సోనీ ఎక్స్‌పీరియా జెడ్3ప్లస్, దుమ్ము రేపే ఫీచర్లతో

Posted By:

జపాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సోనీ, తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ‘ఎక్స్‌పీరియా జెడ్3ప్లస్'ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 810 సీపీయూతో పాటు 3జీబి ర్యామ్‌తో లభ్యమవుతున్న ఫోన్ ధర రూ.55,990. జెడ్3 స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడెడ్ వర్షన్‌గా విడుదలైన జెడ్3ప్లస్ మరింత స్లిమ్ లుక్‌ను సొంతం చేసుకుంది. జపాన్ మార్కెట్లో ఈ ఫోన్ ఎక్స్‌పీరియా జెడ్4 పేరుతో విక్రయించబడుతోంది.

Read More: సోనీ ప్లే స్టేషన్ గురించి 10 ఆసక్తికర నిజాలు

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3ప్లస్ ప్రధాన స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ట్రైల్యుమినస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఎక్స్-రియాల్టీ మొబైల్ పిక్షర్ ఇంజిన్, 64-బిట్ ఆక్టా కోర్ (క్వాడ్-కోర్ 1.5గిగాహెర్ట్జ్ + క్వాడ్ - కోర్ 2గిగాహెర్ట్జ్) క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్, 3జీబి ర్యామ్.

Read Moreకంటిని ఎన్ని సార్లు బ్లింక్ చేస్తున్నారు..?

20.7 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా (ప్రత్యేక ఫీచర్లు: 1/2.3 అంగుళాల ఎక్స్‌మార్ ఆర్ బీఎస్ఐ సెన్సార్, బయాన్జ్ ఇమేజ్ ప్రాసెసర్, పల్సుడ్ ఎల్ఈడి ఫ్లాష్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: 26 ఎమ్ఎమ్ వైడ్ యాంగిల్ లెన్స్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్), 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2930 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (45 నిమిషాల్లో ఫుల్ చార్జ్, 10 నిమిషాల చార్జ్‌తో 5.5 గంటల యూసేజ్ టైమ్‌). హై రిసల్యూషన్ ఆడియో టెక్నాలజీ, వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్.

Read More: కొత్త స్మార్ట్‌ఫోన్ యూజర్లకు 6 ముఖ్యమైన చిట్కాలు

ఫోన్ పరిమాణం 46x72x6.9మిల్లీ మీటర్లు, బరువు 144 గ్రాములు, కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే.. డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, జీపీఎస్/ఏ-జీపీఎస్, వై-ఫై విత్ హాట్ స్పాట్, గ్లోనాస్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ, డీఎల్ఎన్ఏ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్.

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3ప్లస్‌లోని ప్రత్యేకతలు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3ప్లస్‌లోని ప్రత్యేకతలు..

సోనీ ఓమ్నీ డిజైన్, గ్లాస్ బ్యాక్, అల్యుమినియమ్ ఫ్రేమ్

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3ప్లస్‌లోని ప్రత్యేకతలు..

క్రోమ్ ఎడ్జ్, షాక్ రిసెస్టెంట్ క్యాప్, మెటాలిక్ కోటింగ్

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3ప్లస్‌లోని ప్రత్యేకతలు..

సైబర్ షాట్ కెమెరా టెక్నాలజీ, 4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3ప్లస్‌లోని ప్రత్యేకతలు..

ఐపీఎక్స్5/ఐపీఎక్స్8 రేటింగ్‌తో కూడిన వాటర్ ప్రూఫ్, డస్ట్ రెసిస్టెన్స్ టెక్నాలజీ. ఎల్‌డీఏసీ ఆడియో కంప్రెషన్ మోడ్

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3ప్లస్‌లోని ప్రత్యేకతలు..

వాతావరణానికి తగ్గట్టుగా స్ర్కీన్ బ్రెట్నెస్‌ను మార్చుకోగలిగే అడాప్టివ్ డిస్‌ప్లే టెక్నాలజీ 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Japanese mobile manufacturer, Sony has quietly launched the global variant of Xperia Z4, which is dubbed as Xperia Z3+. The Xperia Z3+ comes with Sony's Omni balance design with glass back and aluminum frame along with dual SIM.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot