2014లో విడుదలైన ముఖ్యమైన స్మార్ట్‌ఫోన్‌లు

|

భారీ అంచనాలతో ప్రారంభమైన 2014 అంతా అనుకున్నట్లుగా అత్యాధునిక సాంకేతిక ఆవిష్కరణలతో ఘనంగా ముగింపుకు చేరుకుంది. స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో ఈ ఏడాది అనేక అద్భుతాలనే మనం చూడగలిగాం. 2014లో మార్కెట్ దృష్టిని ఆకర్షించిన పలు ముఖ్యమైన స్మార్ట్‌ఫోన్‌లను ఇప్పుడు చూద్దాం..

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు ఎక్కడా లేనంత గిరాకీ ఇండియన్ మార్కెట్లో ఉంది. కమ్యూనికేషన్ పరిజ్ఞానం మరింతగా అప్‌గ్రేడ్ అయిన నేపధ్యంలో భారతావనిలోని అనేక కుటంబాలు ఫీచర్ ఫోన్‌ల వినియోగం నుంచి స్మార్ట్‌ఫోన్‌ల వినియోగంలోకి మారుతున్నాయి. ఈ పోకడలను పూర్తి స్థాయిలో సమీక్షించిన మోటరోలా ముఖ్యంగా మధ్య తరగతి స్మార్ట్‌ఫోన్ యూజర్లను టార్గెట్ చేస్తూ ‘మోటో ఇ' లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిందిరూ.6,999 ధర ట్యాగ్ పై లభ్యమువుతున్న ఈ ఫోన్, మన్నికైన స్మార్ట్‌ఫోన్ అనుభూతులను ఆస్వాదించాలనుకునే యూజర్లకు ఉత్తమ ఎంపిక.

 2014లో విడుదలైన ముఖ్యమైన స్మార్ట్‌ఫోన్‌లు

2014లో విడుదలైన ముఖ్యమైన స్మార్ట్‌ఫోన్‌లు

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లను  పరిశీలించినట్లయితే.. 4.6 అంగుళాల హైడెఫినిషన్ ఐపిఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280x720పిక్సల్స్), ట్రైలూమినస్ టెక్నాలజీ ఫోన్ డిస్‌ప్లేను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దింది. స్నాప్‌డ్రాగన్ 801 క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 2.5గిగాహెట్జ్), అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ప్రత్యేకతలు: ఎక్స్‌మోస్ ఆర్ఎస్ సెన్సార్, హెచ్‌‍డీఆర్ ఫోటోలు ఇంకా

వీడియోలు, 4కే వీడియో రికార్డింగ్), 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (1080 పిక్సల్ వీడియో క్వాలిటీతో).

 

 2014లో విడుదలైన ముఖ్యమైన స్మార్ట్‌ఫోన్‌లు

2014లో విడుదలైన ముఖ్యమైన స్మార్ట్‌ఫోన్‌లు

యాపిల్ ఐఫోన్ 6 ప్లస్

ఫోన్ బరువు 172 గ్రాములు, చుట్టుకొలత 158.10 x 77.80 x 7.10 మిల్లీమీటర్లు, ఫోన్ మందం 7.1 మిల్లీ మీటర్లు, 5.5 అంగుళాల తాకేతెర (రెటీనా హైడెఫినిషన్ డిస్‌ప్లే రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్, 401 పీపీఐ), ఐఓఎస్ 8.0 ప్లాట్‌ఫామ్, యాపిల్ ఏ8 ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ఐసైట్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, సింగిల్ సిమ్ కనెక్టువిటీ (జీఎస్ఎమ్ నానో సిమ్), ఇతర కనెక్టువిటీ ఫీచర్లు (4జీ,3జీ, వై-పై, జీపీఎస్, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ), సెన్సార్లు (పాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరో స్కోప్, బారో మీటర్), బ్యాటరీ సామర్థ్యం . ఐఫోన్ 6 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను యాపిల్ 16జీబి, 64జీబి, 128జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో అందిస్తోంది.

 

 2014లో విడుదలైన ముఖ్యమైన స్మార్ట్‌ఫోన్‌లు

2014లో విడుదలైన ముఖ్యమైన స్మార్ట్‌ఫోన్‌లు

షియోమీ ఎంఐ3

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఇటీవల అరంగ్రేటం చేసిన చైనా కంపెనీ షియోమీ అద్భుతాలు సృష్టిస్తోంది. ఆధునిక స్మార్ట్‌ఫోన్ మార్కెట్ పై పూర్తిగా పట్టు సాధించిన జియోమీ భారత్‌లోని టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో ఒకటిగా నిలిచింది. షియోమీ నుంచి ఇటీవల మార్కెట్లో విడుదలైన ఎంఐ 3 స్మార్ట్‌ఫోన్‌కు మార్కెట్లో ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది.

షియోమీ ఎంఐ3 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... కంపెనీ వృద్థి చేసిన ఎంఐయూఐ ఆండ్రాయిడ్ ఇంటర్‌ఫేస్ పై ఫోన్ రన్ అవుతుంది. ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ ఎల్‌సీడీ టచ్ డిస్‌ప్లే (కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో), 2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 800 (ఎమ్ఎస్ఎమ్ 8974ఏబీ) ప్రాసెసర్, 2జీబి డీడీఆర్3 ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, సోనీ ఎక్స్‌మార్ బీఎస్ఐ సెన్సార్, ఎఫ్ 2.2 అపెర్చర్), 1080 పిక్సల్ పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్ ఈ కెమెరా ద్వారా సాధ్యమవుతుంది, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై 802.11a/b/g/n, వై-ఫై డైరెక్ట్, బ్లూటూత్ 4.0, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 3050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ పరిమాణం 114×72×8.1 మిల్లీ మీటర్లు, బరువు 145 గ్రాములు.

 

 2014లో విడుదలైన ముఖ్యమైన స్మార్ట్‌ఫోన్‌లు

2014లో విడుదలైన ముఖ్యమైన స్మార్ట్‌ఫోన్‌లు

వన్ ప్లస్ వన్

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ వన్ ప్లస్ కంపెనీ ‘వన్ ప్లస్ వన్' పేరుతో మొదటి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో భారత్‌లో విడుదల కాబోతోంది. ఈ ఫోన్ 64జీబి మెమరీ వేరియంట్‌ను రూ.25,000 ధర పరిధిలో విక్రయించేందుకు కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రీఆర్డర్లు ప్రారంభమయ్యాయి. 16 ఇంకా 64జీబి ఇంటర్నల్ మెమెరీ వేరియంట్‌లలో ఈ  హ్యాండ్‌సెట్‌లు అందుబాటులోకి రానున్నట్లు మార్కెట్ వర్గాల టాక్. 64జీబి మెమరీ స్టోరేజ్‌‌తో లభ్యం కానున్న వన్ ప్లస్ వన్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి. 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 ×1080పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 2.5 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3జీ ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపకల్పన చేయబడిన సియానోజెన్ మోడ్ 11ఎస్ ఆపరేటింగ్ సిస్టం, ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (16జీబి,64జీబి), 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 2014లో విడుదలైన ముఖ్యమైన స్మార్ట్‌ఫోన్‌లు

2014లో విడుదలైన ముఖ్యమైన స్మార్ట్‌ఫోన్‌లు

బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్

కెనడాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ బ్లాక్‌బెర్రీ గడిచిన సెప్టంబర్‌లో తన లేటెస్ట్ హై ప్రొఫైల్ ఫోన్ ‘బ్లాక్‌బెర్రీ పాస్‌పోర్ట్'ను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. అద్భుతమైన కీప్యాడ్‌తో 4.5 అంగుళాల స్క్వేర్ షేప్ స్ర్కీన్‌ను కలిగి ఉండే ఈ ఫోన్‌ను బ్లాక్‌బెర్రీ అద్భుతంగా డిజైన్ చేసింది. ఫోన్ స్పెసిఫికేషన్‌లు: 4.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1,440 x 1,440పిక్సల్స్, 453 పీపీఐతో), 2.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, బ్లాక్‌బెర్రీ 10.3 ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, కనెక్టువిటీ ఫీచర్లు (ఎన్ఎఫ్‌సీ, మిరాకాస్ట్, బ్లూటూత్ వీ4.0, వై-ఫై, 4జీ ఎల్టీఈ, 3జీ), 3450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 2014లో విడుదలైన ముఖ్యమైన స్మార్ట్‌ఫోన్‌లు

2014లో విడుదలైన ముఖ్యమైన స్మార్ట్‌ఫోన్‌లు

మోటరోలా మోటో ఇ

రూ.6,999 ధర ట్యాగ్ పై లభ్యమువుతున్న ఈ ఫోన్, మన్నికైన స్మార్ట్‌ఫోన్ అనుభూతులను ఆస్వాదించాలనుకునే యూజర్లకు ఉత్తమ ఎంపిక.

మోటరోలా మోటో ఇ స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు:

4.3 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 960x540పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్, అడ్రినో 302 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 4.4.2 ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (హెచ్ ఎస్ఏ+, బ్లూటూత్ 4.0, జీపీఎస్, వై-ఫై కనెక్టువిటీ, డ్యూయల్ సిమ్), 1989 ఎమ్ఏమెచ్ బ్యాటరీ.

 

 2014లో విడుదలైన ముఖ్యమైన స్మార్ట్‌ఫోన్‌లు

2014లో విడుదలైన ముఖ్యమైన స్మార్ట్‌ఫోన్‌లు

అసుస్ జెన్‌ఫోన్ 5

5 అంగుళాల కెపాసిటివ్ మల్టీటచ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో, 2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ఇంటెల్ ఆటమ్ జెడ్2580 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ అప్‌గ్రేడబుల్), జెన్ యూజర్ ఇంటర్‌ఫేస్, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (8జీబి, 16జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), 2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 2014లో విడుదలైన ముఖ్యమైన స్మార్ట్‌ఫోన్‌లు

2014లో విడుదలైన ముఖ్యమైన స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4

5.7 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్, పిక్సల్ డెన్సిటీ 571 పీపీఐ), 2.7గిగాహెట్జ్  క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 805 ప్రాసెసర్, అడ్రినో 420 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఎక్సినోస్ 5433 ఆక్టా‌కోర్ చిప్‌సెట్, 1.9గిగాహెట్జ్ క్వాడ్ కోర్+1.3గిగాహెట్జ్ క్వాడ్-కోర్, 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 16 మెగా పిక్సల్ రిసల్యూషన్ కెమెరా, 3.7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ- ఏ క్యాట్.6, 3జీ హెచ్‌ఎస్‌పీఏ+, వై-ఫై, బ్లూటూత్, గ్లోనాస్, యూఎస్బీ 2.0, ఎంహెచ్ఎల్ 3.0), 3220 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. సామ్‌‌సంగ్ గెలాక్సీ నోట్ 4 తెలుగు సహా 14 భారతీయ ప్రాంతీయలను సపోర్ట్ చేస్తుంది.

 

 2014లో విడుదలైన ముఖ్యమైన స్మార్ట్‌ఫోన్‌లు

2014లో విడుదలైన ముఖ్యమైన స్మార్ట్‌ఫోన్‌లు

ఇంటెక్స్ ఫైర్‌ఫాక్స్ ఫోన్ క్లౌడ్ ఎఫ్ఎక్స్

ఇంటెక్స్ మొబైల్స్ తన మొట్టమొదటి ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ క్లౌడ్ ఎఫ్ఎక్స్ (Cloud FX)ను సోమవారం అధికారికంగా ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఫోన్ ధర రూ.1,999. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎంట్రీస్థాయి స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను ప్రముఖ రిటైలర్ snapdeal ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

3.5 అంగుళాల HVGA కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఫైర్‌ఫాక్స్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ (2జీ+2జీ), 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (2జీ (ఎడ్జ్), వై-ఫై, బ్లూటూత్), 1250 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ పరిమాణం 115.9x62x11.8మిల్లీమీటర్లు, బరువు 104 గ్రాములు.

 

Best Mobiles in India

English summary
The Most Notable Smartphones Of 2014. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X