అమ్మకాల సునామిలో గెలాక్సి నోట్ 7..సప్లయిలేక శాంసంగ్ విలవిల

Written By:

ఐరిస్ స్కానర్‌తో వినియోగదారుల ముందుకు దూసుకువచ్చిన శాం సంగ్ న్యూ ఫోన్ గెలాక్సీ నోట్ 7 అమ్మకాల సునామిని సృష్టిస్తోంది. రోజు రోజుకు డిమాండ్ భారీగా పెరుగుతోందని కంపెనీ ఆనందం వ్యక్తం చేస్తోంది. అంచనాలకు మించి ఈ ఫోన్ డిమాండ్ నమోదవుతుందని సప్లయి కన్నా డిమాండ్ ఎక్కువ కావడంతో లాంచింగ్ కావాల్సిన మార్కెట్లలో ఈ ఫోన్ ఆవిష్కరణ తేదీలను సర్దుబాటు చేస్తున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

6జిబి ర్యామ్‌,128 జిబి స్టోరేజ్‌తో శాంసంగ్ నెక్ట్స్ ఫోన్

అమ్మకాల సునామిలో గెలాక్సి నోట్ 7..సప్లయిలేక శాంసంగ్ విలవిల

ఈ కొత్త ఫోన్ తమ వ్యాపారాన్ని మరింత లాభాల బాటలో నడిపిస్తుందని రాబడులను అత్యధికంగా ఆర్జించడానికి దోహదం చేస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 అమ్మకాల సునామితో మరో టెక్ దిగ్గజం ఆపిల్ తన కొత్త స్మార్ట్ ఫోన్‍ను వీలయినంత తొందరగా కుదిరితే వచ్చే నెలలో ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. విచిత్రమేమిటంటే గతేడాది కర్వ్‌డ్ డిస్‌ప్లే గెలాక్సీ ఎస్6 ఎడ్జ్‌ను కూడా శాంసంగ్ డిమాండ్ ఉన్నా ఆశించిన మేర సప్లై చేయలేకపోయింది. ఈ విషయాన్ని కంపెనీ ప్రతినిధులే గుర్తు చేస్తున్నారు. 

గాల్లో ఎగిరే ట్యాక్సీలు..ఫోన్‌తోనే ఆపరేటింగ్

శాంసంగ్ గెలాక్సీ 7 ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

శాంసంగ్ గెలాక్సీ 7 ఫీచర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 7.. 5.7 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ కర్వుడ్ డ్యుయల్ ఎడ్జ్ డిస్‌ప్లేతో వస్తోంది. రిసల్యూషన్ 2560x1440పిక్సల్స్, 518 పీపీఐ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్.

 

 

శాంసంగ్ గెలాక్సీ 7 ఫీచర్లు

ఆక్టా కోర్ ఎక్సినోస్ 8890 (2.3గిగాహెర్ట్జ్ క్వాడ్ + 1.6గిగాహెర్ట్జ్ క్వాడ్) ప్రాసెసర్, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ స్లాట్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

శాంసంగ్ గెలాక్సీ 7 ఫీచర్లు

12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, డ్యుయల్ పిక్సల్ పీడీఏఎఫ్, స్మార్ట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేసన్, F/1.7 అపెర్చుర్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

శాంసంగ్ గెలాక్సీ 7 ఫీచర్లు

ఆండ్రాయిడ్ మార్స్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ లేటెస్ట్ టచ్‌విజ్ యూజర్ ఇంటర్‌ఫేస్. త్వరలోనే ఆండ్రాయిడ్ 7.0 Nougat అప్‌డేట్ పొందే అవకాశం.

శాంసంగ్ గెలాక్సీ 7 ఫీచర్లు

హార్ట్ రేట్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐరిస్ స్కానర్, బారో మీటర్, స్ర్కీన్ ఆఫ్ మెమో, స్మార్ట్ సెలక్ట్, సరికొత్త ఎయిర్ కమాండ్ ఫంక్షన్స్.

శాంసంగ్ గెలాక్సీ 7 ఫీచర్లు

బయోమెట్రిక్ టెక్నాలజీ ఆధారంగా అభివృద్థి చేసిన డ్యుయల్ - ఐ ఐరిస్ స్కానర్ వ్యవస్థను ఈ ఫోన్‌లో పొందుపరిచారు. ఈ ఫీచర్ ద్వారా సామ్‌సంగ్ పే ఇంకా ఇతర్ యాప్స్ ద్వారా చేసే కొనుగోళ్లకు సంబంధించి చెల్లించే పేమెంట్స్ మరింత సెక్యూర్‌గా ఉంటాయి

శాంసంగ్ గెలాక్సీ 7 ఫీచర్లు

7/9 4G LTE Cat.12, Wi-Fi 802.11ac, Bluetooth 4.2 LE, NFC, USB Type-C

శాంసంగ్ గెలాక్సీ 7 ఫీచర్లు

శక్తివంతమైన 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ. వైర్‌లెస్ చార్జింగ్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Strong demand for Samsung's Galaxy Note 7 tests supply chain
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot