మార్చి నెలలో విడుదల కానున్న స్మార్ట్‌ఫోన్‌లు.. ఈ రెండు భారీ బ్యాటరీ ఫోన్‌లు మరింత ప్రత్యేకం..!
భారత్ మార్కెట్‌లోకి జనవరి, ఫిబ్రవరిలో అనేక స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. మార్చిలోనూ వివిధ బ్రాండ్‌లు తమ ఫోన్‌లను విడుదల చేసేందుకు (Smartphones Launches in March 2025) సిద్ధంగా ఉన్నాయి. నిన్న శాంసంగ్ గ్లోబల్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఇందులో గెలాక్సీ A56, గెలాక్సీ A36, గెలాక్సీ A26 హ్యాండ్‌సెట్‌లు లాంచ్ అయ్యాయి. త్వరలో భారత్‌లోనూ ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఏకంగా 6 సంవత్సరాల వరకు OS, సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందనుందని తెలిపింది.
ఇవాళ పోకో M7 5G (Poco M7 5G) విడుదల కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. రూ.10,000 కంటే తక్కువ ధరకే అందుబాటులోకి రానుందని పోకో తెలిపింది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను వెల్లడించింది.

షియోమీ 15 సిరీస్ (Xiaomi 15 Series) భారత్‌లో మార్చి 11 వ తేదీన లాంచ్ కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా షియోమీ 15, షియోమీ 15 అల్ట్రా విడుదల కానుంది. అమెజాన్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ఈ సిరీస్ అల్ట్రా వేరియంట్ స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మరియు 200MP పెరిస్కోప్ కెమెరా, 6000mAh బ్యాటరీతో అందుబాటులోకి రానుంది.
నథింగ్ ఫోన్ 3a సిరీస్ (Nothing Phone 3a Series) విడుదల కానుంది. భారత్ మార్కెట్‌లో మార్చి 4 వ తేదీ 3.30PM గంటలకు నథింగ్ ఫోన్ 3a, ఫోన్ 3a ప్రో మోడళ్లు విడుదల కానున్నాయి. తొలిసారిగా ఈ సిరీస్ స్మాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మరియు ప్రో మోడల్ పెరిస్కోప్ లెన్స్‌ను కలిగి ఉంటుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన డిజైన్‌లు విడుదల అయ్యాయి.
నథింగ్ ఫోన్ 3a సిరీస్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉండనున్నాయి. 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. అయితే ప్రో మోడల్ పెరిస్కోప్ లెన్స్‌తో అందుబాటులో ఉంటుంది. మరియు 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
గత నెలలో వివో నుంచి మిడ్‌రేంజ్‌లో వివో V50 స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. మార్చిలో బడ్జెట్ రేంజ్‌లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. మార్చి 5 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు వివో T4x 5G ఫోన్ (Vivo T4x 5G) విడుదల కానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫోన్ రూ.12 వేల ధరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన వివరాల ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌పైన పనిచేస్తుంది. మరియు 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh భారీ బ్యాటరీతో పనిచేస్తుంది. 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.72 అంగుళాల FHD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
ఐకూ నుంచి గత సంవత్సరం చివల్లో ఐకూ 13 హ్యాండ్‌సెట్ లాంచ్ కాగా.. మార్చి నెలలో ఐకూ నియో 10R ఫోన్ (iQOO Neo 10R) లాంచ్ కానుంది. మార్చి 11 గంటలకు ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఈ హ్యాండ్‌సెట్ సైతం భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది. ముఖ్యంగా గేమర్స్‌కు అనుకూలంగా ఉంటుందని ఐకూ చెబుతోంది.
ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా ఐకూ నియో 10R స్మార్ట్‌ఫోన్ 80W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 6400mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. మరియు 144Hz రీఫ్రెష్ రేట్‌తో 1.5K OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని సంస్థ తెలిపింది.


Click it and Unblock the Notifications