ఆ ఫోన్ రూ. 8 వేలు తగ్గింది.

Written By:

సోనీ తన స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియా ఎక్స్ జెడ్ పై భారీ డిస్కౌంట్‌ని ప్రకటించింది. దాదాపు రూ. 8 వేల వరకు తగ్గింపును అందిస్తోంది. తన కంపెనీ వెబ్‌సైట్‌లోఫోన్ ధరను రూ.41,990కి అందుబాటులో ఉంచింది. కాగా గతేడాది అక్టోబర్‌లో లాంచ్ అయినప్పుడు ఈ ఫోన్ ధర రూ.51,990గా కంపెనీ ప్రకటించింది. ఆ తర్వాత కొద్ది కాలానికి రూ.49,990కే ఈ ఫోన్ విక్రయానికి వచ్చింది.

డ్యూయల్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ, 6 జిబి ర్యామ్..

ఆ ఫోన్ రూ. 8 వేలు తగ్గింది.

ప్రస్తుతం ఆ ధరను మరింత తగ్గించి, రూ.41,990కు అందుబాటులో ఉంచింది. అయితే ఈ ధరను శాశ్వతంగా తగ్గించిందా లేదా పరిమితి కాల వ్యవధిలోనా అనే విషయంపై కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు. సోని ఎక్స్‌క్లూజివ్ పార్టనర్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలోనూ ఎక్స్‌పీరియా ఎక్స్ జెడ్ ఫోన్ ధర తగ్గి రూ.39,990గా ఉంది.

6 నెలల పాటు ఐడియా ఉచిత డేటా పొందడం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ALKALEIDO మెటీరియల్‌‌తో

సోనీ తన ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ఫోన్‌ను ప్రత్యేకమైన ALKALEIDO మెటీరియల్‌తో తయారు చేసింది. ఫోన్ పై మచ్చలంటూ పడవు. 8.1 మిల్లీ మీటర్ల మందంతో రూపుదిద్దుకున్న ఈ ఫోన్ బరువు 161 గ్రాములు.

X-Reality Engine

సహజసిద్ధమైన రంగులను ఉత్పత్తి చేయగిలిగే అప్‌గ్రేడెడ్ X-Reality Engineను ఈ ఫోన్‌ డిస్‌ప్లేలో సోనీ పొందుపరిచింది. 5.1 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ట్రైల్యూమినస్ డిస్‌ప్లేతో వస్తోన్న ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ఫోన్‌లో.. లైవ్ కలర్ ఎల్ఈడి, లైవ్ కలర్ క్రియేషన్ వంటి రిచ్ టోన్ కలర్ ఫీచర్లను పొందుపరిచారు.

శక్తివంతమైన Snapdragon ప్రాసెసర్..

ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ఫోన్‌లో శక్తివంతమైన Snapdragon 820 chipsetను సోనీ నిక్షిప్తం చేసింది. పొందుపరిచిన అడ్రినో 530 చిప్ గ్రాఫిక్ విభాగాన్ని చూసుకుంటుంది.

ర్యామ్ ఎంతంటే..?

ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ఫోన్‌ 3జీబి ర్యామ్‌తో వస్తోంది. 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని మరింతగా విస్తరించుకునే అవకాశం.

సరికొత్త IMX300 Sensor

సరికొత్త IMX300 Sensor ఆధారంగా పనిచేసే 23 మెగా పిక్సల్ కెమెరాను ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ఫోన్‌ వెనుక భాగంలో ఏర్పాటు చేసారు. 13 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఆకట్టుకుంటుంది.

ట్రిపుల్ ఇమేజ్ సెన్సింగ్...

సోనీ, తన ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ఫోన్‌ కెమెరా ద్వారా ట్రిపుల్ ఇమేజ్ సెన్సింగ్ పేరుతో సరికొత్త టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ సరికొత్త కమెరా టెక్నాలజీ కదులుతున్న వాటిని హైక్వాలిటీతో క్యాప్చుర్ చేస్తుంది.

ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ స్థానంలో...

సోనీ తన ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ఫోన్‌ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కు బదులుగా SteadyShot Intelligent Active Modeను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫోటోలు ఇంకా వీడియోలను స్థిరీకరించేందుకు ఈ మోడ్ 5 యాక్సిల్ గైరో స్కోప్‌ను ఉపయోగిస్తుంది.

4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్

ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 13 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా ద్వారా హైక్వాలిటీ సెల్ఫీలతో పాటు వీడియో కాలింగ్ నిర్వహించుకోవచ్చు. ఈ కెమెరా 4కే క్వాలిటీ వీడియోలను కూడా రికార్డ్ చేయగలదు.

క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ సపోర్ట్...

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ఫోన్‌ ప్రత్యేకమైన వాటర్ రెసిస్టెంట్ తత్వంతో వస్తోంది. సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ ఫోన్‌‌లో ఏర్పాటు చేసిన 2,900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0 టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. అడాప్టివ్ ఛార్జింగ్ టెక్నాలజీని డివైస్ సపోర్ట్ చేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Sony Xperia XZ Price Cut in India, Now Available at Rs. 39,990 read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot