు.

5

5

దీని ధర 1.3 మిలియన్ డాలర్లు. దీనిలో 50 డైమండ్లు ఉంటాయి. ఈ ఫోన్  చాలా శక్తివంతమైన రక్షణ కూడా ఇస్తుంది.

6

6

దీన్ని 2005లో స్విట్జర్లాండ్ లో తయారుచేశారు. దీని బరువు 180 గ్రాములు. 200 సంవత్సరాల క్రితం ఆప్రికన్ లో లభించిన బ్యాక్ వుడ్స్ తో దీని వెనుక ప్యానల్ తయారైంది. దీని కీలన్నీ క్రిస్టల్ తో తయారైఉంటాయి. దీని ధర 1 మిలియన్ల డాలర్లు

7

7

ఫోన్ చుట్టూ పాము ఆకారంలో ముత్యాల హారం ఉంటుంది. అది మొత్తం డైమండ్లతో నిండి ఉంటుంది. అందుకే దీన్ని కోబ్రా ఫోన్ అని పిలుస్తారు. దీని ధర కూడా కోట్లలో ఉంటుంది. 

8

8

ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఫోన్లలో దీని స్థానం 8. పోలో కార్బోనేట్ మిర్రర్ తో పాటు ఆర్గానిక్ ఎల్ ఈడీ టెక్నాలజీని వాడారు. ఈ ఫోన్లో కేవలం రెండు డైమండ్లు మాత్రమే వాడారు. దీని ధర 300,000 డాలర్లు

9

9

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఫోన్లలో ఇది కూడా ఒకటి. మొత్తం డైమండ్లతో అలాగే బంగారంతో నింపారు. ఆస్ట్రియాకు చెందిన పీటర్ దీన్ని డిజైన్ చేసినవారు. దీని బరువు 16.50 నుంచి 17.75 వరకు ఉంటుంది. దీని ధర మార్కెట్లో 1, 76, 400 డాలర్లు

10

10

ఇది ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ ఫోన్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్లలో ఇది ముందు వరుసలో ఉంటుంది. ఇది ప్లాటినంతో అది మిషన్ల మీద కాకుండా చేతులతోనే తయారుచేశారు. 200 డైమండ్ లు ఈ ఫోన్ లో పొదిగారు. దీని ధర 88000 డాలర్లు.

11

11

లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write Sirin Labs brings 20000 Android phone promises military-grade security

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X