6 నెలల పాటు ఐడియా ఉచిత డేటా పొందడం ఎలా..?

Written By:

దేశీయ మొబైల్ ఆపరేటర్ దిగ్గజం ఐడియా వినియోగదారులకు బంఫరాఫర్ ప్రకటించింది. చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీదారీ సంస్థ ఐటెల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా నెలకు 1 జిబి డేటా చొప్పున ఆరునెలలపాటు ఉచితంగా అందించనుంది. ఈ ఆఫర్ ఈ రోజు నుంచే అమల్లోకి వస్తుందని ఐడియా తెలిపింది.

6జిబి ర్యామ్‌తో వన్‌ప్లస్ 3T బ్లూ కలర్ ఫోన్,కమింగ్ సూన్..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్ మోడల్స్ కు

ఈ ఆఫర్ కొన్ని ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్ మోడల్స్ కు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌ పొందాలంటే యూజర్లు ఐటెల్‌ స్మార్ట్‌‌ఫోన్ల‌లోని ఐడియా ద్వారా http://i4all.ideacellular.com/offers సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.

గెట్‌ స్టార్టెడ్‌ బటన్ ప్రెస్‌ చేస్తే

అనంతరం గెట్‌ స్టార్టెడ్‌ బటన్ ప్రెస్‌ చేస్తే.. యూజర్‌ డివైజ్‌ ఐఎంఈఐ, ఫోన్‌ నెంబర్‌ వెబ్‌‌సైట్‌ గుర్తిస్తుందని తెలిపింది. ఇక్కడ షో మై ఆఫర్స్‌ అనే ఆప్షన్‌ క్లిక్‌ చేసి, 1 జీబీ ఆఫర్‌ ను సెలెక్ట్‌ చేసుకోవాలని సూచించింది.

కన్‌ఫర్మేషన్‌ మెసేజ్‌

ఈ ప్రక్రియ విజయవంతంగా ముగిసిన తర్వాత కన్‌ఫర్మేషన్‌ మెసేజ్‌ వస్తుందని తద్వారా ఉచిత ఇంటర్నెట్‌ సేవలను ఆస్వాదించవచ్చని పేర్కొంది. అయితే it1409, it1407, it1508, it1508+ and Power Pro series; it1516+ ఈ మోడల్స్‌లో మాత్రమే ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

ఆరునెలలు పాటు

ఆరునెలలు పాటు వరుసగా 1 జీబీ డేటా ఫ్రీగా వాడుకోవచ్చు. అలాగే నెలకు రూ. 50 లేదా అంతకు మించి ప్యాక్‌లు చెల్లించడం ద్వారా అదనపు డేటా, లేదా వాయిస్‌ కాల్స్‌ను పొందవచ్చని తెలిపింది.

టవర్ల బిజినెస్‌ను

మరోవైపు టవర్ల బిజినెస్‌ను కొనుగోలు చేసే యోచనలో అమెరికన్‌ టవర్‌ కంపెనీ(ఏటీసీ) అధికారులు ప్రస్తుతం ఐడియాతో చర్చలు జరుపుతున్నారు. అటు వొడాఫోన్‌తో విలీనానికింటే ముందుగానే టవర్ల డీల్‌ను కుదుర్చుకోవాలని ఐడియా యాజమాన్యం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
itel partners Idea Cellular to offer 6 GB free data on its smartphones read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot